
రైతులను ముంచుతున్న కేంద్రం
► పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ జాదవ్
► సమావేశంలో మాట్లాడుతున్న నరేష్‌జాదవ్
ఆదిలాబాద్ క్రైం : కేంద్ర ప్రభుత్వం రైతులను నిలువునా మంచుతోందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ జాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట రుణాలపై 3 శాతం ఉన్న ప్రీమియంను 5 శాతానికి పెంచి రైతులను మరింత దెబ్బతీస్తోందన్నారు. ఎన్నికల సమయంలో రైతులను ఆందుకుంటామని ప్రలోభాలు పలికిన కేంద్రం ప్రస్తుతం కార్పోరేట్ వ్యాపారులకు ప్రీమీయాన్ని తగ్గిస్తూ రైతులకు పెంచడం దారుణమన్నారు.
ఆదిలాబాద్ పత్తికి ఎంతో డిమాండ్ ఉందని, గతంలో కేంద్ర ప్రభుత్వం పత్తిని ఇతర దేశాలకు ట్రాన్స్‌పోర్టు చేసేందుకు రాయితీ ఇచ్చేదని, ఇప్పుడు దానిని ఎత్తివేయడంతో ఆభారం తమపై ఎక్కడ పడుతుందనే ఉద్దేశంతోనే పత్తిసాగు చేయకూడదని ముఖ్యమంత్రి చెబుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చెర్మైన్‌లు సంజీవ్‌రెడ్డి, నర్సింగ్‌రావు, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాజీద్‌ఖాన్, పట్టణ అధ్యక్షుడు షకీల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అలాల్ అజయ్, మున్సిపల్ మాజీ చెర్మైన్ దిగంబర్‌రావు పాటిల్ తదితరులు ఉన్నారు.