పాస్‌బుక్ లేకుండా పంట రుణాలు
బ్యాంకర్లకు రెవెన్యూ శాఖ సూచన
సాక్షి, హైదరాబాద్: పాసు పుస్తకాలు లేకుం డానే రైతులు పంట రుణాలను పొందే సదు పాయం రెవెన్యూ శాఖ కల్పించింది. రైతుల పాస్‌పుస్తకాలు, పహాణీలు సమర్పించకున్నా పంట రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా బ్యాంకర్లకు సూచించారు. భూముల వివరాలను కచ్చితంగా తెలిపేలా ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను అందుబా టులోకి తెచ్చిందని, ఆన్‌లైన్‌లోనే వివరాలసు సరిచూసుకుని రుణాలు ఇవ్వవచ్చని పేర్కొ న్నారు.
ఎస్‌బీఐ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్‌మేనేజర్ హరిదయాళ్ ప్రసాద్ అధ్యక్ష తన బ్యాంకర్ల స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి, ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా, ఎల్‌ఎల్‌బీసీ కన్వీనర్ యు.ఎన్.ఎన్.మైయా, రిజర్వు బ్యాంకు ప్రతినిధి జె.మేఘనాథ్, సుబ్బయ్య పాల్గొన్నారు. ఒకే వ్యవసాయ భూమిపై ఒకటి కంటే ఎక్కువ మంది పంట రుణాలు తీసుకోకుండా వెబ్‌ల్యాండ్ పోర్టల్ ను వినియోగించుకోవచ్చని మీనా చెప్పారు. ఇప్పటికే 21 బ్యాంకులు ఈ పోర్టల్‌ను విని యోగిస్తున్నాయన్నారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజ నులో ఇప్పటివరకు 8,35,748 మంది రైతులకు రూ.6,056 కోట్ల పంట రుణాలను ఇచ్చినట్లు తెలిపారు. రైతులందరికీ ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన వర్తించేలా బ్యాంకర్లు రుణాలు రెన్యూవల్ చేయాలన్నా రు. వాతావరణ ఆధారిత బీమా పథకం అమలుచేస్తున్న మిరప పంటకు ప్రీమియం చెల్లింపు తేదీని జూలై 15 వరకు, పత్తి పంట కు జూలై 31 వరకు పొడిగించినట్లు తెలిపా రు. పత్తి సాగు రైతులు వాతావరణ ఆధారి త బీమా పథకాన్ని ఉపయోగించుకునేలా చూడాలన్నారు. బ్యాంకులన్నీ పంట రుణా లు, బీమా అమలు చేసేలా చర్యలు తీసుకుం టున్నాయని హరిదయాళ్ తెలిపారు.