లక్ష్యం 56 వేల కోట్లు! ఇచ్చింది 5 వేల కోట్లు!! | The goal of 56 thousand crores! 5 crore has | Sakshi
Sakshi News home page

లక్ష్యం 56 వేల కోట్లు! ఇచ్చింది 5 వేల కోట్లు!!

Published Mon, Sep 8 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

లక్ష్యం 56 వేల కోట్లు!  ఇచ్చింది 5 వేల కోట్లు!!

లక్ష్యం 56 వేల కోట్లు! ఇచ్చింది 5 వేల కోట్లు!!

ఖరీఫ్ సీజన్ సగం పూర్తరుు్యంది. సాధారణంగా అరుుతే రైతులు తాము గత సీజన్‌లో తీసుకున్న పంట రుణాలను తిరిగి చెల్లించేసి ,

ఏపీలో పంట రుణాల మంజూరు తీరిదీ..
 
రుణమాఫీ హామీతో రుణాలు తిరిగి చెల్లించని రైతులు
{పభుత్వం జీవోకే పరిమితం కావడంతో కొత్తగా రుణాలివ్వని బ్యాంకులు
ఇప్పట్లో రుణమాఫీ కాదంటూ పోస్టర్ల ద్వారా ప్రచారం
వడ్డీ కట్టి రెన్యువల్ చేయించుకోమంటూ రైతులపై ఒత్తిడి
 లేకుంటే వడ్డీ భారం, పంటల బీమా నష్టం తప్పదని హెచ్చరికలు
 

హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ సగం పూర్తరుు్యంది. సాధారణంగా అరుుతే రైతులు తాము గత సీజన్‌లో తీసుకున్న పంట రుణాలను తిరిగి చెల్లించేసి , కొత్త రుణాలు తీసుకుని సాగులో నిమగ్నమయ్యేవారు. కానీ ఈసారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎన్నికల ముందు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రుణమాఫీ చేస్తామంటూ రైతులకు హామీ ఇచ్చారు. ఆ పార్టీ నేతలైతే ‘బాబు రుణమాఫీ చేస్తారు.. రైతులు రుణాలు చెల్లించొద్దు..’ అంటూ ఏకంగా పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేశారు. దీంతో రైతులు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించలేదు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫీ అంటూ ప్రకటించారు. ఈ మేరకు పలు ఆంక్షలతో కూడిన జీవోను మాత్రం జారీ చేసి చేతులు దులుపుకున్నారు. అరుుతే బ్యాంకులు ఆ జీవోను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

రైతులకు కొత్త రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్నారుు. రైతులు లేదా ప్రభుత్వం రుణ బకారుులు చెల్లిస్తేగానీ కొత్తగా రుణాలు ఇవ్వలేమని తేల్చిచెబుతున్నారుు. ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో రైతులు పంట రుణాలు లభించక అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. వడ్డీతో కలసి తడిచిమోపెడైన రుణం తిరిగి చెల్లించలేక, కొత్త రుణం లభించక నానా అవస్థలూ పడుతున్నారు. ఆర్‌బీఐ సూచనల మేరకు రుణాలు చెల్లించిన రైతులకు మాత్రమే బ్యాంకులు కొత్త రుణాలను మంజూరు చేస్తున్నాయి. పాత రుణాలను రైతులైనా చెల్లించాలి, లేదా ప్రభుత్వమైనా చెల్లిస్తేనే ఈ ఖరీఫ్‌లో కొత్త రుణాలు ఇవ్వాలని, లేదంటే రుణాలు మంజూరు చేయరాదని బ్యాంకర్లు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు ఖరీఫ్‌లో బ్యాంకులు కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే పంట రుణాలుగా అందజేశారుు.

వాస్తవానికి ప్రస్తుత ఖరీఫ్‌లో పంట రుణాల మంజూరు లక్ష్యం రూ.56 వేల కోట్లు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఖరీఫ్ సీజన్ సగం పూర్తి అయినప్పటికీ కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే బ్యాంకులు రుణాలిచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం అవుతోంది. బ్యాంకులు రుణాలివ్వక పోవడం ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.+

గడువు మీరితే 13 శాతం వడ్డీ

ఆంధ్రాబ్యాంకు అయితే.. ఇప్పట్లో రుణ మాఫీ కాదని, పాత రుణాలను చెల్లించి కొత్త రుణాలను తీసుకోవాలని, ప్రభుత్వం డబ్బులిస్తే అప్పుడు రైతుల ఖాతాలకు జమ చేస్తామని పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేస్తోంది. రుణాలు ఓవర్ డ్యూస్ (గడువు మీరినవి) అవకుండా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉన్నందునే ఈ విధమైన ప్రచారం నిర్వహిస్తున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క బ్యాంకర్లు రైతులకు ఫోన్లు చేసి ఇప్పట్లో రుణ మాఫీ కాదని, తొలుత వడ్డీ చెల్లించి రుణాలను రెన్యువల్ చేయించుకోవాలని కోరుతున్నారు. పలానా తేదీలోగా వచ్చి వడ్డీ చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలని, లేదంటే వడ్డీ లేని రుణంతో పాటు, పంటల బీమా నష్టపోతారని నచ్చచెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం గత డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలను, అప్పటివరకు అరుున వడ్డీని మాత్రమే మాఫీ పరిధిలోకి తెస్తామని చెప్పడంతో.. జనవరి నుంచి వడ్డీ భారాన్ని రైతులే భరించాల్సి ఉంటుందని కూడా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. గడువు మీరిన రుణాలకు 13 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని, అందువల్ల వడ్డీ చెల్లించి రుణాలను రెన్యువల్ చేసుకోవాలని బ్యాంకర్లు రైతులకు సూచిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement