
మాఫీ సగమే..
రైతులు బ్యాంకు ద్వారా తీసుకున్న రూ. లక్ష లోపు పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అమలులో విఫలమవుతోంది.
♦ రూ.15,573 కోట్లకు ఇచ్చింది రూ.786 కోట్లు మాత్రమే
♦ విడతలవారీ విడుదలతో రైతుల్లో అసంతృప్తి
♦ మరో రెండు విడతల కోసం ఎదురు చూపులు
♦ లక్ష్యాన్ని అందుకోని కొత్త రుణాలు
ఇందూరు : రైతులు బ్యాంకు ద్వారా తీసుకున్న రూ. లక్ష లోపు పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అమలులో విఫలమవుతోంది. 2014-15, 2015-16 సంవత్సరాలకు సంబంధించిన రైతన్నల బాకీని బ్యాంకులకు సగం మాత్రమే చెల్లించింది. తమ రుణాలు మాఫీ అవుతాయని ఆశతో ఉన్న రైతులు ప్రభుత్వ తీరుతో దిగులు చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 3 లక్షల 79 వేల 520 మంది రైతులు రూ. లక్ష లోపు రుణాలు తీసుకున్నారు. అయితే ఈ పంట రుణాలకు వడ్డీని 3 శాతం కేంద్ర ప్రభుత్వానికి, 4 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం 7 శాతం వడ్డీని రైతులు బ్యాంకు ద్వారా చెల్లించారు.
రైతులు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిరిగి రైతులకు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటన తరువాత జిల్లాకు రూ.1,573 కోట్ల 60 లక్షలు మంజూరు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 25 శాతం చొప్పున రెండు సార్లు మొత్తం 50 శాతం మాత్రమే నిధులు విడుదల చేసి రుణ మాఫీ చేసిం ది. అంటే రూ. లక్ష రుణం తీసుకున్న రైతుకు రూ.50 వేలు చెల్లించింది. ఇంకా యాభై శాతం రుణ మాఫీ నిధులు జిల్లా కు రావాల్సి ఉంది. వీటిని ప్రభుత్వం మరో రెండు విడతలుగా మంజూరు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
అప్పుడు కొద్దిగా, ఇప్పుడు కొద్దిగా మాఫీ నిధులు విడుదల చేసేకంటే పూర్తిగా ఒకేసారి రుణ మాఫీ చేయాలని రైతులంటున్నారు. పూర్తిగా రుణం చెల్లిస్తేగానీ బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. కరువు నేపథ్యంలో పంటలు వేసేందుకు పెట్టుబడి లేక భూములను బీడుగానే వదిలేయాల్సిన పరిస్థితి నెల కొందని రైతులు వాపోతున్నారు.ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం మూడో విడత రుణ మాఫీ నిధు లు జిల్లాకు విడుదలయ్యే అవకాశం ఉంది.
లక్ష్యం చేరని కొత్త రుణాలు
రైతుల పంట రుణల మాఫీ విషయం ఇలాగుంటే కొత్త రు ణాల పరిస్థితి కూడా సగం వరకే పరిమితమైంది. 2015- 16 సంవత్సరానికి గాను ప్రభుత్వ లక్ష్యం రూ.3,012 కోట్లు ఉండగా, కొత్తవి, రెన్యూవల్ కలిపి రూ.1,921 కోట్లు మాత్రమే రైతులకు పంట రుణాలు అందించారు. దాదాపు 4 లక్షల మంది రైతులు పంట రుణాలు పొందారు. లక్ష్యం లో ఇంకా రూ.1,091 కోట్ల పంట రుణాలను రైతులకు అందించాల్సి ఉంది. అయితే రైతులు గతంలో తీసుకున్న రుణాలు పూర్తి గా కట్టకపోవడం, ప్రభుత్వం రుణ మాఫీ పూర్తిగా చెల్లించకపోవడంతో బ్యాంకర్లు రైతులకు రుణాలివ్వడానికి ముం దుకు రాలేదు. రైతులు బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పాత రైతులకే రుణాలు అందాయి. అంతే తప్పా కొత్త రైతులకు రుణాలు ఇవ్వలేదు. రైతులు రుణాలు తీసుకోకపోవడానికి కరువు కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే రైతులు తీసుకున్న కొత్త రుణాలకు కూడా 7 శాతం వడ్డీని ప్రభుత్వానికి బ్యాంకు ద్వారా చెల్లిస్తున్నారు.
బడ్జెట్ సమావేశాల తరువాత..
జిల్లాకు అవసరమున్న రుణ మాఫీ నిధుల్లో ఇప్ప టి వరకు ప్రభుత్వం రెండు విడతలుగా కలిపి 50 శా తం నిధులను బ్యాంకులకు చెల్లించింది. మరో రెండు విడతల్లో నూటికి నూరు శాతం రుణ మాఫీ కానుంది. అ సెంబ్లీలో బడ్జెట్ సమావేశాల అనంతరం మూడో విడత రుణ మాఫీ నిధుల ను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే కొత్త రుణాల లక్ష్యంలో 60 శాతం లక్ష్యం చేధించాం. జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నందున రైతులు పంటలు వేసేం దుకు ఎవరు ముందుకు రాలేదు. అందుకే పంట రుణాలు కూడా రైతులు అంతగా పొందలేదు. - నర్సింహ, వ్యవసాయ శాఖ, జేడీఏ