⇒ మూడో విడతలో రెండో సగం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
⇒ వచ్చే ఏడాది ఒకేసారి ఆఖరి విడత చెల్లింపునకు యోచన
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూడో విడతకు సంబంధించిన రెండో సగం నిధులు రూ.2,019.19 కోట్లను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులకు సంబంధించి మూడు వంతుల రుణాన్ని ప్రభుత్వం తిరిగి బ్యాంకులకు చెల్లించినట్లైంది. మొత్తం 36 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.17 వేల కోట్ల రుణాల మాఫీ పథకాన్ని టీఆ ర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసింది. 4 విడతల్లో మాఫీ నిధులను బ్యాంకులకు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
తొలి ఏడాది రూ.4,250 కోట్లు ఒకే సారి విడుదల చేసింది. గతేడాది జూన్, సెప్టెంబ ర్‌లో 2 దశల్లో రూ.4,086 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది నిధుల విడుదల ఆలస్యమైంది. జూలై 1న మొదటి దఫాగా రూ.2,019 కోట్లు చెల్లిం చింది. 3 నెలల తర్వాత మిగతా రూ.2,019 కో ట్లు విడుదల చేసింది. వచ్చే ఏడాది నాలుగో విడ త చెల్లింపులతో ఈ పథకం ముగియనుంది. బ్యాంకులకు నిధులు చేరటం ఆలస్యమవటంతో కొన్ని జిల్లాల్లో బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీ వసూలు చేసినట్లు విమర్శలు చుట్టుముట్టారుు. అందుకే వచ్చే ఏడాది చివరి విడత నిధులను ఒకేసారి విడుదల చేయాలని ఇటీవలే కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
లెక్కతేలింది రూ.16,160 కోట్లు..
రైతు రుణమాఫీకి సంబంధించిన లెక్కతేలింది. మొత్తం రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆరంభంలో ప్రకటించింది. 36 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ పథకం అమల్లో భాగంగా రెండో ఏడాది బోగస్ రైతులు, రెండేసి ఖాతాలున్న రైతులు కొందరిని ప్రభుత్వం ఏరివేసింది. దీంతో మాఫీ మొత్తం రూ.16,160 కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ తాజాగా అంచనాకు వచ్చింది. ఇప్పటివరకు రూ.12,375 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మొత్తం 35.30 లక్షల రైతుల రుణాలు మాఫీ అయ్యాయని, బ్యాంకుల బ్రాంచీల వారీగా లబ్ధిదారుల జాబితాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మిగతా రూ.3,785 కోట్లు విడుదల చేస్తే ఈ పథకం సంపూర్ణంగా విజయవంతమవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారుు.
దశలవారీగా చెల్లింపులు
2014 సెప్టెంబర్: రూ.4,250 కోట్లు
2015 జూన్: రూ.2,043 కోట్లు
2015 జూలై: రూ.2,043 కోట్లు
2016 జూలై: రూ.2,019 కోట్లు
2016 నవంబర్: రూ.2,019 కోట్లు
రుణమాఫీకి రూ.2,019 కోట్లు
Published Wed, Nov 9 2016 4:12 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement