రైతుల నుంచి వడ్డీ వసూలు | Interest Charge From farmers | Sakshi
Sakshi News home page

రైతుల నుంచి వడ్డీ వసూలు

Published Mon, Jul 18 2016 1:16 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

Interest Charge From farmers

  • ప్రభుత్వ ఆదేశాలను పాటించని బ్యాంకర్లు
  • రుణాలను రెన్యూవల్‌ చేసుకునే సమయంలో వడ్డీని చెల్లించాలంటున్న బ్యాంకర్లు
  • వడ్డీ మాఫీని ప్రభుత్వం నిధులు ఇచ్చిన తరువాత..
  • రీయింబర్స్‌మెంట్‌ రూపంలో ఖాతాల్లో జమ చేస్తామంటున్న బ్యాంకర్లు
  • ఇబ్బందులు పడుతున్న రైతులు
  • మోర్తాడ్‌ : ‘పంట రుణాలు పొందిన రైతుల నుంచి బ్యాంకర్లు ఎలాంటి వడ్డీ వసూలు చేయవద్దు, రూ. లక్షలోపు రుణం పొందిన వారికి జీరో వడ్డీ వర్తిస్తుంది. రూ. 3 లక్షల వరకు రుణం తీసుకున్న వారికి పావలా వడ్డీ వర్తిస్తుంది. బ్యాంకర్లు సహకరించి రైతుల నుంచి ఎలాంటి వడ్డీ వసూలు చేయవద్దు. వడ్డీకి సంబంధించిన నిధులను ప్రభుత్వం త్వరలో బ్యాంకులకు అందిస్తుంది. రైతులను బ్యాంకర్లు ఇబ్బంది పెట్టవద్దు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో స్పష్టం చేసిన మాట. కాని క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా బ్యాంకర్లు వ్యవహరిస్తున్నారు. పంట రుణాలను రెన్యూవల్‌ చేసుకునే రైతుల నుంచి వడ్డీని రైతులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పంట రుణాలపై రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. ఇందులో కేంద్రం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీ భారాన్ని మోస్తుంది. రూ. లక్షలోపు పంట రుణం పొందిన రైతుకు జీరో వడ్డీ వర్తిస్తుంది. రూ. 3 లక్షల వరకు పంట రుణం పొందిన రైతులకు పావలా వడ్డీ వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట రుణాలకు సంబంధించిన వడ్డీ కోసం ప్రతియేటా నిధులు విడుదల చేస్తా యి. అయితే పంట రుణాల మాఫీకి ముందు రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను చెల్లించి మళ్లీ తీసుకున్న తరువాత వడ్డీకి సంబంధించిన సొమ్ము రీయింబర్స్‌మెంట్‌ రూపంలో వాపసు వచ్చేది. రూ. లక్షలోపు పం ట రుణం మాఫీ అయిన తరువాత రైతులు బ్యాంకుల్లో రుణాలను రెన్యూవల్‌ చేసుకుంటున్నారు. కాగా సకాలంలో పంట రుణాలను రెన్యూవల్‌ చేసుకున్న వారికి మాత్రమే రుణమాఫీకి సంబంధించిన సొమ్ము ఖాతాల్లో జమ అవుతుందని బ్యాంకర్లు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా పంట రుణాలను రె న్యూవల్‌ చేసుకునే రైతులు వడ్డీని చెల్లించాలని బ్యాంకర్లు ఆదేశిస్తున్నారు. రూ. లక్ష వరకు ఉన్న పంట రుణానికి సంబంధించి రైతులు రెన్యూవల్‌ చేసుకుంటే రూ. 5 వేల నుంచి రూ. 7 వేల వరకు వడ్డీ భారం మోయాల్సి వస్తుం ది. రూ. లక్షకు మించిన పంట రుణం ఉంటే రూ. 10వేలకు పైగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ వడ్డీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ కావడానికి కొంత సమయం పడుతుంది. అయితే రా ష్ట్రంలో రెండేళ్ల నుంచి కరువు పరిస్థితులు నెల కొనడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా రు. బ్యాంకుల్లో రెన్యూవల్‌ చేసుకునే పంట రుణాలకు వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మూడో విడత రుణ మాఫీకి సంబంధించిన నిధులను బ్యాంకులకు విడుదల చేయకపోవడంతో రైతులు వడ్డీ భారం మోయడం తప్ప చేతికి మాఫీ సొమ్మును అందుకోలేక పోతున్నారు. రుణమాఫీకి సంబంధించిన సొమ్మును విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో రైతులకు మాఫీ సొమ్ము అందలేకపోతుంది. జిల్లా వ్యాప్తంగా 4.73 లక్షల మంది పట్టాదారులు ఉండగా ఇందులో 3.79 లక్షల మంది పంట రుణాలను పొందారు. పంట రుణాలు పొందిన వారి నుం చి రెన్యూవల్‌ సమయంలో వడ్డీని రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వసూలు చేస్తున్నామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ తమకు రిజర్వు బ్యాంకు నుంచి ఆదేశాలు అందితేనే వడ్డీ వసూలు నిలిపివేస్తామని బ్యాం కర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సకాలంలో వడ్డీ సొమ్ముతోపాటు, మాఫీ నిధులు విడుదల చేస్తే రైతులకు ఇబ్బందులు తప్పుతాయని బ్యాంకర్లు చెబుతున్నారు. కాగా ప్రభుత్వం ఇ స్తున్న ఆదేశాలకు బ్యాంకుల్లో పరిస్థితికి భిన్నమైన తేడాలు ఉండడంతో రైతులు ఇక్కట్లు ప డుతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement