రైతులందరికీ ఖరీఫ్ రుణాలు khareef loans for all formers | Sakshi
Sakshi News home page

రైతులందరికీ ఖరీఫ్ రుణాలు

Published Fri, Jul 1 2016 1:42 AM

రైతులందరికీ ఖరీఫ్ రుణాలు

మూడో విడత రుణమాఫీ కోసం చూడొద్దు
బ్యాంకర్లకు ఏజేసీ వెంకటేశ్వర్లు ఆదేశం

 సాక్షి, సంగారెడ్డి: రైతులందరికీ పంట రుణాలు రెన్యువల్ చేయాలని అదనపు జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడో విడత రుణమాఫీ నిధుల కోసం ఎదురుచూడకుండా ఖరీఫ్ పంట రుణాలు అందజేయాలన్నారు. పంట నష్టాల కింద బ్యాంకర్లు అందించిన సబ్సిడీని రైతులకు అందించాలని, లేనిపక్షంలో తిరిగి పంపించాలన్నారు. కేంద్రం స్టాండప్ ఇండియా పథకం కింద ప్రతి బ్యాంకు తప్పనిసరిగా ఇద్దరు ఎస్సీ, ఎస్టీ మహిళలను ఎంపిక చేసి రుణాలు మంజూరు చేయాలని సూచించారు.

ఐదువేల జనాభా  దాటిన గ్రామాల్లో కొత్త బ్రాంచీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదలను సిద్ధం చేయాలన్నారు. బ్యాంకుల ప్రా రంభోత్సవాలు, రుణమేళాలకు తప్పనిసరిగా స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్ మాట్లాడుతూ... ఎస్సీ కార్పొరేషన్ కింద సబ్సిడీ విడుదలైన యూనిట్లను వెం టనే గ్రౌండింగ్ చేయాలని బ్యాంకర్లను కోరారు. బీసీ కార్పొరేషన్ ఈడీ రాంరెడ్డి మాట్లాడుతూ... 2015-16 సంవత్సరానికి  సంబంధించి 95 శాతం లబ్ధిదారుల ఖాతాలు ప్రారంభించినట్టు తెలిపారు. సబ్సిడీని 15 రోజుల్లో విడుదల చేస్తామన్నారు. గిరిజన సంక్షేమశాఖ అధికారి జగ్మాల్‌సింగ్ మాట్లాడుతూ... 2016-17 సం వత్సరానికి 421 యూనిట్లను లక్ష్యంగా నిర్దేశించుకోవటం జరిగిందన్నారు. వీటి గ్రౌండింగ్‌కు సహకరించాలని కోరారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. 2016-17 సంవత్సరానికి జిల్లాలో రూ.695 కోట్ల బ్యాంకు రుణాలు మహిళా సంఘాలకు ఇవ్వాల్సి ఉందన్నారు. లక్ష్యం మేరకు బ్యాంకర్లు రుణా లు ఇవ్వాల్సిందిగా కోరారు. కొన్ని బ్యాంకులు మహిళా గ్రూపుల పొదుపు ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయనివ్వటంలేదని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరా రు. ఆర్‌బీఐ డీడీఎం గణేశన్ మాట్లాడుతూ.. సొలార్ ఎనర్జీ, లాంగ్ టైమ్ ఏరియా బేస్‌డ్ పథకాల కింద డెయిరీ, వెజిటబుల్, గొర్రెల పెంపకం యూనిట్ల కోసం జిల్లాకు రూ.వెయ్యి కోట్లు కేటాయించటం జరి గిందన్నారు.

ఈ పథకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అర్హులకు రుణాలు అందించాలన్నారు. పంటల బీమా కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో నూనెగిం జలు, పప్పు ధాన్యాలపై బీమా ప్రీమియం రెండు శాతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. కూరగాయలు, వాణిజ్య పంటలపై ఐదు శాతం, రబీలో అన్ని పంటలకు 1.5 శాతం బీమా ప్రీమియం నిర్ణయించినట్లు వివరించారు. సమావేశంలో ఎల్‌డీఎం రఘురాం, నాబార్డు డీడీఎం జి.రమేశ్, బ్యాంకు కోఆర్డినేటర్లు, మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement