ఆఖరున హడావుడి
ఖరీఫ్ సీజన్ మొదలయ్యాక నాలుగు నెలలపాటు రుణంపై దోబూచులాడుకున్న ప్రభుత్వం, బ్యాంకర్లు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. రుణ మాఫీతో కొత్తరుణాల మంజూరుకు లంకె పెట్టుకుని కూర్చున్న బ్యాంకర్లు... ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడంతో ఎవరికీ కొత్త రుణాలు ఇవ్వలేదు. సీజన్ లక్ష్యంగా జిల్లాలో రూ.900 కోట్లు నిర్ణయించుకుని... నాలుగు నెలల్లో రూ.350 కోట్లు మాత్రమే రైతులకందించారు. రైతులకు రుణమాఫీ కింద 25 శాతం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. మాఫీ డబ్బులు ఖజానాకు చేరడంతో బ్యాంకర్లు, జిల్లా ఉన్నతాధికారులు సోమవారం సమీక్ష నిర్వహించారు. సీజన్ రుణాల మంజూరుకు మంగళవారమే ఆఖరు రోజు కాగా, స్పెషల్ డ్రైవ్ పేరిట ఈ ఒక్కరోజులోనే రూ.550 కోట్లు రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. నాలుగు నెలల్లో చేయలేని పని ఒక్కరోజులోనే చేస్తామంటున్నారు.
- పంటరుణాల మంజూరుకు నేడే ఆఖరు
- బ్యాంకర్లతో సమీక్షించిన కలెక్టర్
- నేడు స్పెషల్‌డ్రైవ్
- ఇప్పటికీ స్పష్టతరాని రుణమాఫీ
కరీంనగర్ అగ్రికల్చర్ : రైతులకు రుణాల మంజూరులో మొదట నిర్లక్ష్యం వహించిన బ్యాంకర్లు, ప్రభుత్వం ఇప్పుడు హడావుడి చేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్‌కు గాను జిల్లాలో రూ. 900 కోట్ల పంటరుణాలు మంజూరు చేయూలని బ్యాంకర్లు లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటివరకు రూ.350 కోట్లు మాత్రమే రుణాలిచ్చారు. ఇంకా రూ.550 కోట్లు మంజూరు చేయూల్సి ఉంది. అయితే రుణమాఫీ చేస్తామన్న సర్కార్ హామీ మేరకు రైతులు గడిచిన కాలమంతా ఎదురుచూశారు. కొత్త రుణాల కోసం వెళ్తే.. పాతబకారుులు కడితేనే తిరిగి రుణం మంజూరు చేస్తామని తెగేచి చెప్పడంతో అన్నదాతలు డైలామాలో పడ్డారు.
10 శాతం మంది వడ్డీకి భయపడి రెన్యూవల్ చేసుకున్నారు. రుణమాఫీ విషయంలో సాగదీయడం..అర్హులను వడపోత.. స్పష్టత లేకపోవడం.. బ్యాంకర్లు ససేమిరా అనడం.. ఇలా చర్చోపచర్చల అనంతరం సమస్య ఓ కొలిక్కి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 3,73,877 మంది రైతులకు రూ. 1656 కోట్లు మాఫీ చేయూల్సి ఉంది. మొదటి విడతలో రూ.414.21 కోట్లు విడుదల చేశారు. ఇదంతా పూర్తయ్యే వరకు ఖరీఫ్ ‘కాలం’ అరుుపోరుుంది. ప్రభుత్వ నిర్ణయం కాదనలేదని అనకుండా మంగళవారం ఒక రోజు రుణమంజూరుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నాలుగు నెలల కాలాన్ని ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లని బ్యాం కర్లు ఒక్క రోజుల్లో రుణ మంజూరులో లక్ష్యం ఎలాచేరుతారో వారికే తెలియూలి. చివరికి రుణాలు తీసుకోవ డానికి రైతులే ముందుకు రాలేదని చెబుతారో ఏమో!. ఎంతైనా రైతులు అమాయకులే కదా!
బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్ష...
కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరీఫ్ పంటరుణాల మంజూరుపై కలెక్టర్ వీరబ్రహ్మయ్య బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రుణమాఫీకిగాను మొదటివిడత విడుదలైన నిధులను రైతులకు జమచేసి యుద్ధప్రాతిపదికన మంగళవారం ఒక్కరోజే ఖరీఫ్ పంటరుణాలు మంజూరు చేయూలని సూచించారు. తహశీల్దార్ పరిధిలోని ప్రతి బ్యాంకు ఒక రెవెన్యూ అధికారిని డిప్యూట్ చేయూలని ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్లు మండల కేంద్రంలో ఉంటూ పంటరుణాల మంజూరు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.