పంట రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవాలని అధికారులు చెప్పడంతో రైతులు ఒక్కసారిగా బ్యాంకు తరలివచ్చిన సంఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
నవాబుపేట: పంట రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవాలని అధికారులు చెప్పడంతో రైతులు ఒక్కసారిగా బ్యాంకు తరలివచ్చిన సంఘటన సో మవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల పరిధిలో ని న వాబుపేట, ఎత్‌రాజ్‌పల్లి గ్రా మాల్లో ఆదివారం రాత్రి పంట రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి నాగలక్ష్మి చాటి ంపు వేయించారు. దాం తో రెం డు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు మండల కేంద్రంలోని స్టేట్ బ్యాం కుకు వచ్చారు.
అయితే బ్యాంకు మేనేజర్ పోస్టు గత 20 రోజులుగా ఖాళీగా ఉంది. కొత్త మేనేజర్ శ్రీనివాస్ సోమవారం ఉదయ మే వచ్చారు. ఇంత మంది రైతులు వచ్చారేమని మేనేజర్ ఆరా తీయగా రీషెడ్యూల్ కోసమని రైతులు తెలిపారు. తమకు ఇప్పటి వరకు హెడ్‌ఆఫీస్ నుంచి ఆదేశాలు రాలేదని రైతులతో తెలిపారు. అనంతరం ఆయన వ్యవసాయాధికారిని పిలిచి విషయం చెప్పారు.
రీ షెడ్యూల్ చేయమని తమకు ఆదేశాలు వచ్చాయని ఏవో మేనేజర్‌తో తెలిపారు. 2013 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2013 వరకు రుణాలు తీసుకున్న రైతుల లిస్టు తయారు చేసి వారిని మాత్రమే బ్యాంకుకు పిలిపించాలని వ్యవసాయాధికారి, మేనేజర్ నిర్ణయించారు. లిస్టు తయారు చేసి ఆదర్శ రైతుల ద్వారా సదరు రైతులకు తెలియజేస్తామని మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. దాంతో బ్యాంకుకు వచ్చిన రైతులందరూ ఈసురోమని తిరిగి వెళ్లారు.