re-schedule
-
పలు రైళ్లు రద్దు, రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం: భద్రత, ఆధునికీకరణ పనుల కారణంగా విశాఖపట్నం నుంచి, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆయా తేదీల్లో రద్దు చేశారు. మరికొన్ని రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న విశాఖపట్నం–రాయ్‌పూర్(08527/08528) పాసింజర్ స్పెషల్ ఇరువైపులా రద్దయింది. షెడ్యూల్ చేసిన రైళ్లు ► ఈ నెల 3న విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్ (12807) సమతా ఎక్స్‌ప్రెస్ విశాఖలో గంట ఆలస్యంగా బయలుదేరుతుంది. ► ఈ నెల 3న అమృత్సర్–విశాఖపట్నం (20808) హిరాకుడ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అమృత్‌సర్‌లో 5 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ► ఈ నెల 4న సికింద్రాబాద్–భువనేశ్వర్(17016) విశాఖ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌లో 4 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ► ఈ నెల 4న చైన్నె సెంట్రల్–హౌరా (12840) మెయిల్ చైన్నె సెంట్రల్లో 4 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ► ఈ నెల 4న వాస్కోడగామా–షాలిమార్ (18048) అమరావతి ఎక్స్‌ప్రెస్ వాస్కోడగామాలో 4 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. గమ్యం కుదించిన రైళ్లు ► విశాఖపట్నం–కిరండూల్ (18514) నైట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ► కిరండూల్–విశాఖపట్నం (18513) నైట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 5 నుంచి 12 వ తేదీ వరకు దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ► విశాఖపట్నం– కిరండూల్ (08551) పాసింజర్ స్పెషల్ ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ► కిరండూల్– విశాఖపట్నం(08552) పాసింజర్ స్పెషల్ ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ► ఈ నెల 4న రామేశ్వరం–భువనేశ్వర్ (20895), బెంగళూరు–భువనేశ్వర్(18464) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లు మార్గమధ్యలో 45 నిమిషాలు, 30 నిమిషాలు నిలిపివేస్తారు. -
ప్రస్తుతానికి 20% రుణాలే చెల్లింపు
మిగతా రుణాలన్నీ నాలుగు దఫాలుగా చెల్లిస్తాం: సీఎం చంద్రబాబు జనవరి నుంచి రైతు సాధికారిత సంస్థ ద్వారా రుణాలు కేసీఆర్ అనుభవ రాహిత్యంతోనే తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలు నెల్లూరు: రైతుల రుణాల్లో ఈ నెల 22న 20 శాతం, మిగతావి పది శాతం వడ్డీతో నాలుగు విడతలుగా బ్యాంకులకు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. నెల్లూరు రూరల్ మండలం వెంకటేశ్వపురం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో, వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాలను రీ షెడ్యూల్ చేరుుస్తానని, రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవచ్చని అన్నారు. జనవరి నుంచి రైతు సాధికారిత సంస్థ ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డ్వాక్రా రుణాల మాఫీలో భాగంగా రూ.10 వేలు చొప్పున చెల్లించనున్నామన్నారు. వడ్డీ మొత్తాన్ని చెల్లించడంతో పాటుగా తిరిగి వడ్డీ లేని రుణాలిప్పిస్తామని చెప్పారు. నాలుగు నెలల్లో 900 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం ద్వారా విద్యుత్ కోతలను అధిగమించామని చంద్రబాబు పేర్కొన్నారు. జూన్ నుంచి మరో 2వేల మెగావాట్ల విద్యుత్‌ను కొంటున్నామన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కర్నూలు, అనంతపురంలలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. 4 వేల మెగావాట్లు ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ద్వారా, అందులో 85 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేలా రూపకల్పన చేశామని చెప్పారు. కృష్ణపట్నంలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. దాన్ని కూడా ఉపయోగించుకుని 24 గంటలూ ప్రజలకు విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుభవ రాహిత్యంతో ఆ రాష్ట్ర ప్రజలు కరెంటు కష్టాలు పడుతున్నారని విమర్శించారు. సభలో ఎర్రచందనం దొంగలున్నారా: సీఎం వెలుగొండ అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్ల భరతం పడతానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. డక్కిలి గురుకుల కళాశాల గ్రౌండ్లో మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారి తోకలైనా కత్తింరించడం ఖాయమన్నారు. వీరు శేషాచలం, వెలుగొండ అడవులు మొదలకుని హిమాచలం వరకు ఎర్రచందనం నరికి చెన్నైకి తరలిస్తున్నారన్నారు. ఈ సభలో ఎవరైనా ఎర్రచందనం దొంగలు ఉన్నారా అని అడిగారు. దీంతో ప్రజా ప్రతినిధులు సీఎం వైపు చూసి మిన్నకుండిపోయారు. పారిశ్రామిక, పర్యాటక హబ్‌గా నెల్లూరు నెల్లూరు జిల్లాలో సమృద్ధిగా వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని జిల్లాను పారిశ్రామిక, పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని బాబు అన్నారు. వెంకటగిరి నుంచి ఏర్పేడు వరకు ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు పింఛనుదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. డక్కిలి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
రీషెడ్యూల్ కోసం తరలి వచ్చిన రైతులు
నవాబుపేట: పంట రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవాలని అధికారులు చెప్పడంతో రైతులు ఒక్కసారిగా బ్యాంకు తరలివచ్చిన సంఘటన సో మవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల పరిధిలో ని న వాబుపేట, ఎత్రాజ్పల్లి గ్రా మాల్లో ఆదివారం రాత్రి పంట రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి నాగలక్ష్మి చాటి ంపు వేయించారు. దాం తో రెం డు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు మండల కేంద్రంలోని స్టేట్ బ్యాం కుకు వచ్చారు. అయితే బ్యాంకు మేనేజర్ పోస్టు గత 20 రోజులుగా ఖాళీగా ఉంది. కొత్త మేనేజర్ శ్రీనివాస్ సోమవారం ఉదయ మే వచ్చారు. ఇంత మంది రైతులు వచ్చారేమని మేనేజర్ ఆరా తీయగా రీషెడ్యూల్ కోసమని రైతులు తెలిపారు. తమకు ఇప్పటి వరకు హెడ్ఆఫీస్ నుంచి ఆదేశాలు రాలేదని రైతులతో తెలిపారు. అనంతరం ఆయన వ్యవసాయాధికారిని పిలిచి విషయం చెప్పారు. రీ షెడ్యూల్ చేయమని తమకు ఆదేశాలు వచ్చాయని ఏవో మేనేజర్‌తో తెలిపారు. 2013 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2013 వరకు రుణాలు తీసుకున్న రైతుల లిస్టు తయారు చేసి వారిని మాత్రమే బ్యాంకుకు పిలిపించాలని వ్యవసాయాధికారి, మేనేజర్ నిర్ణయించారు. లిస్టు తయారు చేసి ఆదర్శ రైతుల ద్వారా సదరు రైతులకు తెలియజేస్తామని మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. దాంతో బ్యాంకుకు వచ్చిన రైతులందరూ ఈసురోమని తిరిగి వెళ్లారు. -
న్యాయం చేయండి
యాచారం: రుణమాఫీ వర్తించని రైతులతో యాచారం తహసీల్దార్ కార్యాలయం శుక్రవారం దద్దరిల్లింది. 2010లో మండల పరిధిలోని మాల్లో అప్పటి ఆంధ్రాబ్యాంకు మేనేజర్ రీ షెడ్యూల్ చే యడంతో పాటు టర్మ్ లోను ఇచ్చినట్లు రికార్డులు మార్చాడు. దీంతో బ్యాంకు పరిధిలో ఉన్న నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లోని 409 మంది రైతులకు రుణమాఫీ వర్తించకుండా పోయింది.తమకు న్యాయం చేయాలంటూ రైతులు వారం రోజులు గా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు మాఫీ రైతుల లిస్టును గ్రామాల్లో ప్రకటించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురైన వివిధ గ్రామాల బాధిత రైతులు శుక్రవారం పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎంపీపీ రమావత్ జ్యోతి శ్రీనివాస్ నాయక్, జెడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరిపల్లి అంజయ్య యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాలె మల్లేష్, మంతన్‌గౌరెల్లి ఎంపీటీసీ అరవింద్‌నాయక్ తదితరులు రైతులకు మద్దతుగా నిలిచారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆం దోళన సాయంత్రం 4 గంటల దాకా కొ నసాగింది. తహసీల్దార్ వసంతకుమారి విషయాన్ని ఉన్నతాధికారులకు ఫోను ద్వారా సమాచారం అందించారు. వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ విజయకుమార్‌తో పాటు బ్యాంకు ఉన్నతాధికారులు 4 గంటలకు అక్కడికి చేరుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చిం చారు. అప్పట్లో మేనేజర్ 409 మందికి రుణాలు రీ షెడ్యూల్ చేయడంతో టర్మ్ లోను కింద మార్చినట్లు, అందులో 250 మందికి పైగా రైతులకు సమాచారం తెలియకుండానే సంతకాలు పెట్టినట్లు ఉందని ప్రస్తుత బ్యాంకు మేనేజర్ ప్రభాకర్ అధికారుల దృష్టికి తెచ్చారు. బ్యాంకు మేనేజర్ తప్పిదం వల్లే రైతులకు మాఫీ వర్తించకుండా పోతోందని, రైతులకు న్యాయం చేసే వరకు రుణమాఫీ పైనల్ లిస్టును ప్రకటించవద్దని ఎంపీపీ, జెడ్పీటీసీలు డిమాండ్ చేశారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని జేడీఏ విజయకుమార్ ఇచ్చిన హామీతో రైతులు తమ ఆందోళన విరమించారు. -
‘మాఫీ’ ఘోరం
సాక్షి, ఒంగోలు: పంట రుణాల మాఫీపై ప్రభుత్వ దోబూచులాట..రైతుల్లో తీవ్ర గందరగోళాన్ని నింపుతోంది. బంగారం, పంటలపై తీసుకున్న రుణాలన్నింటిలో కుటుంబానికి రూ.1.50 లక్ష మాఫీ అని ప్రభుత్వం ప్రకటించింది. ఆ కాస్త రుణమైనా మాఫీ అవుతుందా..? అంటే ఆదీ ఒక పట్టాన తేలడం లేదు. కనీసం, రుణాల రీషెడ్యూల్ చేసి కొత్తరుణాలైనా ఇస్తారా..? అంటే, ‘మాఫీ’ ఘోరం అందుకు బ్యాంకర్లు సవాలక్ష కొర్రీలేస్తున్నారు. ఎటూ.. ప్రీమియం చెల్లింపు లేకపోవడంతో ఈసారి పంటలబీమా పథ కాన్ని రైతులు కోల్పోయారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు రైతులు ప్రీమియం చెల్లించి బీమా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బ్యాంకులు కొత్తరుణాలను పంపిణీ చేయనప్పుడు.. ప్రీమియం ఏవిధంగా మినహాయింపు అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 4 లక్షల మంది రైతులపై ఉన్న గడువు మీరిన బకాయిల మొత్తం రూ.5.900 కోట్లుండగా, ప్రభుత్వం నిర్దేశించిన 2013 డిసెంబర్ 31లోగా ఉన్న బకాయిలు రూ.3400 కోట్లున్నాయి. రుణమాఫీ అమలుపై ప్రభుత్వం ఆలస్యం చేసిన నిర్వాకానికిగాను ప్రతీరైతుపై 12.5 శాతం వడ్డీ భారం పడింది. సాధారణంగా గడువులోగా చెల్లించే బకాయిలపై 7 శాతం వడ్డీలో ప్రభుత్వ సబ్సిడీ మినహాయిస్తే లబ్ధిదారుడు 4 శాతం వడ్డీ మాత్రమే భరించేవాడు. అయితే, ప్రభుత్వం చేసిన ఆలస్య తప్పిదానికి అదనంగా 8 శాతం వడ్డీని భరించాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా రైతుల దగ్గర్నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డుల జిరాక్స్‌లను తీసుకుంటున్న బ్యాంకర్లు..కొన్ని మండలాల్లో మాత్రం ఆర్బీఐ నిబంధనలంటూ కొన్ని అంశాల్ని లేవనెత్తి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులందుతున్నాయి. -
రీ షెడ్యూల్‌పై ఆశలు ఆవిరి!
రైతు రుణాల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి హైదరాబాద్: రైతు రుణాల రీ షెడ్యూల్‌పై రాష్ర్ట ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. దీనితో ప్రత్యామ్నాయ మార్గాల వేటలో పడింది. రుణాలు రీ షెడ్యూల్ అవుతాయని నిన్నటి వరకు భావించిన ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ మీడియాతో మాట్లాడుతూ రీ షెడ్యూల్‌పై వ్యక్తం చేసిన అభిప్రాయాల నేపథ్యంలో పునరాలోచనలో పడిం ది. రీ షెడ్యూల్‌తో కొంతమేరకు ప్రభుత్వంపై తక్షణ భారం తగ్గుతుందని భావించినా... ఇప్పుడాపరిస్థితి కూడా లేకపోవడంతో నిధుల సమీకరణ ఎలా అన్న అంశంపై దృష్టి పెట్టింది. బాండ్లద్వారా నిధుల సేకరణ, సెక్యురిటీ గ్యారెంటీ, భూముల విక్రయం, బడ్జెట్లో బ్యాంకులకు చెల్లించే మొత్తాన్ని కేటాయించడం వంటివి మినహా మరో మార్గం లేదని ఉన్నతాధికారవర్గాలు స్పష్టంచేశాయి. కాగా, మంగళవారం ఆర్బీఐకి లేఖ రాశామనీ, దానికి స్పష్టమైన సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రుణాల రీ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్‌కు చేస్తే... తెలంగాణకు కూడా అది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. ఆర్బీఐ నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు తాము పూర్తిగా ఆశ వదులుకోలేమని చెబుతూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంటల దిగుబడిపై జిల్లాను యూనిట్‌గా తీసుకుని.. రిజర్వ్‌బ్యాంకు నిబంధనల కంటే ఎక్కువ దిగుబడి ఉన్నందున రీ షెడ్యూల్ ఎలా చేస్తామంటూ కొర్రీలు వేస్తున్నారని, కాని మండలాల వారీగా పరిశీలిస్తే.. చాలా మండలాల్లో దిగుబడి తక్కువగా ఉందని, పైలాన్ తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం అంటోంది. గతంలో రుణాల రీ షెడ్యూల్‌పై ఆర్బీఐ ఏనాడు ఇలా ఇబ్బందులు సృష్టించలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం 60 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసినప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయని ఆర్బీఐ ఇప్పుడే ఎందుకు చేస్తోందని ప్రభుత్వంలో ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించారు. నిధుల సమీకరణ ఎలా చేస్తారన్న ప్రశ్నకు మాత్రం ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేయడం గమనార్హం. ప్రస్తుతం రైతులు రుణాలు చెల్లిస్తే.. వారికి రీయింబర్స్ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నారు. అది తప్ప మరోమార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. -
రుణమాఫీ ఎగవేతకు బాబు కుట్ర: చెవిరెడ్డి
హైదరాబాద్ : వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వుబ్యాంకు అంగీకరించడం లేదనే సాకు చూపుతూ రైతు రుణాల మాఫీని ఎగవేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నట్లు అనుమానంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
ఆర్బీఐ నుంచి రీ-షెడ్యూల్‌పై ఎటువంటి ఆదేశాలు రాలేదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ రుణాల రీ-షెడ్యూల్, మాఫీపై ఆర్బీఐ నుంచి ఇంత వరకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని తెలంగాణ రాష్ట్ర లీడ్ బ్యాంకరుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన మేరకు వ్యవసాయ రుణ బకాయిల వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్బీహెచ్ ఎండీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన శంతను ముఖర్జీ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఐఐఈ నిర్వహించిన ‘ఆర్థిక సంస్కరణలు-పురోభివృద్ధి’ సదస్సులో ముఖర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ రుణ మాఫీ, రీ-షెడ్యూల్ గురించి ఆర్బీఐ నుంచి ఎటువంటి సూచనలు రాలేదన్నారు. రుణ మాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతులు రుణాలు చెల్లిం చడం లేదని, దీంతో ఎన్పీఏలు పెరుగుతున్నాయన్నా రు. 2 రోజుల్లో ఆర్థిక ఫలితాలు ప్రకటించనుండటంతో ఎన్పీఏల గురించి ఇప్పుడు చెప్పలేమని, ఒకసారి రుణ మాఫీ పథకంపై స్పష్టత వస్తే ఎన్పీఏలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రుణ మాఫీ కంటే కొత్త రుణాలను మంజూరు చేయడంపైనే దృష్టిసారించామని, ఇందుకు త్వరలోనే సీఎంతో ఎస్ఎల్బీసీ సమావేశం జరపనున్నట్లు ముఖర్జీ తెలిపారు. ద్వితీయార్థం బాగు..: ప్రస్తుతం కార్పొరేట్ రుణాల డిమాండ్ స్థబ్తుగా ఉందని, ద్వితీయార్థం నుంచి వీటికి డిమాండ్ పెరుగుతుందనేది తమ అంచనా అన్నారు. మౌలికరంగం పుంజుకుంటుందని భా విస్తున్నామని, కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరుగుతుందన్నారు. అనుబంధ బ్యాంకుల విలీనం అనేది ప్రభుత్వం, ఎస్బీఐ చేతుల్లో ఉందని.. దీనిపై తాము మాట్లాడటానికి ఏమీ లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. -
వాగ్దానం మాఫీ
రుణాల రద్దు కష్టమని తేల్చి చెప్పిన ప్రభుత్వం రూ.1050 కోట్లు మాఫీ లేనట్టే! 20 శాతం మందికే రీషెడ్యూల్ ఆందోళనలో జిల్లా రైతాంగం ఊహించినట్టే జరిగింది. తప్పుడు హామీలతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం మాట మార్చింది. రుణ మాఫీ సాధ్యం కాదని చెప్పకనే చెప్పింది. రుణాల రీషెడ్యూల్‌తో చేతులు దులుపుకోవాలని చూస్తోంది. ఇందులోనూ షరతులు, ఆంక్షలంటూ వీలైనంత తక్కువ మందికి వర్తింప చేయాలని యోచిస్తోంది. విశాఖ రూరల్: రుణమాఫీపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. గతేడాది వరదలు, కరువు మండలాల్లోని రైతులకు మాత్రమే రీషెడ్యూల్ అంటూ ప్రకటించింది. ఈ నిర్ణయం జిల్లా రైతులకు అశనిపాతమే. కనీసం 20 శాతం మందికి కూడా రీషెడ్యూల్ అమలుకాదు. ఖరీఫ్ ప్రారంభమై నారుపోతలు పూర్తయ్యాయి.. ఇప్పటికీ కొత్త రుణాలు లేవు. రుణ మాఫీ ఆశతో అన్నదాతలు ప్రైవేటు ఫైనాన్సర్ల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగు పనులు ప్రారంభించారు. తీరా ఇప్పుడు రుణాల రద్దు కష్టమని సాక్షాత్తూ సీఎం ప్రకటించడంతోదిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. రూ.1050 కోట్లు రుణాలు మాఫీ లేనట్టే! : గత ఖరీఫ్‌లో జిల్లాలో 1,32,375 మంది రైతులకు రూ.640 కోట్లు రుణాలు అందజేశారు. అలాగే రబీలో 14,548 మంది రైతులకు రూ.104 కోట్లు అప్పులిచ్చారు. గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హతకార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1లు మాత్రమే పంట రుణాలు కింద ఇచ్చారు. పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. దీంతో పాటు లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు 11.73 కోట్లు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చారు. వీటితో పాటు రూ.150 కోట్లు వరకు బంగారంపై రుణాలు అందించారు. రుణ మాఫీ జరిగితే అన్ని రకాల రుణాలు కలిపి మొత్తం రూ.1050 కోట్లు రద్దవుతాయని రైతులు భావించారు. 20 శాతం మందికే రీషెడ్యూల్! : జిల్లాలో గతేడాది వర్షాభావం కారణంగా 30 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ప్రభుత్వం ఒక మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. దీని ప్రకారం ఒక్క రైతుకు కూడా రీషెడ్యూల్ వర్తించే అవకాశం లేదు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో అల్పపీడనం, తుపాను కారణంగా భారీగా పంటలు నీటమునిగాయి. జిల్లాలో 34 మండలాల్లో మొత్తంగా 52,426 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం వీరికి మాత్రమే రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశముంది. వీరిలో కూడా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రుణాలు పొంది ఉంటే వారికి కూడా రీషెడ్యూల్ వర్తించదు. అలాగే బంగారంపై రుణాలు పొందిన వారు 50 శాతానికి పైనే ఉన్నారు. దీని ప్రకారం జిల్లాలో 20 శాతం మంది రైతులకు కూడా రుణాలు రీషెడ్యూల్ జరిగే అవకాశం కనిపించడం లేదు. రీషెడ్యూలైన రైతులకు కూడా వడ్డీ భారం పడనుంది. కొత్త రుణాలు కష్టమే.. : జిల్లాలో 2,27,400 హెక్టార్లలో పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్దేశించారు. జిల్లాలో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు, రెన్యువల్స్‌గా 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలే దని అధికారులు చెబుతున్నారు. -
కొత్త రుణాలు కష్టమే!
* రుణాల రీ-షెడ్యూల్‌తో తీవ్ర నగదు కొరత * గతేడాది రుణాల మొత్తం రూ. 7,600 కోట్లు సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాలు రీ-షెడ్యూల్ అయినప్పటికీ కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రధానంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)ల ద్వారా రీ-షెడ్యూల్ తర్వాత కొత్త రుణాలు అందే పరిస్థితి లేదు. ఇందుకు అవసరమయ్యే మొత్తాన్ని పీఏసీఎస్, ఆర్ఆర్బీలకు అందించలేమని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకేసారి మొత్తం నగదు చెల్లిస్తే తప్ప రుణ మాఫీకి రిజర్వ్ బ్యాంకు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రుణాలను రీ-షెడ్యూల్ చేసి కొత్త రుణాలు అందించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆర్బీఐని కోరుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇరు ప్రాంతాల రైతులకు పరపతి సంఘాలు, గ్రామీణ బ్యాంకుల నుంచి రూ. 7,600 కోట్ల పంట రుణాలు అందాయి. ఇప్పుడు ఇరు రాష్ట్రాలూ రుణ మాఫీ ప్రకటన చేయడంతో రైతులు బకాయిలు చెల్లించడం లేదు. దీంతో కొత్త రుణాల మంజూరుకు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి సహకరించే పరిస్థితి లేదని నాబార్డు సీజీఎం మమ్మెన్ తెలిపారు. ‘ రీ-షెడ్యూల్‌తో స్వల్పకాలిక రుణాలు కాస్తా మధ్యకాలిక రుణాలుగా మారతాయి. రూ. 7,600 కోట్లలో నాబార్డు వాటా 60 శాతం అంటే రూ. 4,560 కోట్లు. ఈ మొత్తం రైతుల నుంచి తిరిగి రాకపోతే కొత్త రుణాల కోసం పీఏసీఎస్, ఆర్ఆర్బీలకు నాబార్డు నుంచి నిధులు అందించే పరిస్థితి ఉండదు’ అని ఆయన వివరించారు. రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ ఓకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంగీకరించింది. ఈ మేరకు సోమవారం నాడు రిజర్వ్‌బ్యాంకు రీ షెడ్యూల్‌కు సంబంధించి విధివిధానాలను కూడా ప్రకటించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఏపీలోని 13 జిల్లాలకు సంబంధించి రీషెడ్యూల్ మొత్తం సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వమే మాఫీ చేస్తే మంచిది వరదలు,కరువు వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిందేనని.. రుణమాఫీని ప్రభుత్వమే నేరుగా చేస్తే బాగుంటుందని నాబార్డు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయ సీజీఎంజీజీ మమ్మెన్ అభిప్రాయపడ్డారు. రుణమాఫీ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. నాబార్డు 33వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.అవి.. - ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా గోదాముల నిర్మాణానికి రుణాలిస్తాం. - రెండురాష్ట్రాల్లోని 257 మార్కెట్ కమిటీలకు నేరుగా రూ. 500 కోట్ల రుణాలను ఇవ్వనున్నాం. మార్కెట్ కమిటీలను కూడా గుర్తించాం. ఇందులో రూ.300 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు, రూ.200 కోట్లు తెలంగాణలోని మార్కెట్ కమిటీలకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో మొత్తం రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 17,500 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. - రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు కలిపి ప్రాంతీయ కార్యాలయం ఇక్కడే ఉంది. కొత్త రాజధాని ఏర్పాటైన తర్వాత అక్కడ నాబార్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. -
రుణ మాఫీపై రీషెడ్యూల్ బాట..!
చెల్లింపు భారం తగ్గించుకునే యోచనలో టీ సర్కారు గత ఏడాది కరువు, తుపాను పీడిత మండలాల్లోని రైతు రుణాలపై దృష్టి.. 323 మండలాల నిర్ధారణ సమగ్ర వివరాలతో ఒకట్రెండు రోజుల్లోనే ఆర్బీఐకి నివేదిక సుమారు 72శాతం రుణాల రీషెడ్యూల్కు అవకాశం సాక్షి, హైదరాబాద్: రైతు రుణాల మాఫీ భారాన్ని భరించేందుకు ఉన్న మార్గాలపై తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. రుణ మాఫీకి ఆర్బీఐ సానుకూలంగా లేకపోవడంతో రుణాల రీ-షెడ్యూల్‌పై రాష్ర్ట ప్రభుత్వం దృష్టి సారించింది. కరువు మండలాల రైతులకు దీన్ని వర్తింపజేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీంతో దాదాపు 72 శాతం పంట రుణాలు రీ-షెడ్యూల్ అయ్యే అవకాశముందని అంచనా. రీ-షెడ్యూల్‌తో రైతులకు తక్షణ భారం తగ్గడమే కాకుండా, వారికి వెంటనే కొత్త రుణాల మంజూరు కూడా సాధ్యమవుతుందని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ఆ మేరకు రుణ మాఫీ మొత్తాన్ని కూడా బ్యాంకులకు ప్రభుత్వం వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కూడా కలుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన హామీని అమలు చేసేందుకు ఈ ప్రత్యామ్నాయంపైనే అధికారులు దృష్టి సారించారు. ఇందులోభాగంగా తెలంగాణలో గత ఏడాది కరువు, తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన మండలాల్లోని రైతులకు సంబంధించిన రుణాల రీ-షెడ్యూల్ నివేదికను ఒకట్రెండు రోజుల్లో ఆర్బీఐకి పంపించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కూడిన మిగతా 2వ పేజీలో ఠ బృందం గత వారం ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. రుణాల రీ-షెడ్యూల్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారంతో పాటు.. రుణ మాఫీపై రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు. దీనిపై సమగ్ర నివేదిక పంపించాలని, రీ-షెడ్యూల్ ను పరిశీలిస్తామని చెప్పడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణలో మొత్తం 443 మండలాల్లో దాదాపు 323 మండలాలు తుఫాను, కరువుతో బాగా దెబ్బతిన్నట్లు నిర్ధారిస్తూ ప్రభుత్వం గత జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా మండలాల్లోని రైతులు తీసుకున్న రుణాలపై బ్యాంకుల నుంచి సవివర నివేదికలు తెప్పించుకుంది. తాజాగా వీటి రీ-షెడ్యూల్‌కు రాష్ర్ట ప్రభుత్వం ఆర్బీఐకి నివేదించనుంది. వాస్తవంగా పంట రుణాలు మాత్రమే రీ-షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని, బంగారు తాకట్టు రుణాలను పరిగణించరని ఓ అధికారి తెలిపారు. అయితే బంగారు తాకట్టు రుణాలను కూడా పంట రుణాలను కూడా రీ-షెడ్యూల్ చేయాలని ఆర్బీఐని తెలంగాణ సర్కారు కోరుతోంది. పంట రుణాలు, బంగారు తాకట్టు రుణాలు మొత్తం దాదాపు 17,332 కోట్ల మేరకు ఉంటాయని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. వీటిలో కరువు మండలాల రైతులకు చెందిన 72 శాతం రుణాలు అంటే దాదాపు రూ. 12,479 కోట్ల రుణాలు రీ-షెడ్యూల్ అవుతాయని భావిస్తున్నారు. ఇక కరువు, తుఫాను మండలాల జాబితాలో లేని మిగతా ప్రాంతాల రైతులకు రుణాల రీ-షెడ్యూల్ వర్తించదు. వారికి కొత్త రుణాలు ఎలా ఇప్పించాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ మండలాల్లో రుణాలు సుమారు రూ. 4,853 కోట్లు ఉంటాయని చెబుతున్నారు. రీ-షెడ్యూల్ వర్తించని రైతుల వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. వీటిని కూడా రిజర్వ్‌బ్యాంకుకు పంపించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. మొత్తం రుణాలు రీ-షెడ్యూల్ చేస్తారా? ఒకవేళ చేస్తే.. వాటిని ఎంత కాలంలోగా తిరిగి చెల్లించాలి? తదితర విషయాలను ఆర్బీఐ తన ప్రకటనలో స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కాగా, కరువు, తుఫాన్లు సంభవించిన 90 రోజుల్లో ఆ మండలాల పేర్లను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రకటన జాప్యమైనందు వల్ల నిబంధన లు సడలించాలని కూడా ప్రభుత్వం కోరుతోంది. రీ-షెడ్యూల్‌కు ఆర్బీఐ నిబంధనలు - తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలు ని:- కరువు, తుఫాను బాధిత మండలాల ప్రకటన తర్వాత 90 రోజుల్లో రీ షెడ్యూల్ చేసుకోవాలి. అ:- 90 రోజుల గడువు దాటినందున ప్రత్యేక మినహాయింపునివ్వాలి. ని:- రీ షెడ్యూల్ కోరుతూ రైతులు సంతకాలు చేయాలి. అ:- రైతుల తరఫున ప్రభుత్వమే సంతకం చేస్తుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి బదలాయించాలి. ని:- రీ షెడ్యూల్ గడువు తర్వాత బకాయిలను రైతులు చెల్లించాలి. అ:- గడువు తీరాక రైతుల బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ని:- రీ షెడ్యూల్ వల్ల రైతులకు సబ్సిడీ వడ్డీ రేట్లు వర్తించవు. అ:- రీ షెడ్యూల్ వల్ల పడే వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ని:- లక్ష రూపాయల కంటే ఎక్కువ రుణం ఉంటే.. భూమి తనఖా పెట్టాలి. అ:- తెలంగాణ ప్రభుత్వం లక్షలోపు రుణాలకు మాత్రమే హామీ ఇచ్చింది. ని:- కరువు, తుఫాన్లతో దెబ్బతిన్న పంటలను బట్టి మూడు, ఐదు. ఏడు, పదేళ్ల రీషెడ్యూల్కు అవకాశం. అ:- ఏడేళ్ల వ్యవధి ఇవ్వండి. -
రుణాలు రీ షెడ్యూలైనా 600 కోట్ల వడ్డీ భారం
రుణాల రీ షెడ్యూల్‌పైనే ప్రభుత్వం ఆశ ఆ దిశగా కసరత్తు.... మూడు నుంచి ఐదేళ్లకు మించని రీ షెడ్యూల్.. సాక్షి, హైదరాబాద్: రైతు రుణ మాఫీని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తిరస్కరించడంతో.. కనీసం కరువు మండలాల్లోని రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ రుణాల రీ షెడ్యూల్‌కు అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం సమర్పించే రీ షెడ్యూల్ నివేదికను పరిశీలించాక కాని ఆర్బీఐ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేదు. మూడు నుంచి ఐదేళ్లకు మించి రీ షెడ్యూల్ చేసేందుకు అవకాశం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రీ షెడ్యూల్ అంటే రైతులు తిరిగి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటూ.. బకాయిలు చెల్లించడానికి హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బకాయిలను రైతులు చెల్లించినా.. ప్రభుత్వం నేరుగా చెల్లించినా ప్రతియేటా అదనంగా దాదాపు రూ.600 కోట్ల మేరకు వడ్డీ భారం పడుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రకృతి విపత్తుల కింద రుణాలు రీ షెడ్యూల్ చేసే పక్షంలో.. ఒక సంవత్సరం అసలు, వడ్డీ చెల్లింపులపై మారటోరియం మాత్రమే ఉంటుందని, లేని పక్షంలో మొదటి ఏడాది నుంచే వడ్డీభారం తప్పదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రుణాల రీ షెడ్యూల్ కూడా గతంలో ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలకు మాత్రమే వర్తిస్తుందని, మొత్తం మండలాలకు వర్తించదని ఆ అధికారి వ్యాఖ్యానించారు. కరువు మండలాల జాబితాలో లేని రైతులు విధిగా రుణాలు చెల్లిస్తే తప్ప వారికి కొత్త రుణాలు లభించే అవకాశం లేదు. కరువు మండలాల్లో రుణాల రీ షెడ్యూల్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి సమర్పించాక.. దానిని పరిశీలించిన తరువాత కాని తన నిర్ణయం ఏమిటో వెల్లడించే అవకాశం లేదని ఆ అధికారి వివరించారు. తాము మాత్రం రీ షెడ్యూల్ జరుగుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణలో కరువు మండలాలు దాదాపు 370 వరకు ఉన్నాయని, వాటిలో రుణాలు రీ షెడ్యూల్ అయినా.. రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం మాఫీ చేయాలని భావిస్తున్న 17 వేల కోట్ల రూపాయల రుణాల్లో 70 నుంచి 75 శాతం రుణాలు రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ రీ షెడ్యూల్ కూడా మూడు సంవత్సరాలకు ఆర్బీఐ పరిమితం చేస్తుందని, మరీ కోరితే ఐదేళ్ల వరకు అనుమతించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం ఆర్బీఐ నుంచి స్పష్టమైన సమాచారం వచ్చాకే ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారు.