సాక్షి, ఒంగోలు: పంట రుణాల మాఫీపై ప్రభుత్వ దోబూచులాట..రైతుల్లో తీవ్ర గందరగోళాన్ని నింపుతోంది. బంగారం, పంటలపై తీసుకున్న రుణాలన్నింటిలో కుటుంబానికి రూ.1.50 లక్ష మాఫీ అని ప్రభుత్వం ప్రకటించింది. ఆ కాస్త రుణమైనా మాఫీ అవుతుందా..? అంటే ఆదీ ఒక పట్టాన తేలడం లేదు. కనీసం, రుణాల రీషెడ్యూల్ చేసి కొత్తరుణాలైనా ఇస్తారా..? అంటే, ‘మాఫీ’ ఘోరం అందుకు బ్యాంకర్లు సవాలక్ష కొర్రీలేస్తున్నారు. ఎటూ.. ప్రీమియం చెల్లింపు లేకపోవడంతో ఈసారి పంటలబీమా పథ కాన్ని రైతులు కోల్పోయారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు రైతులు ప్రీమియం చెల్లించి బీమా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బ్యాంకులు కొత్తరుణాలను పంపిణీ చేయనప్పుడు.. ప్రీమియం ఏవిధంగా మినహాయింపు అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 4 లక్షల మంది రైతులపై ఉన్న గడువు మీరిన బకాయిల మొత్తం రూ.5.900 కోట్లుండగా, ప్రభుత్వం నిర్దేశించిన 2013 డిసెంబర్ 31లోగా ఉన్న బకాయిలు రూ.3400 కోట్లున్నాయి.
రుణమాఫీ అమలుపై ప్రభుత్వం ఆలస్యం చేసిన నిర్వాకానికిగాను ప్రతీరైతుపై 12.5 శాతం వడ్డీ భారం పడింది. సాధారణంగా గడువులోగా చెల్లించే బకాయిలపై 7 శాతం వడ్డీలో ప్రభుత్వ సబ్సిడీ మినహాయిస్తే లబ్ధిదారుడు 4 శాతం వడ్డీ మాత్రమే భరించేవాడు. అయితే, ప్రభుత్వం చేసిన ఆలస్య తప్పిదానికి అదనంగా 8 శాతం వడ్డీని భరించాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా రైతుల దగ్గర్నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డుల జిరాక్స్‌లను తీసుకుంటున్న బ్యాంకర్లు..కొన్ని మండలాల్లో మాత్రం ఆర్‌బీఐ నిబంధనలంటూ కొన్ని అంశాల్ని లేవనెత్తి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులందుతున్నాయి.
‘మాఫీ’ ఘోరం
Published Thu, Sep 4 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement