కొవ్వూరు : కొవ్వూరు మండలంలో వాడపల్లి, దొమ్మేరు, పశివేదలలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారంపై పంట రుణాలు తీసుకున్నవారికి నోటీసులు జారీ చేశారు. ఆరికిరేవుల బరోడా బ్యాంకు, కొవ్వూరు, ధర్మవరం ఆంధ్రాబ్యాంకులు, సిండికేట్ బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు ఇచ్చాయి. చాగల్లు మండలంలోని ప్రక్కిలంక ఎస్‌బీఐ గతంలో బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు జారీ చేసింది. అన్నదేవరపేట, మలకపల్లి సహకార సంఘాలు బంగారు రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు జారీ చేశాయి. అన్నదేవరపేట సొసైటీలో 2012-2014 వరకు బంగారంపై 500 మంది రైతులు రూ.1.50 కోట్లు రుణాలు తీసుకున్నారు. బంగారంపై రుణాలు తీసుకున్న వారిలో వందమందికి నోటీసులు ఇచ్చారు.
తాడిపూడి సొసైటీ నుంచి 2013-14 సంవత్సరానికిగాను 398 మంది రైతులు రూ.2.33 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. రాగోలపల్లి సొసైటీ ద్వారా 507 మంది రైతులు రూ.2.16 కోట్లు పంట రుణాలుగా తీసుకున్నారు. మలకపల్లి సొసైటీ నుంచి, ప్రక్కిలంక ఎస్‌బీఐ నుంచి 2011-12లో బంగారంపై 611 మంది రైతులకు రూ.4.11 కోట్లు, 2012-13లో 511 మందికి రూ.3.19 కోట్లు, 2012-13లో పంట రుణాలు కింద 431 మంది రూ.2.67 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. బంగారంపై తీసుకున్న రుణాలకు నోటీసులు జారీ చేశారు. తాళ్లపూడి ఆంధ్రాబ్యాంకులో 2011-14 వరకు బంగారంపై వ్యవసాయ రుణాలు రూ.7.98 కోట్లు ఇచ్చారు. గత నెల మార్చిలో సుమారు 50 మందికి నోటీసులు జారీ చేసింది.
తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామానికి చెందిన ఎనిమిది మంది బగారు నగలను వేలం వేశారు. చాగల్లు ఆంధ్రాబ్యాంకులోను శనివారం 142 మంది బంగారంపై పంట రుణం తీసుకున్న వారి పేర్లను పేపర్‌లో ప్రకటించారు. సొమ్ము చెల్లించపోతే వేలం వేస్తామని ప్రకటన ఇచ్చారు. తాళ్లపూడి మండలం ఆంధ్రాబ్యాంకు రుణాలు చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆటో ద్వారా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. దీంతో రైతులు బ్యాంకు ఎదుట ధర్నాకు చేశారు.
బంగారం వేలం వేశారు
తాళ్లపూడి ఆంధ్రాబ్యాంకులో 2013 మార్చిలో రెండున్నర కాసులు పుస్తెలతాడు తాకట్టు పెట్టి బంగారంపై రూ. 34 వేలు పంట రుణం తీసుకున్నాను. రుణాలు చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసులు ఇవ్వకుండానే బంగారం వేలం వేశారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని బాకీ చెల్లించలేదు. ముందస్తు సమాచారం లేండా వేలం వేయడం దారుణం.
-ఉన్నమాటి పుల్లారావు, కౌలు రైతు, వేగేశ్వరపురం.
బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు
తాళ్లపూడి ఆంధ్రాబ్యాంకులో మూడున్నర కాసుల బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.46 వేలు రుణం తీసుకున్నాను. 2015 ఫిబ్రవరిలో రూ.10 వేలు వడ్డీ చెల్లించాను. బంగారం వేలం వేశామని మిగిలిన సొమ్ము తీసుకువెళ్లాలని మార్చిలో నోటీసు వచ్చింది. -బుద్దాల లక్ష్మి, వేగేశ్వరపురం
రైతులకు నోటీసులు
Published Mon, Sep 7 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement
Advertisement