Notices for farmers
-
ఇదేం దారుణం
పాడిరైతుల పేరుతో బ్యాంకు రుణం పాలఫ్యాక్టరీ యాజమాన్యం ఘరానా మోసం..? న్యాయస్థానం నుంచి రైతులకు నోటీసులు లబోదిబోమంటున్న బాధితులు బ్యాంకు రుణం పొందాలంటే ఒక రైతుకు ఎంతో కష్టం. దరఖాస్తు దశ నుంచి మంజూరయ్యే వరకూ చాలా అవస్థలు పడాలి. అవసరమైన డాక్యు మెంట్లు సకాలంతో ఇవ్వాలి.. అప్పుడే రుణం మంజూరవుతుంది. అలాంటిది పుత్తూరు మండలంలో కొందరు రైతులకు బ్యాంకు మెట్లెక్కకుండానే రుణాలు మంజూరయిపోయాయి. అంతేకాదు వాళ్లకు అందకుండానే విత్ డ్రా అయిపో యాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఓ సంస్థ వీరిని నిలువునా ముంచేసింది. తమకు తెలియకుండానే రుణాలు మంజూరు చేయించుకుని కాజేశారని రైతులు లబోదిబోమంటున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులొచ్చేవరకూ తమకు రుణాల గురించి తెలియదని వారంటున్నారు.. పుత్తూరు: రైతులకు తెలియకుండానే వారి పేరుతో బ్యాంకు రుణం తీసుకొని ఎగ్గొట్టిన పాలఫ్యాక్టరీ యాజమాన్యం మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధి లోని తిరుమలకుప్పం, పరిసరాల గ్రామాలకు చెందిన పాడిరైతులు పిచ్చాటూరులోని ఓ పాలఫ్యాక్టరీకి కొన్నేళ్లుగా పాలు సరఫరా చేస్తున్నారు. మరిన్ని గేదెలు కొనుగోలు చేసేందుకు రైతులందరికీ బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయిస్తానని ఫ్యాక్టరీ యాజమాన్యం, సిబ్బంది నమ్మబలికారు. ఆశపడిన రైతులు వారికి సంబంధించిన ఆధార్, రేషన్, పొలం పత్రాల నకల్లను ఫ్యాక్టరీ సిబ్బందికి అందించారు. ఇది నాలుగేళ్లనాటి మాట. పాలఫ్యాక్టరీ యాజమాన్యం బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో రైతులు పాల సరఫరాను నిలిపేశారు. రుణం కోసం తాము అందించిన కాగితాల గురించి కూడా మరిచిపోయారు. ఈ నేపథ్యంలో గత నెల న్యాయస్థానం నుంచి రైతులకు నోటీసులందాయి. పుత్తూరు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించనందుకు నోటీసులు వచ్చాయి. ఒక్కొక్క రైతు సుమారు 2.90 లక్షలు చెల్లించాలని నోటీసుల్లో ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమకు తెలియకుండానే తమ పేరుతో పాలఫ్యాక్టరీ యాజమాన్యం రుణం తీసుకుందని వారు బావురుమంటున్నారు. ఈ మొత్తం కోటి రూపాయలపైగానే ఉంటుందని పేర్కొంటున్నారు. మూడు సంవత్సరాల క్రితం అందించిన జెరాక్స్ పత్రాలతో బ్యాంకు నుంచి రుణం పొందినట్లు వారు రూఢీ చేసుకొన్నారు. నిబంధనలన్నీ పక్కాగా అమలు... బ్యాంకు రికార్డుల ప్రకారం రుణం మంజూరు చేసేందుకు అవసరమైన నిబంధనలను పక్కాగా పాటించినట్లు ఉంది. ష్యూరిటీలుగా పాల ఫ్యాక్టరీ యాజమాన్యం, మరో వ్యక్తి ఆస్తిని కూడా జతచేసినట్లు రికార్డుల్లో పొందుపరిచారు. రైతులు, ఏజెంట్లు తీసుకున్న రుణం చెల్లించకపోతే ఫ్యాక్టరీ యాజమాన్యం పూర్తి బాధ్యత వహిస్తామని సైతం బ్యాంకర్లకు అగ్రిమెంట్ ఇచ్చారు. బ్యాంకు మంజూరు చేసిన రుణం సంబంధిత రైతు ఖాతాలోనే జమచేసినట్లు, ఆపై నగదును రైతే విత్ డ్రా చేసినట్లు రికార్డుల ద్వారా తెలు స్తోంది. దీంతో నిబంధనలన్నీ పక్కాగా అమలు చేసినట్లు తెలుస్తోంది. -
నోటీసుల కలకలం
బకాయిలు చెల్లించాలంటూ పీఏసీఎస్ ఒత్తిడి 550 మంది రైతులకు నోటీసులు రుణ మాఫీ ఎందుకు వర్తించలేదని ఆందోళన అప్పు తీసుకోకున్నా నోటీసులిచ్చారని మరికొందరి ఆరోపణ తక్షణం రుణ బకాయిలు చెల్లించాలని, లేకుంటే ఆస్తులు జప్తు చేస్తామంటూ పీఏసీఎస్ అధికారులు ఒక్క సారిగా రైతులకు నోటీసులివ్వడం కలకలం సృష్టించింది. ఎప్పుడో పదేళ్లు... పాతికేళ్ల కిందట తీసుకున్న రుణాలకు ఇప్పుడు నోటీసులేమిటని రైతులు మండి పడుతున్నారు. అసలు రుణమే తీసుకోలేదు.. అయినా నోటీసులు వచ్చాయని, ఇందులో ఏదోగోల్మాల్ జరిగిందని మరి కొందరు అంటున్నారు. చీడికాడ: స్థానిక పీఏసీఎస్ పరిధిలోని 19 పంచాయతీలకు చెందిన 550 మంది రైతులకు రుణాలు చెల్లించాలంటూ పీఏసీఎస్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పీఏసీఎస్ పరిధిలో 1988 నుంచి 2006 మధ్య కాలంలో గొర్రెలు, మేకలు, ఆవులు, ఇసుక మేటల తొలగింపు కోసం తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు వడ్డీలతో తక్షణమే చెల్లించాలని వారం రోజుల క్రితం సిబ్బంది రైతులకు నోటీసులు అందించారు. ఎప్పుడో పది..పాతికేళ్ల కిందట తీసుకున్న రుణాలకు ఇప్పడు నోటీసులు రావడమేమిటని, తమకు మాఫీ వర్తించకుంకే అప్పుడే చెప్పాలి కదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అసలు తాము అప్పే తీసుకోలేదని, బకాయిలు చెల్లించమని నోటీసులు రావడమేమిటని మరికొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు. మృతుల వారసులకు నోటీసులు అప్పట్లో రుణాలు తీసుకున్న 550 మందిలో సుమారు 180 మంది వరకు మరణించారు. వారి వారసులకు ఇప్పుడు నోటీసుల రావడంతో వారు లబోదిబోమంటున్నారు. కాగా, తమ ఆస్తులు జప్తు చేస్తామంటున్నారని, తమకు రక్షణ కల్పించాలని బాధిత రైతులు సోమవారం చీడికాడకు చెందిన అడ్వకేట్ యర్రా వెంకటరావుతో కలిసి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు ఎలాంటి ఫిర్యాదు స్వీకరించలేదు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఇన్చార్జి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడు నోటీసులేమిటి? ఈ సందర్భంగా రైతులు రెడ్డి కొండబాబు, బొడ్డు కన్నయ్య, రెడ్డి నాయుడు తదితరులు మాట్లాడుతూ పీఏసీఎస్ నుంచి ఏ రుణాలు తీసుకున్నా నిబంధనల ప్రకారం ఏడాది తరువాత రైతులకు నోటీసులు జారీ చేస్తారని పాతికేళ్ల తరువాత బకాయిలున్నాయంటు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. మొదటి విడత 2006లో రుణ మాఫీ జరిగిన పుడు.. మా రుణాలు మాఫీ కాకుంటే అప్పట్లో నోటీసులు ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. రుణాలే తీసుకోని తమ పేరిట బకాయిలున్నాయని నోటిసులిచ్చారని, పాలకవర్గం, సిబ్బందే తమ పేర్లుమీద బినామీ రుణాలు తీసుకుని అవకతవకలకు పాల్పడి ఉంటారని రైతులు పాలకుర్తి సత్యనారాయణమ్మ, వంటాకు దేముడు ఆరోపించారు. 1988 నుంచి 2006 మధ్య కాలంలో లావాదేవీలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి, రూరల్ ఎస్పీ, కో-ఆపరేటివ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు. దీర్ఘకాలిక రుణాల రైతులకే నోటీసులు 1988 నుంచి 2006 మధ్య దీర్ఘకాలిక రుణాలు తీసుకుని పూర్తిస్థాయిలో చెల్లించని వారికే నోటిసులిచ్చాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1997 నుంచి 2007 మధ్య రుణాలకే మాఫీ వర్తింపచేశారు. రుణమాఫీకి ముందు తరువాత ఇన్స్టాల్మెంట్లు రైతే చెల్లించాలి, అటువంటి వారికే నోటీసులు ఇచ్చాం. అయితే చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణమాఫీలో ఆ రుణాలు పోతాయని ఇప్పటివరకు చూశాం.. ఈ ప్రభుత్వం స్వల్పకాలిక రుణాలను మాత్రమే మాఫీచేసింది.. ఒక్క దీర్ఘకాలిక రుణం కూడా మాఫీకాలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులకు నోటీసులిచ్చాం -బత్తిన సత్యనారాయణ, పీఏసీఎస్ కార్యదర్శి -
రైతులకు నోటీసులు
కొవ్వూరు : కొవ్వూరు మండలంలో వాడపల్లి, దొమ్మేరు, పశివేదలలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారంపై పంట రుణాలు తీసుకున్నవారికి నోటీసులు జారీ చేశారు. ఆరికిరేవుల బరోడా బ్యాంకు, కొవ్వూరు, ధర్మవరం ఆంధ్రాబ్యాంకులు, సిండికేట్ బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు ఇచ్చాయి. చాగల్లు మండలంలోని ప్రక్కిలంక ఎస్బీఐ గతంలో బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు జారీ చేసింది. అన్నదేవరపేట, మలకపల్లి సహకార సంఘాలు బంగారు రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు జారీ చేశాయి. అన్నదేవరపేట సొసైటీలో 2012-2014 వరకు బంగారంపై 500 మంది రైతులు రూ.1.50 కోట్లు రుణాలు తీసుకున్నారు. బంగారంపై రుణాలు తీసుకున్న వారిలో వందమందికి నోటీసులు ఇచ్చారు. తాడిపూడి సొసైటీ నుంచి 2013-14 సంవత్సరానికిగాను 398 మంది రైతులు రూ.2.33 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. రాగోలపల్లి సొసైటీ ద్వారా 507 మంది రైతులు రూ.2.16 కోట్లు పంట రుణాలుగా తీసుకున్నారు. మలకపల్లి సొసైటీ నుంచి, ప్రక్కిలంక ఎస్బీఐ నుంచి 2011-12లో బంగారంపై 611 మంది రైతులకు రూ.4.11 కోట్లు, 2012-13లో 511 మందికి రూ.3.19 కోట్లు, 2012-13లో పంట రుణాలు కింద 431 మంది రూ.2.67 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. బంగారంపై తీసుకున్న రుణాలకు నోటీసులు జారీ చేశారు. తాళ్లపూడి ఆంధ్రాబ్యాంకులో 2011-14 వరకు బంగారంపై వ్యవసాయ రుణాలు రూ.7.98 కోట్లు ఇచ్చారు. గత నెల మార్చిలో సుమారు 50 మందికి నోటీసులు జారీ చేసింది. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామానికి చెందిన ఎనిమిది మంది బగారు నగలను వేలం వేశారు. చాగల్లు ఆంధ్రాబ్యాంకులోను శనివారం 142 మంది బంగారంపై పంట రుణం తీసుకున్న వారి పేర్లను పేపర్లో ప్రకటించారు. సొమ్ము చెల్లించపోతే వేలం వేస్తామని ప్రకటన ఇచ్చారు. తాళ్లపూడి మండలం ఆంధ్రాబ్యాంకు రుణాలు చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆటో ద్వారా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. దీంతో రైతులు బ్యాంకు ఎదుట ధర్నాకు చేశారు. బంగారం వేలం వేశారు తాళ్లపూడి ఆంధ్రాబ్యాంకులో 2013 మార్చిలో రెండున్నర కాసులు పుస్తెలతాడు తాకట్టు పెట్టి బంగారంపై రూ. 34 వేలు పంట రుణం తీసుకున్నాను. రుణాలు చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసులు ఇవ్వకుండానే బంగారం వేలం వేశారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని బాకీ చెల్లించలేదు. ముందస్తు సమాచారం లేండా వేలం వేయడం దారుణం. -ఉన్నమాటి పుల్లారావు, కౌలు రైతు, వేగేశ్వరపురం. బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు తాళ్లపూడి ఆంధ్రాబ్యాంకులో మూడున్నర కాసుల బంగారు నగలు తాకట్టు పెట్టి రూ.46 వేలు రుణం తీసుకున్నాను. 2015 ఫిబ్రవరిలో రూ.10 వేలు వడ్డీ చెల్లించాను. బంగారం వేలం వేశామని మిగిలిన సొమ్ము తీసుకువెళ్లాలని మార్చిలో నోటీసు వచ్చింది. -బుద్దాల లక్ష్మి, వేగేశ్వరపురం