
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు తారలు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా మరో నటుడు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సినీయర్ నటి, హీరోయిన్ రతీ అగ్నిహోత్రి కుమారుడు తనూజ్ విర్వాన తన ప్రియురాలు తాన్యా జాకబ్‌ను పెళ్లాడారు. మహారాష్ట్రలోని లోనావాలాలో జరిగిన వివాహా వేడుకకు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.
కాగా.. తనూజ్ అమెజాన్ వెబ్ సిరీస్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌లో వాయు రాఘవన్ పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న పాయిజన్ వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించారు. కాగా.. తనూజ్ మదర్ రతి అగ్నిహోత్రి తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం చిత్రాల్లోనూ నటించారు. ఆమె చివరిసారిగా బాలకృష్ణ నటించిన డిక్టేటర్ చిత్రంలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment