Rati Agnihotri
-
Tanuj Virwani Marriage Photos: ప్రియురాలిని పెళ్లాడిన నటుడు..(ఫొటోలు)
-
ప్రియురాలిని పెళ్లాడిన డిక్టేటర్ నటి కుమారుడు.. ఫోటోలు వైరల్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు తారలు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా మరో నటుడు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సినీయర్ నటి, హీరోయిన్ రతీ అగ్నిహోత్రి కుమారుడు తనూజ్ విర్వాన తన ప్రియురాలు తాన్యా జాకబ్‌ను పెళ్లాడారు. మహారాష్ట్రలోని లోనావాలాలో జరిగిన వివాహా వేడుకకు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. కాగా.. తనూజ్ అమెజాన్ వెబ్ సిరీస్ ఇన్సైడ్ ఎడ్జ్‌లో వాయు రాఘవన్ పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న పాయిజన్ వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించారు. కాగా.. తనూజ్ మదర్ రతి అగ్నిహోత్రి తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం చిత్రాల్లోనూ నటించారు. ఆమె చివరిసారిగా బాలకృష్ణ నటించిన డిక్టేటర్ చిత్రంలో కనిపించారు. View this post on Instagram A post shared by Tanuj Virwani (@tanujvirwani) -
పెళ్లి పీటలెక్కనున్న సీనియర్ హీరోయిన్ కుమారుడు.. వధువు ఎవరంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు తారలు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా మరో నటుడు పెళ్లికి రెడీ అయిపోయారు. ప్రముఖ సినీయర్ నటి, హీరోయిన్ రతీ అగ్నిహోత్రి కుమారుడు తనూజ్ విర్వానీ ఓ ఇంటివాడు కానున్నారు. ఈనెల 25న తన ప్రియురాలు తాన్యా జాకబ్‌ను పెళ్లాడనున్నారు. వీరి వివాహం ముంబయి-పుణె హైవేలోని లోనావాలాలో జరగనుంది. ఈ ఏడాది నవంబర్లోనే సింగపూర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న హీరో తనూజ్ ఓ ఇంటర్వ్యూరు హాజరయ్యారు. తన పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. తాన్యతో ప్రేమ గురించి తనూజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనూజ్ మాట్లాడుతూ.. "మేమిద్దరం చాలా కాలంగా తెలుసు. పదేళ్ల క్రితం తనను ముంబైలో కలిశా. మా కుటుంబాలకు కూడా తాన్య బాగా తెలుసు. తాన్యా సింగపూర్‌కు మారినప్పుడు కూడా మేము క్లోజ్‌గానే ఉన్నామని' తెలిపారు. పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని తనూజ్ వెల్లడించారు. కాగా.. తనూజ్ మదర్ రతి అగ్నిహోత్రి తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం చిత్రాల్లోనూ నటించారు. ఆమె చివరిసారిగా బాలకృష్ణ నటించిన డిక్టేటర్ చిత్రంలో కనిపించారు. పెళ్లి గురించి తనూజ్ మాట్లాడుతూ.. 'ఆ రోజు కోసం నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నా. నా జీవితంలో సరైన వ్యక్తినే ఎంపిక చేసుకున్నానని నాకు తెలుసు. ప్రస్తుతం నా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. మా వివాహా వేడుకకు అందరూ కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. మా పెళ్లిరోజు డిసెంబర్ 25 పవిత్రమైన తేదీలోనే వచ్చింది. లోనావాలాలోని ఫామ్‌హౌస్ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా. నా జీవితంలో ఇ ది మధురమైన క్షణం' అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. తనూజ్ అమెజాన్ వెబ్ సిరీస్ ఇన్సైడ్ ఎడ్జ్‌లో వాయు రాఘవన్ పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న పాయిజన్ వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించారు. View this post on Instagram A post shared by Tanuj Virwani (@tanujvirwani) -
తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!
మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయిపోయాడు. తనకు నిశ్చితార్థం జరిగిపోయిందని చెబుతూ జీవిత భాగస్వామిని పరిచయం చేశాడు. అయితే ఈ కుర్రాడు ఓటీటీల్లో స్టార్ అని చాలామందికి తెలుసు. కానీ ఇతడు తెలుగు హీరోయిన్ కొడుకని మనోళ్లకు పెద్దగా తెలియదు. ఇంతకీ ఈ కుర్రాడెవరు? ఎంగేజ్మెంట్ సంగతేంటి? నటుడు, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న తనూజ్ విర్వాని.. 2013లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓ మూడు సినిమాలు చేశాడు గానీ పెద్దగా పేరు రాలేదు. కానీ ఓటీటీల్లో చేసిన 'ఇన్ సైడ్ ఎడ్జ్' సిరీస్ వల్ల ఇతడికి బోలెడంత ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత కోడ్ M, పాయిజన్, మసాబా మసాబా తదితర సిరీసుల్లో యాక్ట్ చేసి ఆకట్టుకున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) తనూజ్ ఇప్పుడు తాన్య జాకబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశాడు. తనూజ్ తల్లి రతి అగ్నిహోత్రి అప్పట్లో తెలుగు సినిమాలు చేసింది. 1980-82 మధ్యలో దాదాపు 10 వరకు తెలుగు చిత్రాల్లో నటించింది. ఈ లిస్టులో చిరంజీవి 'పున్నమినాగు' కూడా ఉంది. చివరగా తెలుగులో 2016లో వచ్చిన బాలకృష్ణ 'డిక్టేటర్'లో కనిపించింది. ఇక తనూజ్ విషయానికొస్తే.. కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ తో దాదాపు నాలుగేళ్లు (2013-17) డేటింగ్ చేశాడు. ఆ తర్వాత 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫేమ్ నటి ఇజ్బెల్లాలో రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు డేటింగ్, రిలేషన్ లాంటి వాటిని పక్కనబెడుతూ తన కాబోయే భార్యని అందరికీ పరిచయం చేసి షాకిచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయిపోయాయి. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!) View this post on Instagram A post shared by Tanuj Virwani (@tanujvirwani) -
డిసెంబర్ 10న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: రతీ అగ్నిహోత్రి (నటి), కామ్నా జెఠ్మలానీ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరు ఈ సంవత్సరమంతా సుఖం, ఆనందం, నూతన ఉత్సాహం, స్వయం వికాసంతో ఉల్లాసంగా ఉంటారు. ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రచయితలు, వక్తలు, సంగీత గురువులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. కొత్త కొత్త కోర్సులు చేయాలని కోరిక కలుగుతుంది. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. వీరి పుట్టిన తేదీ 10. ఇది సూర్యసంఖ్య కాబట్టి వీరికి జన్మతః నాయకత్వ లక్షణాలుంటాయి. కొత్తప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి తరుణం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. లక్కీ నంబర్స్: 1,2,3, 5; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్, రెడ్, ఆరంజ్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, గురువారాలు. సూచనలు: గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, మతగురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. తండ్రిని, తత్సమానులను ఆదరించడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
అక్షయ్‌కి అమ్మగా...
‘ఏక్ దూజే కేలియే’తో ఆనాటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కథానాయిక రతీ అగ్నిహోత్రి. భర్త అనిల్ విర్వాణితో మనస్పర్థలొచ్చి, 30 ఏళ్ల వైవాహిక బంధం అర్ధంతరంగా ముగించి ఈ మధ్య వార్తల్లోకెక్కారామె. ఇది ఇలా ఉండగా ఆమెకు ఇప్పుడో మంచి అవకాశం వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ నటిస్తున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’లో అక్షయ్‌కి తల్లిగా ఆమె నటించనున్నారు. -
ఆ నరకయాతన మా అబ్బాయికి తెలుసు!
‘ఏక్ దుజే కేలియే’ చిత్రంతో ఆనాటి కుర్రకారు మది దోచుకున్న నటి రతీ అగ్నిహోత్రి. కెరీర్ ఊపులో ఉండగానే ఏరికోరి పెళ్లాడిన అనిల్ విర్వానీ తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆమె ఆ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు 30 ఏళ్లు పట్టింది. నేను అనుభవిస్తున్న నరకం ఏమిటో మా అబ్బాయికి తెలుసు. ‘నా కోసం కాదమ్మా... నీ కోసం నువ్వు బతుకు’ అన్న మా వాడి మాటలే నాకు ధైర్యమిచ్చాయి’’ అని రతి కన్నీటి పర్యంతమయ్యారు. -
భర్తపై కేసు పెట్టిన రతి అగ్నిహోత్రి
ముంబై: బాలీవుడ్ నిన్నటితరం నటి రతి అగ్నిహోత్రి తన భర్త అనిల్ వీర్వాణీపై శనివారం గృహ హింస చట్టం కింద కేసు పెట్టారు. అతడు తనను చాలాకాంలంగా శారీరకంగా, మానసికంగా హింసించడంతో పాటు బెదిరించారని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రతి నుంచి తమకు అందిన ఫిర్యాదు మేరకు అనిల్‌పై కేసు నమోదు చేసినట్లు స్థానిక డీసీపీ జయకుమార్ వెల్లడించారు. చేతులపై గాయాల గుర్తులను చూపుతూ రతి మార్చి 7న మౌఖికంగానూ ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. వ్యాపారంలో ఇబ్బందుల వల్ల ఆమె భర్త సహనం కోల్పోవడం కూడా హింసకు ఒక కారణమై ఉండొచ్చని పేర్కొన్నాయి. -
'నాలో నటిని కనుగొన్నది ఆయనే'
దివంగత సీనియర్ దర్శకుడు కె.బాలచందర్ అంటే.. అలనాటి హీరోయిన్ రతి అగ్నిహోత్రికి ప్రత్యేకమైన అభిమానం, గౌరవం. తెలుగులో వచ్చిన 'మరోచరిత్ర'ను హిందీలో 'ఏక్ దూజే కే లియే'గా రీమేక్ చేసినప్పుడు అందులో హీరోయిన్గా రతి అగ్నిహోత్రిని ఎంపిక చేసింది ఆయనే. ఆ సినిమా 1981లో విడుదలైంది. అందులో కమల్ హాసన్ సరసన నటించిన రతి అగ్నిహోత్రి.. ఆ తర్వాత బాలీవుడ్లో బ్రహ్మాండమైన స్థాయికి వెళ్లిపోయింది. ఇప్పుడు బాలచందర్ ఈ లోకంలో లేరంటే.. ఆమె నమ్మలేకపోతోంది. కొన్ని రోజుల క్రితం తాను పంజాబ్‌లో ఓ సినిమా షూటింగులో ఉండగా, చెన్నై నుంచి ఫోన్ వచ్చిందని రతి అగ్నిహోత్రి తెలిపింది. బాలచందర్‌తో పాటు.. భారతీరాజాను సన్మానిస్తున్నామని, ఆ కార్యక్రమానికి 1970లు, 80లలో వాళ్లతో కలిసి చేసిన నటీనటులు, సాంకేతికవర్గం అంతటినీ పిలుస్తున్నామన్నది ఆ ఫోన్ సారాంశం. అయితే, సరిగ్గా ఆ సన్మానం జరిగే సమయానికి తన తల్లికి తీవ్ర అనారోగ్యంగా ఉండటంతో ఆమెతోపాటు తాను ఉండిపోవాల్సి వచ్చి.. తాను వెళ్లలేకపోయినట్లు రతి తెలిపింది. తనకు తమిళంలో తొలి సినిమా చాన్సు భారతీరాజా, హిందీలో బాలచందర్ ఇచ్చారని.. అందుకు తనను తాను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తానని చెప్పింది. ఇప్పుడు బాలచందర్ లేరంటే అది తీరని లోటని రతి అగ్నిహోత్రి వాపోయింది. -
ప్రతి భాషనూ నేర్చుకుని నటించాను
అంతర్వీక్షణం: రతీ అగ్నిహోత్రి రతీ అగ్నిహోత్రి అంటే... ప్రేమసింహాసనం, కలియుగరాముడు సినిమాల్లో ఎన్.టి. రామారావు పక్కన బంగారు తీగలా కనిపించిన అమ్మాయి. సత్యం శివంలో ఏఎన్నార్‌కి జోడీ. ఇంకా చెప్పాలంటే ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించి సినిమాకు డ్యూయెట్ల గ్లామర్నద్దిన రూపసి. మరోచరిత్రలో నటి సరిత నటించిన పాత్రను హిందీలో ‘ఏక్ తుజే కే లియే’ సినిమాతో దేశమంతటికీ పరిచయం చేసిన నటి. ఇవాళ రతి అగ్నిహోత్రి పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమె అంతర్వీక్షణం. పంజాబీ కుటుంబంలో పుట్టిన మీకు దక్షిణాది సౌకర్యంగా అనిపించిందా? మాది పంజాబీ కుటుంబమే అయినా నేను పుట్టేనాటికి మా కుటుంబం ముంబయిలో ఉండేది. నా స్కూలు రోజుల్లోనే నాన్నకు చెన్నైకి బదిలీకావడంతో ఆ వాతావరణం బాగా అలవాటైంది. నాకెప్పుడూ దక్షిణాది కొత్తగా అనిపించలేదు. నా పుట్టింటిలాగానే భావించాను. సినిమారంగంలో అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది? నేను చెన్నైలోని ‘గుడ్ షెఫర్డ్స్’ కాన్వెంట్లో చదువుకుంటున్నప్పుడు పాఠశాల వార్షికోత్సవంలో ఓ నాటకంలో నటించాను. ఆ సాంస్కృతిక కార్యక్రమాలకు వచ్చిన వారు దర్శకులు భారతీరాజా అనే విషయం కూడా తెలియదు. ఆయన నేరుగా నాన్నగారిని కలిసి తన సినిమాలో నటించమని అడిగినప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. భారతీరాజా వంటి పెద్దాయన అడగడంతో కాదనలేక నాన్న అయిష్టంగానే అంగీకరించారు. అన్ని దక్షిణాది భాషల్లోనూ నటించారు కదా! మరి అన్ని భాషలూ నేర్చుకున్నారా? ఇప్పుడెవరూ అంత పట్టుదలగా నేర్చుకుంటున్నట్లు కనిపించడం లేదు! భాష నేర్చుకుని డైలాగ్‌ని పలికితే నటనలో యాభై శాతం పాసైనట్లే. నేను ప్రతి భాషనూ నేర్చుకుని నటించాను. తెలుగు, కన్నడ బాగా మాట్లాడతాను. మలయాళం కూడా ఫర్వాలేదు ఓ మోస్తరుగా వచ్చు. హిందీ సినిమాల్లో కెరీర్ ఉన్నత స్థాయిలో ఉండగానే తెరమరుగయినందుకు తర్వాత చింతించారా? ఏ మాత్రం లేదు. అనిల్‌ని పెళ్లి చేసుకోవడం నేను ఇష్టపడి తీసుకున్న నిర్ణయం. పెళ్లి తర్వాత వైవాహిక జీవితానికి, కుటుంబానికి పరిమితం కావాలనేది కూడా నేను ఇష్టంగా తీసుకున్న నిర్ణయమే. పైగా అది అవసరమైన నిర్ణయం కూడా. మరి దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ నటించాలని ఎందుకనిపించింది? మా అబ్బాయి తనూజ్ పెద్దయ్యాడు. నాకు అవసరానికి మించినంత ఖాళీ సమయం ఉంది. ‘మళ్లీ నటించవచ్చు కదా’ అని మావారు, అబ్బాయి ఇద్దరూ ప్రోత్సహించడంతో అంగీకరించాను. ఆ పదిహేనేళ్ల కాలాన్ని వెనక్కి చూసుకుంటే మీకేమనిపిస్తోంది? ఆ విరామంలో నేను చాలా నేర్చుకున్నాను. మా వారు ఆర్కిటెక్ట్ కావడంతో ఆయన వృత్తి వ్యవహారాల్లో ల్యాండ్ స్కేప్ డిజైనింగ్ వంటి నాకు తోచినవేవో చేసేదాన్ని. గ్లాస్ పెయింటింగ్స్ వేశాను. శిల్పాల తయారీలో శిక్షణ తీసుకున్నాను. నేను సొంతంగా డ్రై ఫ్లవర్స్ తయారు చేస్తాను కూడా. వీటన్నింటితోపాటు ‘రేకీ’ అనే వైద్య ప్రక్రియలో కోర్సు చేశాను. వివాహం, భర్త ఎంపిక విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకున్నానని ఎప్పుడైనా అనిపించిందా? నా పెళ్లయి దాదాపు 30 ఏళ్లయింది. సరైన నిర్ణయం తీసుకున్నాననే విశ్వాసంతోపాటు జీవితాన్ని చక్కగా మలుచుకున్నాననే సంతోషం కూడా ఉంది.