భర్తపై కేసు పెట్టిన రతి అగ్నిహోత్రి
ముంబై: బాలీవుడ్ నిన్నటితరం నటి రతి అగ్నిహోత్రి తన భర్త అనిల్ వీర్వాణీపై శనివారం గృహ హింస చట్టం కింద కేసు పెట్టారు. అతడు తనను చాలాకాంలంగా శారీరకంగా, మానసికంగా హింసించడంతో పాటు బెదిరించారని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రతి నుంచి తమకు అందిన ఫిర్యాదు మేరకు అనిల్‌పై కేసు నమోదు చేసినట్లు స్థానిక డీసీపీ జయకుమార్ వెల్లడించారు. చేతులపై గాయాల గుర్తులను చూపుతూ రతి మార్చి 7న మౌఖికంగానూ ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. వ్యాపారంలో ఇబ్బందుల వల్ల ఆమె భర్త సహనం కోల్పోవడం కూడా హింసకు ఒక కారణమై ఉండొచ్చని పేర్కొన్నాయి.