నాగార్జున సినిమాను నడిపించే వారెవరు? | who will run the Nagarjuna movie in Vijayawada between Jr NTR, Balakrishna war | Sakshi
Sakshi News home page

నాగార్జున సినిమాను నడిపించే వారెవరు?

Published Sun, Jan 10 2016 8:47 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగార్జున సినిమాను నడిపించే వారెవరు? - Sakshi

నాగార్జున సినిమాను నడిపించే వారెవరు?

* ‘డిక్టేటర్’ కోసం థియేటర్ల యజమానులకు టీడీపీ నేతల హెచ్చరికలు
* బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్
* నాగార్జున సినిమాను నడిపించే వారెవరు?
* థియేటర్ల యజమానుల్లో అయోమయం

 
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘‘ఆటాడాల్సిందే.. ‘డిక్టేటర్’ అంటే ఏమనుకున్నారు? మీ ఇష్టం.. చెప్పింది చేయండి.. లేకుంటే తర్వాత చూస్తారు..’’ ఇవీ జిల్లాలోని పలు థియేటర్ల యజమానులకు తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వెళ్లిన హెచ్చరికలు. డిస్ట్రిబ్యూటర్లకు ఏంచేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. విజయవాడకు చెందిన కాకుమాను ప్రసాద్ (అలంకార్ ప్రసాద్) జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’ కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. గన్నవరానికి చెందిన తుమ్మల రామ్మోహన్‌రావు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ను తీసుకోగా, నాగార్జున ఫ్యాన్స్ ఆలిండియా అధ్యక్షుడు సర్వేశ్వరరావు నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్టీఆర్, నాగార్జునల సినిమాలకు నెల క్రితమే జిల్లాలో థియేటర్ల బుకింగ్ పూర్తయింది. ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా విడుదలకానున్న బాలయ్య ‘డిక్టేటర్’కు జిల్లాలో ఒక్క హాలు కూడా లేకపోవడం విశేషం.
 
నిజానికి అలంకార్ ప్రసాద్, సురేష్ ప్రొడక్షన్స్ వారికి జిల్లాలో 80 శాతం థియేటర్ల వారితో సంబంధాలు ఉన్నాయి. ఏ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా వారు ఈ 80 శాతం థియేటర్లను ముందుగానే కృష్ణా జిల్లాలో బుక్ చేసుకుంటారు. సినిమా ఆడేదాన్ని బట్టి ఎంతకాలం అనేది ఉంటుంది. ఎన్టీఆర్, నాగ్ చిత్రాలకు ముందే థియేటర్లు బుక్ చేయటంతో శుక్రవారం నుంచి టీడీపీ శ్రేణుల నుంచి థియేటర్లపై ఒత్తిళ్లు పెరిగాయి. ఎన్టీఆర్ సినిమాను ఆపేయాల్సిందిగా ఫోన్లు చేసి మరీ థియేటర్ల యజమానులను బెదిరించటం మొదలుపెట్టారు. ఇందులో ఒక కీలక మంత్రి నుంచి పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు సైతం ఉన్నారు. ఈ విధంగా ఇప్పటివరకు 30 థియేటర్లు ‘డిక్టేటర్’కు బుక్ చేసినట్లు సమాచారం.
 
అభిమానుల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం...
 జిల్లాలో 108 సినిమా థియేటర్లు ఉన్నాయి. అందులో పూర్తిగా ఎన్టీఆర్, నాగార్జున సినిమాలకే బుక్ అయ్యాయి. 20 సింగిల్ థియేటర్లు, 25 డబుల్ థియేటర్లు ఉన్నాయి. సింగిల్ థియేటర్లు ఉన్నచోట డిక్టేటర్ ఆడాల్సిందేనని టీడీపీ నాయకులు పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ గ్రామాల్లో కొట్లాటలు చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. డబుల్ థియేటర్లు ఉన్నచోట నాగార్జున సినిమాను ఆపివేయిస్తున్నారు. దీంతో నాగార్జున అభిమానుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమాను రద్దు చేయించిన చోట పరిస్థితులు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement