మల్టీస్టారర్ సినిమాలంటే జనాలకు మహా క్రేజు.. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటివరకు మల్టీస్టారర్ సినిమాలకు ఢోకా లేదు. ఇద్దరు హీరోల కాంబినేషన్ ఎలా ఉందో చూడాలని అభిమానులు తెగ ముచ్చటపడుతుంటారు. అయితే అప్పట్లోనే నలుగురు స్టార్ హీరోలు.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ కలిసి నటించారు. వీళ్లంతా కలిసి ఏ సినిమా చేశారా? అని ఆలోచిస్తున్నారా?
ఆ మల్టీస్టారర్ మూవీ ఇదే
ఒకరు హీరోగా నటిస్తే.. మిగిలిన ముగ్గురు అతిథులుగా మెరిశారు. ఆ సినిమా పేరే త్రిమూర్తులు. ఇందులో వెంకటేశ్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించారు. ఖుష్బూ, శోభన, అశ్విని హీరోయిన్లుగా నటించారు. కె. మురళీ మోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1987లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మల్టీస్టారర్ సినిమాలో మెగాస్టార్, కింగ్ నాగ్, బాలయ్య గెస్టులుగా కనిపించారు. వీరు మాత్రమే కాదు. ఇండస్ట్రీ అంతా దిగింది.
అతిరథులంతా ఇందులోనే
కృష్ణ, విజయ నిర్మల, కృష్టంరాజు, చంద్రమోహన్, మురళీ మోహన్, విజయశాంతి, పద్మనాభం, రాధ, భానుప్రియ, శారద, రాధిక, శారద, జయమాలిని, అనురాధ, వై.విజయ.. ఇలా పలువురు సెలబ్రిటీలు కనిపించారు. ఇంతమంది నటించిన ఏకైక సినిమా త్రిమూర్తులు అనే చెప్పవచ్చు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ అవలేదు. భారీ తారాగణం ఉన్నప్పటికీ సినిమాలో విషయం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆడలేనట్లు అర్థమవుతోంది. టి.సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బప్పి లహరి సంగీతం అందించాడు. ఐదు పాటలకు వేటూరి సుందరరామమూర్తి లిరిక్స్ అందించాడు. ఇది హిందీ మూవీ నసీబ్‌కు రీమేక్‌గా తెరకెక్కింది.
చదవండి: అక్క భర్తతో ప్రేమలో పడ్డా.. నేను చెడిపోయినా పర్వాలేదని లొంగిపోయాను: జయలలిత
Comments
Please login to add a commentAdd a comment