తన బ్లడ్కే హిస్టరీ ఉందంటున్న బాలయ్య | Balakrishna 99th film dictator teaser launch | Sakshi
Sakshi News home page

తన బ్లడ్కే హిస్టరీ ఉందంటున్న బాలయ్య

Published Fri, Oct 23 2015 11:44 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

తన బ్లడ్కే హిస్టరీ ఉందంటున్న బాలయ్య - Sakshi

తన బ్లడ్కే హిస్టరీ ఉందంటున్న బాలయ్య

నందమూరి అభిమానులకు పండుగ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. దసరాకు ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' టీజర్తో పండుగ తీసుకువస్తే, దసరా తరువాత రోజు కూడా సెలబ్రేషన్స్ను కంటిన్యూ చేస్తున్నాడు బాలకృష్ణ. శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'డిక్టేటర్' టీజర్ను ఈ రోజు (శుక్రవారం) రిలీజ్ చేశారు.

ముందు నుంచి చెపుతున్నట్టుగానే శ్రీవాస్ ఈ సారి బాలయ్యను ఫుల్ స్టైలిష్ గా చూపించాడు. బాలయ్య అభిమానులు కోరుకునే పంచ్ డైలాగ్లను టీజర్ లోనే చూపించి ఆకట్టుకున్నాడు శ్రీవాస్. 'నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్కే హిస్టరీ ఉంది. మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం, నాలాంటి వాళ్లన్ని రెచ్చగొట్టడం నీ జీవితానికే ప్రమాదకరం' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

బాలకృష్ణ 99వ సినిమాగా తెరకెక్కుతున్న డిక్టేటర్లో అంజలి హీరోయిన్గా నటిస్తుంది. బాలయ్య సరసన లెజెండ్ లో హీరోయిన్గా నటించిన సోనాల్ చౌహాన్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా, భారీ తారాగణంతో పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీవాస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్ నేషనల్స్ బ్యానర్తో పాటు వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement