బాలయ్య @ 99 | Balakrishna New Movie Dictator Opening | Sakshi
Sakshi News home page

బాలయ్య @ 99

Published Fri, May 29 2015 10:51 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలయ్య @ 99 - Sakshi

బాలయ్య @ 99

‘లెజెండ్’, ‘లయన్’గా కనిపించిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ‘డిక్టేటర్’ కాబోతున్నారు. ‘లౌక్యం’తో గత ఏడాది భారీ విజయం సాధించిన శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. అంజలి కథానాయిక. ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
 
 ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు బి. గోపాల్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు బోయపాటి శీను క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ -‘‘చాలా శక్తిమంతమైన టైటిల్ ఇది. ప్రాణం తీసే భయం కన్నా, ప్రాణం పోసే ఆయుధం గొప్పదనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. శ్రీవాస్‌తో ఎప్పటినుంచో చేయాలనుకున్నా. ఇన్నాళ్ళకు కుదిరింది’’ అన్నారు.
 
 శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘నందమూరి హీరోలతో నేను సినిమా చేయాలన్నది మా నాన్న కోరిక. బాలకృష్ణతో 99వ సినిమా చేసే అవకాశం రావడం బరువైన బాధ్యత’’ అన్నారు. ఈ సినిమాకు రచన చేయడం బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని రచయితలు కోన వెంకట్, గోపీమోహన్ చెప్పారు. బాలకృష్ణతో కలిసి నటించడం తన అదృష్టమని అంజలి పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం. రత్నం, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: తమన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement