ఒక సెకనులో మాటిచ్చేశారు.. | Balakrishna's Dictator Movie launch in ramanaidu studios | Sakshi
Sakshi News home page

ఒక సెకనులో మాటిచ్చేశారు..

Published Fri, May 29 2015 11:24 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

ఒక సెకనులో మాటిచ్చేశారు.. - Sakshi

ఒక సెకనులో మాటిచ్చేశారు..

హైదరాబాద్ : హీరో బాలకృష్ణ 99వ సినిమా 'డిక్టేటర్' చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు బోయపాటి శ్రీను శుక్రవారం రామానాయుడు స్టూడియోలో ముహుర్తపు షాట్ క్లాప్ కొట్టారు.   శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ తాను దర్శకుడిగా మారినప్పటి నుంచి బాలకృష్ణతో సినిమా తీయాలని చాలాసార్లు అనుకున్నానని, ఈ రోజు తన జీవితంలో మర్చిపోలేని రోజు అన్నారు. సినిమా చూస్తే ఈ దర్శకుడు ఏ హీరోతో అయినా సినిమా తీయగలడు అనిపించుకోవటమే తన లక్ష్యమన్నారు. 'లక్ష్యం' చిత్రం తర్వాత బాలయ్యతో సినిమా తీయాలనుకున్నా... కుదరలేదని,  అయితే ఇన్నిరోజులకు తమ కాంబినేషన్  కుదిరిందన్నారు.

లౌక్యం సినిమా అనంతరం తాను బాలయ్యబాబును కలిసి సినిమా చేయాలనే చెప్పగానే...  99వ సినిమాకు నువ్వే దర్శకుడివి అని ఆయన ఒక్క సెకనులో మాటిచ్చేశారని శ్రీవాస్ తెలిపారు. ఇప్పటివరకూ బాలకృష్ణ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి చూసే సినిమాలు వచ్చాయని,  టైటిల్కు తగ్గట్టుగా డిక్టేటర్ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ ఉంటుందని శ్రీనివాస్ పేర్కొన్నాడు.  ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ, హీరోయిన్ అంజలి మాట్లాడుతూ ఈ సినిమాలో తమ క్యారెక్టర్స్ గత సినిమాల కన్నా భిన్నంగా ఉంటాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement