Anjili
-
జైతో మరోసారి ..
యువ నటుడు జై, నటి అంజిలిలది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి నటించిన ఎంగేయమ్ ఎప్పోదుమ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో జై, అంజిలి మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందనే ప్రశంశలు అందుకున్నారు. అంతే కాదు అప్పట్లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే వదంతులు చక్కర్లు కొట్టాయి. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం 2011లో తెర పైకి వచ్చింది. ఐదేళ్ల తరువాత జై, అంజిలి కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా వార్త. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ ప్రముఖ నటిగా రాణిస్తున్న అంజలి ఇటీవల నటించిన ఇరైవి చిత్రంలో నటనకు మంచి పేరే సంపాదించుకున్నారన్నది గమనార్హం. ఈ క్రేజ్ చాలా కాలం తరువాత జైతో నటించనున్న తాజా చిత్రానికి లాభిస్తుందని చెప్పవచ్చు. ఈ చిత్రం ద్వారా సినీష్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ జై, అంజలి జంట గా ఒక రొమాంటిక్ లవ్, హారర్ థ్రిల్లర్ కథను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలితో నటించి మెప్పించగల సత్తా ఉన్న అంజిలి తమ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుందన్నారు. ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో అంజలి అయితేనే బాగుంటుందని తమ యూనిట్ మొత్తం ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామని, ఈ విషయాన్ని తన పుట్టిన రోజు గురువారం వెల్లడించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి ఆర్.శరవణన్ చాయాగ్రహణం, ఫైట్స్‌ను దిలీప్ సుబ్బరాయన్ అందిస్తున్నారని తెలిపారు. -
బాలకృష్ణ 99వ సినిమా 'డిక్టేటర్' చిత్రం ప్రారంభోత్సవం
-
ఒక సెకనులో మాటిచ్చేశారు..
హైదరాబాద్ : హీరో బాలకృష్ణ 99వ సినిమా 'డిక్టేటర్' చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు బోయపాటి శ్రీను శుక్రవారం రామానాయుడు స్టూడియోలో ముహుర్తపు షాట్ క్లాప్ కొట్టారు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ తాను దర్శకుడిగా మారినప్పటి నుంచి బాలకృష్ణతో సినిమా తీయాలని చాలాసార్లు అనుకున్నానని, ఈ రోజు తన జీవితంలో మర్చిపోలేని రోజు అన్నారు. సినిమా చూస్తే ఈ దర్శకుడు ఏ హీరోతో అయినా సినిమా తీయగలడు అనిపించుకోవటమే తన లక్ష్యమన్నారు. 'లక్ష్యం' చిత్రం తర్వాత బాలయ్యతో సినిమా తీయాలనుకున్నా... కుదరలేదని, అయితే ఇన్నిరోజులకు తమ కాంబినేషన్ కుదిరిందన్నారు. లౌక్యం సినిమా అనంతరం తాను బాలయ్యబాబును కలిసి సినిమా చేయాలనే చెప్పగానే... 99వ సినిమాకు నువ్వే దర్శకుడివి అని ఆయన ఒక్క సెకనులో మాటిచ్చేశారని శ్రీవాస్ తెలిపారు. ఇప్పటివరకూ బాలకృష్ణ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి చూసే సినిమాలు వచ్చాయని, టైటిల్‌కు తగ్గట్టుగా డిక్టేటర్ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ ఉంటుందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ, హీరోయిన్ అంజలి మాట్లాడుతూ ఈ సినిమాలో తమ క్యారెక్టర్స్ గత సినిమాల కన్నా భిన్నంగా ఉంటాయని తెలిపారు. -
అందుకే నా నోరు కట్టేసుకున్నాను!
శివనాగేశ్వరరావు ‘ఫొటో’ సినిమాలో తొలిసారి దర్శనమిచ్చింది అంజలి. ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ‘ప్రేమలేఖ రాశా’ అని మరో సినిమా చేసింది. అమ్మాయి బాగుంది అన్నవాళ్లే కానీ అవకాశాలిచ్చినవాళ్లు మాత్రం లేరు. కోలీవుడ్‌ని నమ్ముకుంది. ఏకబిగిన స్టారై కూర్చుంది. ఇప్పుడు తెలుగులో అగ్ర హీరోల పక్కన కథానాయిక అంటే దర్శక, నిర్మాతల ఫస్ట్ ఆప్షన్ అంజలే. ఇప్పటికే వెంకటేశ్‌తో రెండు సినిమాల్లో నటించేసింది తను. బాలయ్య, నాగ్‌లతో జతకట్టడమే తరువాయి. సీనియర్ హీరోల సరసన సరిగ్గా సరిపోవడానికి కారణం అంజలి బొద్దుతనమే అని పలువురు అభిప్రాయం. ఈ విషయంపైనే ఇటీవల అంజలి మాట్లాడుతూ -‘‘చిన్నప్పట్నుంచీ నేనూ బొద్దే. అమ్మ, పిన్నీ చాలా గారాబంగా పెంచారు. ఓ విధంగా ఈ బొద్దుతనానికి కారణం అదే. పైగా మంచి భోజన ప్రియురాలిని. ‘తెలుగమ్మాయిలకు శరీరంపై కంట్రోల్ ఉండదు. తిండి విషయంలో నిగ్రహంగా ఉండలేరు’ అనే వాళ్ల నోరు మూయించడానికే నా నోరు కట్టేసుకున్నాను. ఇప్పుడు చాలామంది నన్ను సౌందర్యతో పోలుస్తున్నారు. అలా పోలుస్తుంటే... ఆనందం, భయం రెండూ కలుగుతుంటాయి. స్టార్‌గా కంటే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా ముందున్న లక్ష్యం’’అని చెప్పుకొచ్చారు.