UK PM Rishi Sunak Compared To North Korean Kim Jong Un, Know More Details - Sakshi
Sakshi News home page

Rishi Sunak: నియంత కిమ్‌లా మారిన రిషి సునాక్..  బ్రిటన్ ప్రధాని తీరుపై మండిపడ్డ నెటిజన్లు..

Published Wed, Apr 26 2023 7:42 PM | Last Updated on Wed, Apr 26 2023 8:49 PM

Uk Pm Rishi Sunak Compared To North Korean Kim Jong Un - Sakshi

లండన్‌: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై నెటిజన్లు మండిపడ్డారు. లండన్‌లోని డౌనింగ్‌ స్ట్రీట్‌కు వచ్చే సమయంలో సునాక్ కాన్వాయ్‌ ముందు సెక్యూరిటీ గార్డులు సైకిల్ తొక్కుకుంటూ కన్పించారు. మరికొంత మంది సెక్యూరిటీ ఆయన కారుతో పాటు పరుగులు తీస్తూ డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లారు.

రిషి సునాక్‌ రేంజ్ రోవర్ కారు ముందు సెక్యూరిటీ ఇలా సైకిల్‌పై రావడం, పరుగులు పెట్టుకుంటూ వెళ్లడం చూసిన స్థానికులు అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు సునాక్‌పై విమర్శలు గుప్పించారు.  ఈ సెక్యూరిటీని ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ సెక్యూరిటీతో పోల్చారు. రిషి సునాక్‌ కూడా కిమ్‌లా ప్రవర్తిస్తున్నారని, నియంతలా మారిపోయారని ధ్వజమెత్తారు. మరికొందరేమో కిమ్ జోంగ్ లండన్ వచ్చారా? ఆయన సెక్యూరిటీ ఇక్కడ ఉందేంటి? అని సునాక్‌ తీరుపై సెటైర్లు వేశారు.

'రిషి సునాక్‌లా చేసినట్టు గతంలో ఏ ప్రధాని చేయలేదు. పోలీసు బలగాలను వృథా చేస్తున్నారు. ఉత్తర కొరియాను ఫాలో అవడం బాలేదు' అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. సునాక్ కాన్వాయ్ ముందు సైకిళ్లపై వచ్చిన సెక్యూరిటీ రోడ్డుపై ఉన్నవారిని పక్కకు తప్పుకోవాలని హెచ్చరించింది. దారివ్వండి, తప్పుకోండి అంటూ అరుస్తూ ముందుకు సాగింది. దీంతో వీళ్ల హడావుడి చూసి స్థానికులు అవాక్కయ్యారు.
చదవండి: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్‌ నుంచి మరో 135 మంది తరలింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement