North Korea Kim Jong Un After Weight Loss Video Goes Viral - Sakshi
Sakshi News home page

వీడియో వైరల్‌: భారీగా బరువు తగ్గిన కిమ్‌ జాంగ్‌

Published Mon, Jun 28 2021 11:26 AM | Last Updated on Mon, Jun 28 2021 6:47 PM

Kim Jong Un Video After Apparent Weight Loss Goes Viral - Sakshi

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అనారోగ్యంపై గతకొంత కాలంగా పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 37 ఏళ్ల కిమ్‌ ఒక్కసారిగా సన్నబడ్డారనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇటీవల కిమ్‌ కీలకమైన ఆర్థిక సమావేశానికి పార్టీ ముఖ్యనేతలతో హాజరయ్యాడు. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన కిమ్‌ను చూసి అందరూ ఆశ్యర్యపోయారు. అంతకముందు వీడియోలతో పోలీస్తే ఈ వీడియోలో కిమ్‌ భారీ సంఖ్యలో బరువు తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన సన్నబడ్డారనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా జనాలను ఆసక్తి రేపుతుంటే.. కిమ్‌ అలా కనిపించడంపై ఉత్తర కొరియా ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు.

తమ ప్రియతమ నేతకు ఏమైందో అని తెగ బెంగ పడిపోతున్నారు. ఎప్పుడూ బొద్దుగా కనిపించే కిమ్ ఇప్పుడు సన్నబడటంతో ఆయన ఆరోగ్యం చెడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే కిమ్‌ బరువు తగ్గడానికి గల కారణాలపై వివరణ లేదు. కానీ ఇంతకుముందు 140 కిలోల బరువుండే కిమ్‌ ప్రస్తుతం 10 నుంచి 20 కిలోల వరకు బరువు తగ్గివుండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతకముందు, ప్రస్తుతం బరువు తగ్గిన కిమ్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కేవ‌లం 4 నెల‌ల స‌మయంలోనే కిమ్ ఇలా మారిపోయిన‌ట్లు రాయ్‌ట‌ర్స్ ట్విట‌ర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కిమ్‌ ‘ఒకవేళ డైట్‌లో ఉన్నారేమో’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి: Kim Jong-un: నార్త్​ కొరియా కిమ్​.. ఇలా అయ్యాడేంటి?
41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement