గం...గం...గణేశా..! | Balakrishna's Dictator Gum Gum Ganesha Song | Sakshi
Sakshi News home page

గం...గం...గణేశా..!

Published Sat, Sep 19 2015 4:29 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

గం...గం...గణేశా..! - Sakshi

గం...గం...గణేశా..!

వినాయకుడి మీద ఇప్పటివరకూ బోల్డన్ని పాటలు వచ్చాయి. తాజాగా, గజాననుడి భక్తుల కోసం ‘గమ్... గమ్.. గణేశా..’ అంటూ ‘డిక్టేటర్’ బృందం ఓ పాటను కానుకగా ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రి యేషన్ సంయుక్తంగా శ్రీవాస్ దర్శకత్వంలో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వినాయక చవితి సందర్భంగా వచ్చే పాట ఇది. తమన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. వినాయక చవితి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, గణేశుని పాటను హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ -‘‘యూరప్‌లో ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేశాం. వినాయకుని సమక్షంలో సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. అభిమానులను అలరించే సినిమా ఇది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement