అమరావతిలో ఆడియో! | Balakrishna,Dictator Audio Launch,Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతిలో ఆడియో!

Published Thu, Nov 19 2015 10:14 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

అమరావతిలో ఆడియో! - Sakshi

అమరావతిలో ఆడియో!

బాలకృష్ణ 99వ సినిమా ‘డిక్టేటర్’పై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ‘లౌక్యం’తో మంచి హిట్ అందుకున్న దర్శకుడు శ్రీవాస్ ఇప్పుడు బాలకృష్ణను ‘డిక్టేటర్’గా సంక్రాంతి బరిలో దించడానికి రెడీ అంటున్నారు.  ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, సోనాల్‌చౌహాన్ కథానాయికలు. తమన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఈ డిసెంబరు 20న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో విడుదల చేయనున్నారు.
 
  శ్రీవాస్ మాట్లాడుతూ-‘‘ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. బాలకృష్ణగారి పాత్ర డిఫరెంట్ షేడ్స్‌లో ఉంటూ అందరినీ ఆకట్టుకుం టుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో జరుపుకుంటున్న మొదటి సినిమా వేడుక ఇదే. ఆయన స్టయిలిష్ లుక్ అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది. ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఉన్న సరికొత్త సబ్జెక్ట్ ఇది’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement