ఆ రోజు అమరావతిలోనే ఉంటా: బాలకృష్ణ
అమరావతి: ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఏప్రిల్ 2 న మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయనే విషయం బయటకు వచ్చింది. శుక్రవారం అమరావతిలో బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయంపై వ్యాఖ్యానించారు. ' 2వ తేదీ విజయవాడలోనే ఉంటాను. ఆరోజు అతి ముఖ్యమైన కార్యక్రమం ఉంటుంది' అని తెలిపారు. అదే విధంగా ఎన్టీఆర్ జీవిత విశేషాలతో తెరకెక్కించనున్న సినిమా వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. అనంతపురం జిల్లాకు ఎన్నడూ లేని విధంగా నీటి కేటాయింపులు జరిగాయాని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ తో పాటు ఏపీ అసెంబ్లీ కూడా బాగుందని కితాబిచ్చారు.