
చిత్ర పరిశ్రమను తరలిస్తాం: బాలకృష్ణ
అమరావతి: చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తప్పకుండా తరలిస్తామని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసన సభ ఒక మంచి వేధిక కావాలని అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి అసెంబ్లీ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా అందరూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలన్నారు.