అమెరికా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ చారిటీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చైనా ప్రస్తావన వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ఒక నియంత అంటూ ఏకిపాడేశారు.
ఇదే ఏడాది మొదట్లో అమెరికా గగనతలంలో ఎగిరిన చైనా గూఢచారి విభాగానికి చెందిన బెలూన్లను పేల్చివేయడం పాపం జిన్ పింగ్ కు మింగుడుపడలేదు. ఆ బెలూన్ల నిండా రెండు బాక్సుల గూఢచారి పరికరాలు ఉన్నాయి. బెలూన్లయితే పంపించాడు కానీ తర్వాత ఏం జరిగిందన్న దానిపై ఆయనకు సమాచారం లేదు. సాధారణంగా అలాంటి సమయాల్లో నియంతలు వెర్రెక్కిపోతూ ఉంటారని, సరైన సమాచారం లేక జిన్ పింగ్ కూడా అలాంటి అయోమయ పరిస్థితిలోనే ఉండి ఉంటారని అన్నారు.
అసలే అమెరికా చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యంగా కొవిడ్ సమయంలో ఈ విబేధాలు మరింత పెరిగి తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పే ఉద్దేశ్యంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చైనా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటన సందర్బంగా చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యి పలు కీలక అంశాల గురించి చర్చించుకున్నారు కూడా. ఈ సమావేశం ముగిసిన మరుసటి రోజే జిన్ పింగ్ ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఇది కూడా చదవండి: అమెరికా పర్యటన వేళ.. రష్యాతో బంధంపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..?
Comments
Please login to add a commentAdd a comment