
సిద్ధగంగ మఠాధిపతితో మాట్లాడుతున్న రాహుల్
సాక్షి, బళ్లారి/దావణగెరె: ‘ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారు. విపక్షాలను పట్టించుకోవడం లేదు.. ప్రజల కష్టాలను తెలుసుకోవడం లేదు.. తన అభిప్రా యాలను మాత్రం జనంపై రుద్ది ఇబ్బంది పెడుతున్నారు’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఆయన బుధవారం కర్ణాటకలోని దావణగెరెలో పర్యటిం చారు. నోట్ల రద్దుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నరకయాతన పడ్డారన్నారు. జీఎస్‌టీ నుంచి నిత్యావసర వస్తువులను మినహాయించాలని కోరినా పట్టించుకోలేద న్నారు.
లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ అభిమతం కాదని, ఆ సంఘ ప్రముఖులు, స్వామీజీలు కోరుతున్నందునే ఆ మేరకు చర్యలు చేపట్టామని చెప్పారు. అనంతరం ఆయన లింగాయత్ లకు చెందిన ప్రముఖ సిద్ధగంగ మఠాన్ని సందర్శించి శివకుమార స్వామి(111) ఆశీస్సులు అందుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఆర్‌ఎస్‌ఎస్ ఆజమాయిషీ నుంచి ప్రభుత్వ వ్యవస్థలకు విముక్తి కల్పిస్తామన్నారు.