
కేజీఎఫ్: ఎన్నికల ప్రచారం కోసం జిల్లా పర్యటనకు వచ్చిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాలూకాలోని క్యాసంబళ్లి గ్రామంలో ఉన్న రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి కేసి రెడ్డి నివాసాన్ని సందర్శించారు. ఇదే సమయంలో స్థానిక నాయకులు 1951లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా క్యాసంబళ్లి గ్రామంలోని కేసి రెడ్డి నివాసంలో ఓ రాత్రి గడిపిన విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకు వెళ్లారు., జవహర్‌లాల్ నెహ్రూ విశ్రమించిన గదిని కేసి రెడ్డి కుటుంబీకులు రాహుల్‌గాంధీకి చూపించారు. కేసి రెడ్డి నివాసం చూసిన రాహుల్ గాంధీ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసి రెడ్డి కుటుంబంతోపాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment