రాహుల్ గాంధీ
సాక్షి, బెంగళూరు : ప్రతిపక్షాలు గట్టిగా పోరాడితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం తేలిక అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఓడించితీరుతామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్‌పార్టీ (బీఎస్పీ)లు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే ఉత్తరప్రదేశ్, మరికొన్ని ప్రభావిత రాష్ట్రాల్లో బీజేపీ రూపురేఖలు లేకుండా చేయొచ్చునని అభిప్రాయపడ్డారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రధాని మోదీకి సైతం తెలుసునని చెప్పిన రాహుల్.. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో తమదే విజయమన్నారు. తాజాగా బిహార్, తమిళనాడు సహా మరిన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తే బీజేపీకి ప్రజలు ఓట్లేసే ప్రసక్తే ఉండదన్నారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఏకమై పోటీచేస్తే ప్రధాని మోదీకి వారణాసిలో బరిలోకి దిగే దమ్ముందా అని రాహుల్ సవాల్ విసిరారు. బీజేపీకి వ్యతిరేక పవనాలు కర్ణాటక నుంచే మొదలవుతాయని, అన్ని రాష్ట్రాల్లో ఇదే గాలి వీస్తుందని రాహుల్ జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment