కోలారు: ప్రధానమంత్రి నరేంద్రమోది ఓ అబద్దాల కోరు అని ప్రధాని వల్ల దేశ అభివృద్ధి ఎంతమాత్రం సాధ్యం కాదని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ నరేంద్రమోదిపై నిప్పులు చెరిగారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని బంగారుపేట సర్కల్ నుంచి టవర్ క్లాక్‌వరకు రోడ్‌షో నిర్వహించిన అనంతరం క్లాక్‌టవర్ వద్ద ప్రజల నుద్దేశించి మాట్లాడారు. నోట్ల రద్దు దళితులు మరియు ఆదివాసీలపై జరిపిన దౌర్జన్యం, హత్యలు, రైతుల సమస్యలపై కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రశ్నలకు మోహం చాటేసిన ప్రధాని లోక్‌సభలోకి అడుగుపెట్టలేదన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ మరియు బీజేపీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలన్నారు. అయితే కాంగ్రెస్ సత్యం మార్గంలో వెళుతోందన్నారు. నరేంద్ర మోది మన్‌కీ బాత్‌కి ,రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య మనసులో మాటకి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజల కిచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చిందన్నారు. ఈ సందర్భంగా సిఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జి కేసి వేణుగోపాల్, కేపిసిసి అధ్యక్షుడు పరమేశ్వర్, ఎఐసిసి కార్యదర్శి మధు యాక్షిగౌడ, ప్రచార సమితి అధ్యక్షుడు డీకే శివకుమార్, లోక్‌సభ సభ్యుడు కేహెచ్ మునియప్ప, జిల్లా ఇంఛార్జి మంత్రి కేఆర్ రమేష్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment