
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ చర్యలను అహంకారపూరిత నియంతృత్వ చర్యగా అభివర్ణించారు. ఈ చర్యతో ప్రతిపక్షాల గొంతును భారతీయ జనతా పార్టీ అణిచివేయలేదని నొక్కి చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో.. "రాహుల్ గాంధీని లోకసభ ఎంపీగా అనర్హత వేటు విధించడం దిగ్భ్రాంతికరం. మేము న్యాయవ్యవస్థను గౌరవిస్తాం.
కానీ రాహుల్‌ని లోక్‌సభ సభ్యుత్వం నుంచి తొలగించడం అనేది పిరికి చర్యే. ఈ తీర్పుతో ఏకీభవించం. ప్రస్తుతం దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. వారి పాలనతో దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి అహంకార శక్తులకు వ్యతిరేకంగా 130 కోట్ల మంది ప్రజలు ఏకం కావాలి. దేశంలో ఒకే పార్టీ ఉండేలా పరిస్థితిని బీజేపి సృష్టించాలని చూస్తోంది.
దీన్ని నియంతృత్వం అని, స్వాతంత్య్రానికి ముందు భారత్‌ని పాలించిన బ్రిటిష్ పాలకులు కంటే బీజేపీ ప్రభుత్వ పాలనే ఎక్కువ ప్రమాదకరంగా ఉంది" అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీలో కూడా నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన నాయకత్వంతో దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ పనితీరుని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అడ్డుకుంటూ ఇబ్బందులు సృష్టించారన్నారు.
एक अहंकारी तानाशाह, कम-पढ़े लिखे व्यक्ति से देश को बचाना पड़ेगा@RahulGandhi को Lok Sabha की सदस्यता से बर्खास्त कर देना कायराना है
— AAP (@AamAadmiParty) March 24, 2023
हम इस Judgement से सहमत नहीं हैं
देश में सभी डरे हुए हैं
अब लोगों को खड़ा होना पड़ेगा, मेरी लोगों से Appeal—ये देश सबका है
—CM @ArvindKejriwal pic.twitter.com/hmdlMlESLu
(చదవండి: మహాత్మాగాంధీ డిగ్రీ చేయలేదని తెలుసా!:జమ్మూకాశ్మీర్ గవర్నర్ వ్యాఖ్యలు)