
ఖార్టూమ్: ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైనిక తిరుగుబాటు జరిగింది. దేశాన్ని దాదాపు మూడు దశాబ్దాలపాటు పాలించిన అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్(75)ను పదవీచ్యుతుడిని చేసి, గృహ నిర్బంధంలో ఉంచినట్లు గురువారం సైన్యం ప్రకటించింది. ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ రాజధాని ఖార్టూమ్ వీధుల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సైన్యంలో బ్రిగేడియర్‌గా ఉన్న బషీర్ 1989లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దింపి, అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆఫ్రికాలో ఎక్కువ కాలం అధికారం చెలాయించిన పాలకుల్లో ఒకరైన బషీర్.. ఇస్లామిక్ తీవ్రవాదుల అండతో నియంతృత్వ విధానాలను అవలంభించారు. అల్‌ఖాయిదా చీఫ్ బిన్‌లాడెన్ వంటి వారు 1996 వరకు సూడాన్‌లోనే ఆశ్రయం పొందారు. బషీర్ విధానాల కారణంగా దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఊచకోతకు గురికాగా, 2.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అనంతరం దేశం నుంచి ఉత్తర సూడాన్ విడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment