ఎన్టీఆర్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ | my twitter account was compromised : NTR | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్

Published Tue, Dec 22 2015 8:47 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

ఎన్టీఆర్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ - Sakshi

ఎన్టీఆర్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' సినిమాలోనటిస్తున్నాడు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నారు చిత్రయూనిట్. అందుకు తగ్గట్టుగా రెస్ట్ లేకుండా సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. కానీ అదే సమయంలో బాలకృష్ణ హీరోగా నటించిన డిక్టేటర్ రిలీజ్ కూడా ఉండటంతో ఒకేసారి ఇద్దరు నందమూరి హీరోల సినిమాలు రిలీజ్ చేయటం మంచిది కాదని అందుకే ఎన్టీఆర్ తన సినిమా వాయిదా వేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది.

ఇదే సందర్భంలో ఎన్టీఆర్ ట్విట్టర్ పేజ్పై కనిపించిన పోస్ట్ అభిమానలకు భారీ షాక్ ఇచ్చింది. ' చాలా రోజులుగా అభిమానులు... సినిమా రిలీజ్, ఆడియో రిలీజ్ల గురించి అడుగుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు అనే అనుకుంటున్నారా..? సినిమా విషయంలో ఏ జరుగుతుందో నాకు కూడా తెలీదు' అన్న పోస్ట్ ఇండస్ట్రీ వర్గాలను కూడా షాక్కు గురి చేసింది. అయితే ఈ కామెంట్ పోస్ట్ అయిన కొద్ది సేపటికే డిలీట్ అవ్వటం తిరిగి పోస్ట్ అవ్వటం మళ్లీ డిలీట్ అవ్వటం అభిమానులను మరింత కన్ఫ్యూజ్ చేసింది.

ఫైనల్గా ఈ విషయంపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. తన ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయినట్టుగా తన టీం గుర్తించింది, ఏం జరిగిందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. నా ఎకౌంట్ పూర్తిగా నా కంట్రోల్ లోకి వచ్చిన తరువాత తిరిగి అభిమానులతో  మాట్లాడతాను అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నాన్నకు ప్రేమతో రిలీజ్పై వచ్చిన రూమర్స్కు చెక్ పెట్టాడు ఎన్టీఆర్. ప్రస్తుతానికి ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమా రిలీజ్ సంక్రాంతికే ఉంటుందంటున్నారు చిత్రయూనిట్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement