కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా క్రూరమైన పాలకులు చాలామంది ఉండేవారు. ఆ క్రూరమైన నియంతలలో అతనిపేరు తప్పుక వినిపిస్తుంది. హిట్లర్ నియంతృత్వ పోకడల గురించి మనం చాలానే విన్నాం. అయితే ఇప్పుడు మనం ‘ఉగాండా కసాయి’గా పేరొందిన ఒక నియంత గురించి తెలుసుకోబోతున్నాం. ఆ నియంతకు మృతదేహాలతో జీవించడమన్నా, మనిషి మాంసం తినడమన్నా ఎంతో ఇష్టమట. ఈ ‘ఉంగాండా కసాయి’ పాలనలో లక్షలాది మంది హత్యకు గురయ్యారని చరిత్ర చెబుతోంది.
ఇప్పుడు మనం ఉగాండా నియంత ఈదీ అమీన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈదీ అమీన్ 1972లో ఉగాండాలో నివసిస్తున్న వేలాది మంది ఆసియావాసులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించించాడు. ఇదీ అమీన్ 130 కిలోలకు మించిన బరువు కలిగివుండేవాడు. ఎత్తు 6 అడుగుల నాలుగు అంగుళాలు. ఈ ‘ఉగాండా కసాయి’కి ఎవరైనా ఎదురైతే ఇక వారి పని అయిపోయినట్టే. ఈదీ అమీన్ అత్యంత క్రూరమైనవాడు. అతని పేరు చెప్పగానే జనం వణికిపోయేవారు.
ఈదీ అమీన్ సహచరులు రాసిన కొన్ని పుస్తకాల్లో వెల్లడైన వివరాలు తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఈ పుస్తకాల ద్వారానే ఈ నియంత ఎంత క్రూరుడో ప్రపంచానికి తెలిసింది. ఈ ఉగాండా కసాయి తన శత్రువులను హత్య చేసిన తరువాత, వారి మృతదేహాలను మరింత క్రూరంగా హింసించేవాడు. అంతే కాదు మృతదేహాలతో ఒంటరిగా గడపడమంటే ఆయనకు ఇష్టమని కొందరు తమ రచనలలో తెలిపారు. ఇది అతనికి ఎంతో ప్రశాంతతను ఇస్తుందట. ఇంతేకాదు ఆ నియంత మానవ మృతదేహాలను తినేవాడట. అలాగే వారి రక్తాన్ని తాగడాన్ని ఇష్టపడేవాడట. చిరుతపులి మాంసం కంటే మానవ మాంసమే బాగుంటుదని అమీన్ ఓ వైద్యునితో చెప్పాడట.
ఇది కూడా చదవండి: ‘లాయర్ల సీనియర్ హోదా’ అంటే ఏమిటి? నిబంధనలు, అర్హతలు ఏవి?
Comments
Please login to add a commentAdd a comment