నర్సాపూర్ రూరల్: రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించేందుకు ఇందిర క్రాంతి పథం సభ్యులు కృషి చేస్తున్నారు. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు, వేపపిండి, కషాయాన్ని రైతులకు అందుబాటులో ఉంచారు. మండలంలోని రుస్తుం పేట ఇందిర క్రాంతి పథం సభ్యులు రెండేళ్ల క్రితం నాన్‌ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌పీఎం)ను అమలు చేస్తున్నారు.
అందులో భాగంగా ఐకేపీ సభ్యులు పూర్తిగా రసాయన ఎరువులు వాడకుండా క్రిమి సంహారక ఎరువుల కోసం వేప కషాయం లాంటి మందులను వాడుతూ పంటలను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో రెండేళ్ల ను ంచి రసాయన ఎరువుల వాడకం బాగా తగ్గిపోయింది. సేంద్రియ ఎరువులు, క్రిమి కీటకాల నాశనానికి వేపపిండి, వేప కషాయం వాడిన రైతులందరూ మంచి దిగుబడి సాధించడంతో మిగతాగ్రామాల రైతులు కూడా సేం ద్రియ ఎరువులు వాడేందుకు ముందుకు వస్తున్నారు.
దీంతో రుస్తుంపేట ఎన్‌పీఎం గ్రామ కోర్డినేటర్ పి. శేఖర్ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం రుస్తుంపేట ఐకేపీ కేంద్రంలో రైతులకు కావాల్సిన సేంద్రియ ఎరువులు, వేపపిండి, వేప కషాయం అందుబాటులో ఉంచారు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు మంచి దిగుబడులు సాధించుకునేందుకు అవకాశం ఉందని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. వేపపిండి కిలో రూ.12, వేప కషాయం లీటరు రూ. 200కు విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. వరి నాటు సమయంలో, ఇతర పంటలు సాగు చేసుకునే ముందు రైతులు వేపపిండిని విస్తీర్ణాన్ని బట్టి చల్లుకోవాల్సి ఉంటుందని ఐకేపీ సిబ్బంది చెప్పారు. పంట ఎదిగే సమయంలో క్రిమి కీటకాలు సోకకుండా వేప కషాయాన్ని పిచికారి చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
సేంద్రియ ఎరువులతో అధిక లాభాలు
Published Tue, Jul 29 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM
Advertisement
Advertisement