disinfectant drugs
-
కరోనా వేళ వణికిస్తున్న మిడతల దండు
-
మిడతల దండుపై దండయాత్ర
న్యూఢిల్లీ/నాగపూర్: రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బంది క్రిమి సంహారక మందులు చల్లారు, రైతులు పళ్లాలు మోగించారు. పెద్దపెద్ద శబ్దాలు చేశారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా? పచ్చటి పంటలను, చెట్ల ఆకులను విందు భోజనంలా ఆరగిస్తున్న రాకాసి మిడతల దండును తరిమికొట్టడానికే. ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మిడతలు దాడి చేసే ప్రమాదం ఉందని సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మిడతలు త్వరలో బిహార్, ఒడిశాకు చేరుకోనున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) హెచ్చరించింది. మామిడి తోటలకు తీవ్ర నష్టం మిడతలపై యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని హరియాణా వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కౌశల్ చెప్పారు. మిడతల విషయంలో తాజా పరిస్థితిని సమీక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. గత నెలలో పాకిస్తాన్ నుంచి రాజస్తాన్‌లోకి ప్రవేశించిన మిడతలు ఇప్పటికే 90 వేల హెక్టార్లలో పంటలను తినేశాయి. ఇవి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి అడుగుపెట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో క్రిమి సంహారక మందులు చల్లి, భారీ సంఖ్యలో మిడతలను హతమార్చారు. మహారాష్ట్రలోనూ పలు జిల్లాల్లో మిడతలు ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భారత్‌లో మిడతల దాడి మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఎఫ్ఏవో వెల్లడించింది. -
సేంద్రియ ఎరువులతో అధిక లాభాలు
నర్సాపూర్ రూరల్: రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించేందుకు ఇందిర క్రాంతి పథం సభ్యులు కృషి చేస్తున్నారు. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు, వేపపిండి, కషాయాన్ని రైతులకు అందుబాటులో ఉంచారు. మండలంలోని రుస్తుం పేట ఇందిర క్రాంతి పథం సభ్యులు రెండేళ్ల క్రితం నాన్ఫెస్టిసైడ్ మేనేజ్మెంట్ (ఎన్‌పీఎం)ను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఐకేపీ సభ్యులు పూర్తిగా రసాయన ఎరువులు వాడకుండా క్రిమి సంహారక ఎరువుల కోసం వేప కషాయం లాంటి మందులను వాడుతూ పంటలను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో రెండేళ్ల ను ంచి రసాయన ఎరువుల వాడకం బాగా తగ్గిపోయింది. సేంద్రియ ఎరువులు, క్రిమి కీటకాల నాశనానికి వేపపిండి, వేప కషాయం వాడిన రైతులందరూ మంచి దిగుబడి సాధించడంతో మిగతాగ్రామాల రైతులు కూడా సేం ద్రియ ఎరువులు వాడేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో రుస్తుంపేట ఎన్‌పీఎం గ్రామ కోర్డినేటర్ పి. శేఖర్ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం రుస్తుంపేట ఐకేపీ కేంద్రంలో రైతులకు కావాల్సిన సేంద్రియ ఎరువులు, వేపపిండి, వేప కషాయం అందుబాటులో ఉంచారు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు మంచి దిగుబడులు సాధించుకునేందుకు అవకాశం ఉందని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. వేపపిండి కిలో రూ.12, వేప కషాయం లీటరు రూ. 200కు విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. వరి నాటు సమయంలో, ఇతర పంటలు సాగు చేసుకునే ముందు రైతులు వేపపిండిని విస్తీర్ణాన్ని బట్టి చల్లుకోవాల్సి ఉంటుందని ఐకేపీ సిబ్బంది చెప్పారు. పంట ఎదిగే సమయంలో క్రిమి కీటకాలు సోకకుండా వేప కషాయాన్ని పిచికారి చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.