
నర్సాపూర్‌లో రాస్తారోకోలో పాల్గొన్న వ్యాపారులు, నాయకులు
నర్సాపూర్: నర్సాపూర్ నియోజకవర్గాన్ని మెదక్ జిల్లాలో కలిపి నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలన్న డిమాండుతో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సంఘీభావంగా సోమవారం వ్యాపారస్తులు ర్యాలీ చేపట్టారు. అనంతరం రాస్తారోకో చేశారు. పట్టణంలోని పలు రకాలు వ్యాపారస్తులు కుమ్మరి సంజీవ, చంద్రశేకర్, భుజేందర్, ప్రవీన్‌కుమార్, వెంకటేశ్, కృష్ణమూర్తి, లక్ష్మన్, నాగరాజు, ప్రకాష్ తదితరులు పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి.
కొనసాగుతున్న రిలే దీక్షలు
నర్సాపూర్‌ను మెదక్‌లో కలిపి రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలన్న డిమాండుతో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 19వ రోజుకు చేరాయి. దీక్షల్లో మండలంలోని నారాయణపూర్ గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్‌తో పాటు గ్రామస్తులు నర్సయ్య, లక్ష్మి, పెద్దులు, రవుజా నాయక్, వీరస్వామి, వెంకటయ్య, బాగులు తదితరులు కూర్చున్నారు. వీరికి వ్యాపారులు, టీఆర్‌ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు అశోక్‌గౌడ్, చంద్రశేకర్, హబీబ్‌ఖాన్, మల్లేశ్‌యాదవ్, భిక్షపతి, ఖుస్రు, నగేష్, కృపాచారి తదితరులు పాల్గొన్నారు.