business men
-
బిజినెస్మెన్ లైఫ్‌తో బాక్సాఫీస్ బిజినెస్ షురూ!
వ్యాపారం చేశారు... విజయాలు సాధించారు... కొందరు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఈ వ్యాపారవేత్తల జీవితాల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ప్రస్తుతం కొందరు విజయవంతమైన వ్యాపారవేత్తల ‘బయోపిక్’కి హిందీలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రియల్ బిజినెస్మెన్ లైఫ్‌తో బాక్సాఫీస్ బిజినెస్ షురూ చేస్తున్నారు సినీ బిజినెస్మెన్ అయిన నిర్మాతలు. ఇక ‘బయోపిక్స్’ గురించి తెలుసుకుందాం. మూడు తరాల టాటా కథ టాటా గ్రూపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశపు అతి పెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్ షెడ్జీ టాటా. జమ్ షెడ్జీ తర్వాత ఆ కుటుంబానికి చెందిన వారసులు బాధ్యతలు చేపట్టారు. వారిలో రతన్ టాటా ఒకరు. దేశంలో పేరున్న ఈ కుటుంబంపై సినిమా నిర్మించడానికి టీ సిరీస్ భూషణ్‌కుమార్ హక్కులు పొందారు. ‘ది టాటాస్’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. టాటా కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యాపారవేత్తల కథతో ఈ సినిమా ఉంటుంది. ‘ది టాటాస్, హౌ ఎ ఫ్యామిలీ బిల్ట్ ఎ బిజినెస్ అండ్ ఎ నేషన్’ నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంకా ఈ చిత్రానికి నటీనటులు, దర్శకుడి ఎంపిక జరగలేదు. కాఫీ కింగ్ కేఫ్ కాఫీ డే వ్యవస్థాకుడు వీజీ సిద్ధార్థ జీవితం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగే క్రమంలో సిద్ధార్థ ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వ్యాపారంలో విజయవంతంగా దూసుకెళుతున్న ఆయన అనూహ్యంగా నదిలో శవం అయి తేలడం వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ‘కాఫీ కింగ్: ది స్విఫ్ట్ రైజ్ అండ్ సడన్ డెత్ ఆఫ్ కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ్థ’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. హిందీలో అక్షయ్‌కుమార్ ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘సూరరై పోట్రు’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు సుధ. రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. కాగా సౌత్‌లో ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మించిన సూర్య రీమేక్‌ని కూడా నిర్మించనున్నారు. హిందీలో నిర్మాతగా సూర్యకి ఇది తొలి చిత్రం అవుతుంది. విజయాలు.. వివాదాలతో... విజయాలు, వివాదాలతో వార్తల్లో నిలిచిన సహారా సంస్థ చైర్మన్ సుబ్రతా రాయ్ బయోపిక్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు కానీ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్, రచయితగా గుల్జార్ వ్యవహరించనున్నారు. ‘దిల్ సే, గురు, యువరాజ్, స్లమ్‌డాగ్ మిలియనీర్’ వంటి చిత్రాలకు రెహమాన్, గుల్జార్ పని చేశారు. గుల్జార్ లాంటి అద్భుత రచయితతో మళ్లీ కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉందని రెహమాన్ పేర్కొన్నారు. లలిత్ లైఫ్‌తో... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ జీవిత విశేషాలతో సినిమా రూపొందనుంది. ఐపీఎల్‌తో క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన లలిత్ మోడీ జీవితంపై వచ్చిన ఓ పుస్తకం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని వార్త వచ్చింది. అయితే ఈ వార్త నిజం కాదని లలిత్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ‘‘ఏదో పుస్తకం ఆధారంగా నాపై సినిమా తీస్తున్నారని విని ఆశ్చర్యపోయాను. దానికి, నాకూ ఎలాంటి సంబంధం లేదు. నా బయోపిక్ గురించి నేను స్వయంగా ప్రకటిస్తాను’’ అని లలిత్ పేర్కొన్నారు. విజయంతో వెలుగులోకి... ప్రముఖ అంధ పారిశ్రామిక వేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవితం వెండితెరకు రానుంది. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో పుట్టిన శ్రీకాంత్ ఎన్నో ఆటంకాలను అధిగమించి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా రికార్డు సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి, 2500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. చూపు లేకపోయినా విజయంతో వెలుగులోకి వచ్చిన శ్రీకాంత్ జీవితం ఆధారంగా దర్శకురాలు తుషార్ హిద్రానీ సినిమా తెరకెక్కించనున్నారు. శ్రీకాంత్ బొల్లా పాత్రను రాజ్‌కుమార్ రావ్ పోషించనున్నారు. ఇవే కాదు.. మరికొందరు ప్రముఖ వ్యాపారవేత్తల బయోపిక్స్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. బయోపిక్స్‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. పైగా స్ఫూర్తిగా నిలిచే వ్యాపారవేత్తల జీవిత చిత్రాలంటే ఇంకా ఉంటుంది. అందుకే దర్శక–నిర్మాతలు రియల్ బిజినెస్మెన్ జీవితాలను రీల్‌పై ఆవిష్కరించడానికి రెడీ అయ్యారు. -
బెట్టింగ్
జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని పలు బార్లు క్రికెట్ బెట్టింగ్‌కు అడ్డగా మారాయి. ఐపీఎల్ 11 ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ బార్లలో రోజూ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. సాయంత్రం మ్యాచ్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు బార్లలో ఇదే సందడి నెలకొంటోంది. స్థానికులే దీన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం చెన్నయ్ సూపర్‌కింగ్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్ మధ్య జరిగిన పోటీ లక్షల రూపాయల బెట్టింగ్ జరిగింది. ఓ బడాబాబు చెన్నయ్ సూపర్ కింగ్స్ గెలుస్తుందని రూ.2 లక్షల బెట్టింగ్ కాసాడు. ఆ టీం గెలుపొందడంతో అంతకు నాలుగింతలు రూ.8 లక్షలు ఆయన చేతికి అందాయి. ఈ ఒక్క సంఘటననే జిల్లాలో బెట్టింగ్ ఏ స్థాయిలో జరుగుతుందనేది తెలుస్తోంది. బడాబాబులు లక్షల రూపాయలు బెట్టింగ్ కాసేందుకు వెనకాడడం లేదు. సాక్షి, ఆదిలాబాద్ : బడాబాబులు రూ.లక్షల్లో పెడుతుంటే కొంతమంది యువత జట్టు కట్టి మరీ బెట్టింగ్ కాస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పని చేసే ఓ యువకుడు తన వంతుగా రూ.500 ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పెట్టాడు. తన మిత్రులందరి ద్వారా కలిసి రూ.40 వేలు జమచేసి ఈ బెట్టింగ్‌లో పెట్టారు. ఆ జట్టు గెలుపొందడంతో ఆ ఆఫీస్ బాయ్‌కి రూ.2 వేలు, ఆ మిత్రులు మొత్తం కలిసి పెట్టిన మొత్తానికి రూ.లక్షా 60 వేలు చేతి కందాయి. ఇప్పుడు క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్‌లపై ఆ మొత్తాన్ని బెట్టింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అదే సమయంలో కొంతమంది యువకులు జట్టుగా కలిసి రూ.70 వేలు రాజస్థాన్ రాయల్స్‌పై పెట్టి నష్టపోయారు. ఇలాంటివి ఒకట్రెండు దృష్టికి రాగా వందలాది మంది యువకులు జట్టుగా కలిసి రోజు బెట్టింగ్ కట్టడం జరుగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా.. ఆదిలాబాద్ కేంద్రంగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పొట్టి క్రికెట్ మజాను కొంతమంది బెట్టింగ్ రూపంలోకి తీసుకువచ్చి స్థానికంగా పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, ముఖ్యంగా యువకులను ఈ రోంపిలోకి వచ్చేలా చేసి వారి డబ్బుల ఆశను సోమ్ము చేసుకుం టున్నారు. లోకల్‌గానే ఈ వ్యవహారం అంతా సాగుతోందని, స్థానికంగా బుకీలుగా అవతారం ఎత్తిన వారికి పైస్థాయిలో ఇతర రాష్ట్రాల్లోని బడాబుకీలతో సంబంధాలు లేనట్లుగా తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్లలో ఆదిలాబాద్‌లో మామూలుగా సాగిన వ్యవహరం ఐపీఎల్–11కు వచ్చే సరికి మాత్రం కోట్ల రూపాయలకు పాకి మున్ముందు బుకీ వ్యవస్థ ఏర్పడినా ఆశ్చర్య పోనక్కర్లేదన్న పరిస్థితి కనిపిస్తోంది. 11వ ఐపీఎల్ ప్రారంభమైన తరువాత గుట్టుచప్పడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో ఆదిలాబాద్ పట్ట ణానికి చెందిన కొంతమంది బార్లు, వైన్స్‌ల య జమానులు కోట్ల రూపాయల్లో దీన్ని సాగిస్తున్నా రు. గతంలో పేకాట క్లబ్‌లను నిర్వహించిన అనుభవం ఉన్న కొంతమంది ఈ వ్యవహరాన్ని పకడ్బందీగా సాగిస్తున్నారు. కొందరు యువకులు ఈ బెట్టింగ్‌ను నిర్వహిస్తూ రోజు కూలీ పనులు చేసుకునే వారిని, పేదలను దీని పట్ల ఆకర్షితులయ్యేలా చేసి వారి డబ్బులను గుల్ల చేస్తున్నారు. ఇటీవల కాలంలో పట్టణంలో మట్కా, పేకాట ను పోలీసులు అరికట్టడంతో కొందరు ఈ బెట్టిం గ్ వైపు దృష్టి సారిస్తున్నారు. పట్టణంలోని మహాలక్ష్మివాడ, ఖానాపూర్, భుక్తాపూర్ కాలనీల్లో పలువురు ఈ బెట్టింగ్‌ను నిర్వహిస్తూ దం దా కొనసాగిస్తున్నారు. విద్యానగర్‌లోని ఓ లాడ్జి నిత్యం పలువురు కళాశాల విద్యార్థులు, ఇతరులతో సాయంత్రం సమయంలో కిక్కిరిసి ఉంటోం ది. ఈ లాడ్జిలో బెట్టింగ్ జోరుగా సాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చేస్తున్నరా లేనిపక్షంలో ఈ వ్యవహరాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నరా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గెలిస్తే రెట్టింపు... 11వ ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ 7న ప్రారంభమైంది. ఈ నెల 27న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సీజన్ ప్రారంభమైన తరువాత ఆదిలాబాద్‌లో బెట్టింగ్‌ను స్థానికులైన పలువురు వ్యాపారులు, యువకులు నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సీజన్ మొదటి నుంచి ప్రముఖ హోటళ్లు, లాడ్జీలు, బార్లను అడ్డలుగా చేసుకొని బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ప్రధానమైన టీంలపై ఈ బెట్టింగ్ వ్యవహారం నడుస్తోంది. బలమైన టీం గెలుస్తుందని బెట్టింగ్ పెట్టినప్పుడు రెట్టింపు, అంతకంటే ఎక్కువ, కొన్ని పరిస్థితుల్లో నాలుగింతలు డబ్బులు వస్తాయి. బలమైన టీంపై బెట్టింగ్ చేస్తే తక్కువ వస్తాయని, బలహీన టీంపై బెట్టింగ్ చేసి గెలిచిన వారికి అంతకంటే ఎక్కువే డబ్బులు ముట్టజేబుతామని ఆశ చూపడంతో పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, యువత అయోమయంలో డబ్బులు పెట్టి వేలు, లక్షలు నష్టపోతున్నారు. వేసవి సెలవులు కావడంతో పలువురు యువత కూడా ఖాళీ సమయాన్ని దీనికి కేటాయిస్తుండడంతో పక్కదారి పడుతున్నారు. నిర్వాహకులు హోటళ్లు, లాడ్జీలు, బార్లను అడ్డగా చేసుకుని కేవలం సెల్‌ఫోన్ ద్వారా మంతనాలు చేస్తూ నడిపిస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఓ బార్లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే మ్యాచ్ జరిగే రోజు మధ్యాహ్నం పేరు, సెల్ నం, బెట్టింగ్ పెట్టే జట్టు పేరు, ఎంత నగదు బెట్టింగ్ అనేవి రాసుకుంటున్నారు. మొదట బ్యాటింగ్ అయిపోయిన తర్వాత ఎంట్రీ చేసుకున్న వారికి నంబర్ కేటాయించి దాని ఆధారంగా మ్యాచ్ అనంతరం ఫలితాన్ని బట్టి పేమెంట్ చేస్తున్నారు. ఇలా వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. ఫలితాలకు అనుగుణంగా డబ్బులు ముట్టజెబుతుండడంతో వ్యవహారం బయటకు రావడం లేదు. ఈ బెట్టింగ్ ద్వారా ఓ వ్యాపారి సుమారు కోటి రూపాయలు గడించినట్లు పట్టణంలో చర్చ సాగడం సంచలనం కలిగిస్తోంది. నిర్వాహకులు లాభ పడుతుండగా, బెట్టింగ్ చేసిన మాములు వ్యక్తులు ఈ లెక్కన కోట్ల రూపాయలలో నష్టపోతున్నారు. కొంతమంది ఫలితాల కోసం హోటళ్లలో గదులు బుక్ చేసుకుని అర్ధరాత్రి వరకు మ్యాచ్‌లు చూస్తూ విందువినోదలతో గడుపుతున్నారు. క్వాలిఫయర్ 2, ఫైనల్ నేపథ్యంలో జోరు... ఇప్పటివరకు బెట్టింగ్ ఓ స్థాయిలో జరుగగా, క్వాలిఫయర్ 2 మ్యాచ్ శుక్రవారం, ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుండడంతో బెట్టింగ్ తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోటీ జరగనుంది. ఈ రెండు టీమ్‌లలో సమాన గెలుపు అవకాశాలు ఉండడంతో బెట్టింగ్‌లో కొంత తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన చెన్నయ్ సూపర్‌కింగ్స్ మీద పలువురు కోట్ల రూపాయలు వెచ్చించేందుకు వెనకాడడం లేదు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆ టీం పైనే పలువురు బెట్టింగ్ కాస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచుల్లో బెట్టింగ్ కోట్ల రూపాయల్లో సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఓ బార్లో పలువురు నిర్వాహకులు సమావేశమై చర్చలు జరిపారనేది విశ్వసనీయంగా తెలుస్తోంది. నిఘా పెట్టినం.. బెట్టింగ్ జరుగుతున్నట్లు ప్రచారం రావడంతో పలుచోట్ల నిఘా పెట్టాం. ఆదిలాబాద్‌లో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం వస్తోంది. పకడ్బందీగా దాడి చేసి పట్టుకోవడం జరుగుతుంది. – విష్ణు ఎస్.వారియర్, ఎస్పీ -
జీఎస్టీపై భయం వీడండి
తాళ్లపూడి: వ్యాపారుల్లో జీఎస్టీపై ఉన్న భయం వీడాలని, కొత్త చట్టంపై అవగాహన ముఖ్యమని వాణిజ్యపన్నుల శాఖ జిల్లా జాయంట్ కమిషనర్ టి.రాజశేఖర్ సూచించారు. వినియోగదారుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ప్రక్కిలంకలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎస్టీపై వ్యాపారులు, విద్యార్థుల సందేహలను జేసీ రాజశేఖర్ నివృత్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీఎస్టీ రావడంతో కొందరు వ్యాపారాలను మానుకోవాలా అనుకుంటున్నారని ఇది సరికాదన్నారు. జీఎస్టీలో 5 శాతం నుంచి 12, 18, 28 శాతం వరకు పన్ను ఉందన్నారు. కొత్త విధానానికి వ్యాపారులు అలవాటు పడాలని సూచించారు. 17 రకాల పన్నులను కలిపి జీఎస్టీగా మార్చారన్నారు. వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లా కార్యరద్శి ఎంఏ అన్సారీ, సీటీఓ కె.వెంకటేశ్వరరావు, మండల రైస్‌మిల్లర్స్ అధ్యక్షుడు సింహద్రి జనార్దనరావు, వినియోగదారుల పరిరక్షణ సమితి సభ్యులు అప్పన రాజా, కె.మోహన్, కూచిభట్ల ప్రసాద్, పరస రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
టాలీవుడ్ ముద్దుగుమ్మ పెళ్లి కబురు..!
టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా చలామణి అవుతున్న కాజల్ అగర్వాల్ పెళ్లికి సంబంధించి పలు రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చారడేసి కళ్లతో చందమామ సినిమాతో స్టార్ గా మారిన కాజల్, తెలుగు, తమిళ సినిమాల్లో ఓ వెలుగు వెలుగుతోంది. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందిట. ఇదే ఇపుడు సోషల్ మీడియా టాప్ టాక్. ముంబైకి చెందిన ఓ బిజినెస్ మెన్ తో కాజల్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనీ, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. అంతేకాదు ఇరు కుటుంబ పెద్దలు వీరి ప్రేమ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసారనీ, దీంతో వీరు ఏడు అడుగులు వేయనున్నారనీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాజల్ చేసుకోబోయే వ్యక్తికి దేశవ్యాప్తంగా హోటల్స్ చైన్ ఉందని అంటున్నారు. కాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ మూవీ ఖైదీ నెం 150లో అమ్మడూ.. లెస్ట్ డు కుమ్ముడుతో అభిమానులను కుమ్మేసిన ఈ కలువ కళ్ళ సుందరి కాజల్ కి ఈ ఏడాది బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం వివేగం, నేనే రాజు నేనే మంత్రి తో పాటు డీకే దర్శకత్వంలో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి కబుర్లపై కాజల్ అధికారింగా స్పందించేంతవరకు ఈ సస్పెన్స్ తప్పదు. మరి.. ఈ శుభవార్త అభిమానుల చెవిన ఎపుడు వేస్తోందో.. వేచి చూడాల్సిందే.. -
పెట్రోల బంకు వ్యాపారుల మెరుపు సమ్మె
* ఆయిల్ కంపెనీలు, డీలర్లకు మధ్య కుదరని ఏకాభిప్రాయం * కృష్ణా జిల్లాలో డీలర్ల అరెస్టులో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కట్టుబడిపాలెం (ఇబ్రహీంపట్నం): ఆయిల్ కంపెనీ అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లకు మధ్య వివాదం చినికికిచినికి గాలివానగా మారి రాష్ట్రంలో బంక్‌ల మూసివేతకు దారి తీసింది. ముందుగా నిర్ణయించిన మేరకు పెట్రోల్ బంక్ డీలర్ల మార్జిన్ పెంచాలని కోరుతూ గురువారం ఉదయం నుంచి ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ కొనుగోలు మానేశారు. స్థానిక హెపీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ ఆయిల్ కంపెనీల ఎదుట మధ్యాహ్నం ధర్నా చేశారు. హెచ్‌పీసీఎల్ కంపెనీ అధికారులు మాత్రం బలవంతంగా పెట్రోల్ ట్యాంకర్లను డీలర్లకు పంపసాగారు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన డీలర్లు కట్టుబడిపాలెంలోని ఆయిల్ కంపెనీ వద్దకు వచ్చి ధర్నాకు దిగారు. కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. హెచ్‌పీసీఎల్ అధికారులు ట్యాంకర్లు పంపేందుకే నిర్ణయించారు. దీనికి నిరసనగా కొంతమంది డీలర్లు రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న జీ.కొండూరు పోలీసులు ఆయిల్ కంపెనీ వద్దకు వచ్చి డీలర్లను అరెస్టు చేసి బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన కృష్ణా, గుంటూరు డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. కృష్ణా జిల్లాలో డీలర్లను ఆయిల్ కంపెనీ అధికారులు వేధిస్తున్నారంటూ అన్ని జిల్లాల డీలర్లకు సమాచారం ఇవ్వడంతో గురువారం రాత్రి రాష్ట్రలలో పెట్రోల్ విక్రయాలు నిలిచిపోయాయి. ఏపీఎఫ్పీటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి చెంచు నరసింహారావు మాట్లాడుతూ ఆయిల్ కంపెనీల తీరు మారకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అక్రమ కేసులు పెడితే సహించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ జాతీయ కమిటీని కలిసి శుక్రవారం ఆయిల్ కంపెనీలతో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లారని తెలిపారు. ఆయనకు సమాచారమిచ్చి అవసరమైతే నిరసన కొనసాగిస్తామని చెప్పారు. -
సంగతి చూస్తాం!
అమరావతి షాపింగ్ ఫెస్టివల్ పేరిట ప్రభుత్వం హడావుడి ...! స్టాల్స్ పెడతారా...లేదా అని హెచ్చరికలు విముఖత చూపుతున్న వ్యాపార ఏజెన్సీలు ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందంటే ఇదేనేమో!...అమరావతి షాపింగ్ ఫెస్టివల్ పేరిట ప్రభుత్వ ప్రచార ఆర్భాటం వ్యాపారులకు సంకట ప్రాయంగా మారింది. వ్యాపారాలు లేక అల్లాడుతుంటే ప్రభుత్వ ప్రచారం కోసం తాము స్టాల్స్ ఏర్పాటు చేయలేమని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం తనదైన శైలిలో కొరడా ఝుళిపిస్తోంది. ‘స్టాల్స్ ఏర్పాటు చేయకపోతే మీ వ్యాపారాల సంగతి తేలుస్తాం’ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ, గుంటూరులలో వ్యాపార ఏజెన్సీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న షాపింగ్ ఫెస్టివల్ మాయాజాలం ఇది.. రెండేళ్లుగా వ్యాపారం డల్‌గా ఉందని వాపోతున్న వ్యాపారులు దసరా నుంచి సంక్రాంతి సీజన్ వరకు కొంతవరకైనా పెరగకపోతుందా అని ఆశిస్తున్నారు. ఇంతలో ప్రభుత్వం ఏకపక్షంగా అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. ఇందులో అన్ని వ్యాపార సంస్థలు తప్పనిసరిగా తమ స్టాల్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రధానంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్- గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్ సంస్థలపై దృష్టి సారించింది. ఆ సంస్థల స్టాల్స్ 100కుపైగా ఉండాలని నిర్దేశించింది. వాటిని సందర్శించేందుకే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఒక్కో స్టాల్‌కు రూ.40వేల చొప్పున డీడీ చెల్లించి మరీ ఏర్పాటు చేయాలని చెప్పింది. దాంతోపాటు ఇతర నిర్వహణ ఖర్చులు ఉండనే ఉంటాయి. కానీ ఆ ఫెస్టివల్లో ప్రభుత్వ షో తప్ప అసలు వ్యాపారం ఉండదని ఏజెన్సీలు గ్రహించి ఆసక్తి చూపించలేదు. పీక్ సీజన్లో తమ షోరూంలలో వ్యాపారాలపై దృష్టి పెట్టాలిగానీ షాపింగ్ ఫెస్టివల్లో స్టాల్స్ పెట్టలేమని భావించారు. స్టాల్స్ పెడితే సిబ్బందిని అక్కడ వినియోగించాల్సి వస్తుందని... దీంతో తమ షోరూంలలో వ్యాపారం దెబ్బతింటుందన్నది వారి ఆందోళన. రియల్ ఎస్టేట్ సంస్థలు రాష్ట్ర విభజన తరువాత కూడా ఆశించినంత బూమ్ లేదని నిరాశతో ఉన్నాయి. ఇటీవల విజయవాడ శివారు ప్రాంతాల్లో నిర్మాణాలను కేవలం రాజకీయ కారణాలతో కూల్చివేస్తుండడం కూడా వారిని ఆవేదనకు గురి చేస్తోంది. దాంతో షాపింగ్ ఫెస్టివల్ ప్రకటించి 15రోజులు అవుతున్నా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ -గృహోపకరణాల ఏజన్సీలు సానుకూలంగా స్పందించలేదు. షాపింగ్ ఫెస్టివల్‌ను గురువారం ప్రారంభించాల్సి ఉందని తెలిసినా బుధవారం రాత్రి వరకు ఏ ఏజెన్సీలు స్టాల్స్ ఏర్పాటుకు సుముఖత చూపించలేదు. ‘స్టాల్స్ పెట్టకపోతే మీ సంగతి చూస్తాం’ నిర్దేశించిన మేరకు స్టాల్స్ లేకపోతే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తారని అధికారులు ఆందోళన చెందారు. జిల్లా ఉన్నతాధికారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో బుధవారం రాత్రి మాట్లాడి ఎలాగైనా సరే స్టాల్స్ ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. అందుకు సామ దాన దందోపాయాలు ప్రయోగించాలని కూడా స్పష్టం చేశారు. రవాణా శాఖ అధికారి ఒకరు ఆటోమొబైల్ డీలర్లతో మాట్లాడి ఒక్కొక్కరు రెండేసి స్టాల్స్ ఏర్పాటు చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. లేకపోతే షోరూంలలో విక్రయించే వాహనాలకు కల్పిస్తున్న టెంపరరీ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో డీలర్లు బెంబేలెత్తారు. అయిష్టంగానే ఒక్కొక్క స్టాల్ ఏర్పాటుకు సమ్మతించాల్సి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ - గృహోపకరణాల ఏజెన్సీలను కూడా సేల్స్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ‘తమదైన శైలి’లో హెచ్చరించారు. ఇక స్టాల్స్ ఏర్పాటు చేయని రియల్ ఎస్టేట్ సంస్థలను బ్లాక్‌లిస్టులో పెట్టి ఇకముందు లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమని కూడా రెవెన్యూ, సీఆర్డీఏ అధికారులు తేల్చిచెప్పారు. ఈ పరిణామాలతో వ్యాపార వర్గాలు బెంబేలెత్తాయి. అమరావతి షాపింగ్ ఫెస్టివల్లో స్టాల్స్ ఏర్పాటుకు సమ్మతించాల్సి వచ్చింది. అదండీ సంగతి... రాజు తలచుకుంటే అన్న రీతిలో వ్యాపారుల మెడలు వచ్చి మరీ ఒప్పించారు. -
హడలెత్తుతున్న వ్యాపారులు
పాత గుంటూరు: ఆదాయపు పన్ను ఎగవేతదారులైన వ్యాపారవేత్తలపై ఐటీ శాఖ కొరడా ఝుళిపిస్తుంది. నెలరోజుల వ్యవధిలో నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలైన సబ్బుల వ్యాపారి, బంగారు వ్యాపారి, వస్త్ర దుకాణ దారుల దుకాణాలు, నివాసాలపై ఆకస్మికంగా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి పెద్ద మొత్తంలో నగదుతో పాటు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఆదాయ వెల్లడి పథకం 2016 అనే పథకాన్ని ప్రవేశపెట్టి పన్ను చెల్లింపు దారుల నుంచి అప్రకటిత ఆస్తులపై పన్ను రాబట్టేందుకు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 30తో ఈ పథకానికి కేటాయించిన గడువు ముగియనుండటంతో వ్యాపార వేత్తలు, ప్రముఖుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.. ఏకకాలంలో నిర్వహిస్తున్న దాడులకు ఆదాయపన్ను శాఖకు వ్యాపార వేత్తలు తమకు చెందిన అప్రకటిత ఆస్తులను వెల్లడించి ఐటీ శాఖకు సహకరించి పన్ను సక్రమంగా చెల్లించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఐటీ శాఖ నిర్వహిస్తున్న వరుస దాడులతో ఆదాయపు పన్ను ఎగవేతదారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. -
వ్యాపారస్థుల రాస్తారోకో
నర్సాపూర్: నర్సాపూర్ నియోజకవర్గాన్ని మెదక్ జిల్లాలో కలిపి నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలన్న డిమాండుతో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సంఘీభావంగా సోమవారం వ్యాపారస్తులు ర్యాలీ చేపట్టారు. అనంతరం రాస్తారోకో చేశారు. పట్టణంలోని పలు రకాలు వ్యాపారస్తులు కుమ్మరి సంజీవ, చంద్రశేకర్, భుజేందర్, ప్రవీన్‌కుమార్, వెంకటేశ్, కృష్ణమూర్తి, లక్ష్మన్, నాగరాజు, ప్రకాష్ తదితరులు పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. కొనసాగుతున్న రిలే దీక్షలు నర్సాపూర్‌ను మెదక్‌లో కలిపి రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలన్న డిమాండుతో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 19వ రోజుకు చేరాయి. దీక్షల్లో మండలంలోని నారాయణపూర్ గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్‌తో పాటు గ్రామస్తులు నర్సయ్య, లక్ష్మి, పెద్దులు, రవుజా నాయక్, వీరస్వామి, వెంకటయ్య, బాగులు తదితరులు కూర్చున్నారు. వీరికి వ్యాపారులు, టీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు అశోక్‌గౌడ్, చంద్రశేకర్, హబీబ్‌ఖాన్, మల్లేశ్‌యాదవ్, భిక్షపతి, ఖుస్రు, నగేష్, కృపాచారి తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ కాలనాగులు
ఆరోగ్యంతో వ్యాపారుల చెలగాటం నెయ్యిలో వనస్పతి.. టీ పొడిలో సింథటిక్ చోద్యం చూస్తున్న అధికారులు.. తనిఖీలకు మంగళం తణుకు(పశ్చిమగోదావరి జిల్లా) : జిల్లాలో ఆహారపదార్థాల కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. కొందరు వ్యాపారులు లాభార్జన కోసం నిత్యావసరాల నాణ్యతకు మంగళం పాడుతున్నారు. ఇది ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమించింది. ప్రస్తుతం ఏ పదార్థాన్ని చూసినా అది అసలుదో.. కల్తీదో తెలుసుకోవడం కష్టమవుతోంది. నిత్యావసరాలైన నెయ్యి, వంట నూనె, టీపొడి, బియ్యం, పాలు ఇలా ఒకటేమిటి ప్రతిదీ కల్తీ అవుతోంది. జిల్లా కేంద్రంగా కల్తీ నెయ్యి, నూనెల తయారీ జరుగుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. గతంలో తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో నెయ్యి, నూనె తయారీ కేంద్రాలపై దాడి చేసిన విజిలెన్స్ అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు కళ్లముందు సాక్షాత్కరించాయి. వాటి నమూనాలను ప్రయోగశాలకు పంపిన అధికారులు అవన్నీ కల్తీవని తెలియడంతో నివ్వెరపోయారు. ముచ్చటైన ప్యాకింగ్‌తో మాయ పా్యకింగ్ ముచ్చటగా కనిపిస్తే చాలు ఎంత డబ్బు పోసైనా వస్తువులు కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనుకాడడం లేదు. ఈ బలహీనతనే అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కల్తీ చేసిన వస్తువులను అందంగా ప్యాకింగ్ చేసి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గతంలో తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై జరిగిన దాడుల్లో నెయ్యిలో ఎక్కువగా వనస్పతి కలుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. చాలా తక్కువ మోతాదులో నెయ్యిని తెచ్చి అధిక శాతం వనస్పతి కలిపి ముచ్చటగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నట్టు తేల్చారు. రంగు పౌడర్‌తో టీపొడి టీ పొడిలోనూ రంగు పౌడర్ కలిపి కల్తీ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రఖ్యాత బ్రాండ్ల టీపొడి ఖరీదు ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు విడి టీపొడి వాడకంపై దృష్టిపెట్టారు. దీంతో ఇటీవల కాలంలో మార్కెట్‌ను విడి టీపొడి ముంచెత్తుతోంది. అయితే దీనిని హోటళ్లలో వాడేసిన టీపొడిని సేకరించి అందులో రంపపు పొట్టు కలిపి తిరిగి ప్యాకింగ్చేస్తున్నట్టు తెలుస్తోంది. రంగు రావడంకోసం సింథటిక్ని వినియోగిస్తున్నట్టు సమాచారం. గతంలో ఏలూరులో ఆహార తనిఖీ అధికారులు, విజిలెన్స్ అధికారులు దాడి చేసిన సమయంలో ఇదే తరహాలో తయారు చేసిన టీపొడి నిల్వలను గుర్తించారు. సన్నబియ్యం పేరుతో.. కొందరు వ్యాపారులు బియ్యాన్నీ కల్తీ చేస్తున్నారు. సన్నబియ్యం పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నారు. కొన్ని ముతక రకాల బియ్యంలో కొంతమేర సన్నం బియ్యం కలిపి పాలిష్ పెట్టి అనధికార బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారు. ఎలాంటి లైసెన్సులూ, అనుమతులూ లేకుండా కనీసం సంచులపై చిరునామా ముద్రించకుండానే అమ్మేస్తున్నారు. చిల్లర వ్యాపారులకు మార్జిన్ ఎక్కువ ఇస్తుండటంతో వీటి అమ్మకాలకు వారూ మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ప్లాస్టిక్ బియ్యం పేరుతో పొరుగు రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తనిఖీలు ఎక్కడ ! కల్తీలను నిరోధించడానికి జిల్లాలో అడపాదడపా దాడులు నిర్వహిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కేంద్రాలపై జిల్లా ఆహార తనిఖీ అధికారులు, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయాల్సి ఉంది. అయితే మొక్కుబడిగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తరచూ దాడులు చేస్తున్నాం జిల్లాలో కల్తీలను నిరోధించడానికి తరచూ తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడైనా ఫిర్యాదులు వచ్చినా స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. గతంలో నిర్వహించిన దాడులకు సంబంధించి సేకరించిన నమూనాలను ప్రయోగశాలకు పంపించి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాం. – మాలకొండారెడ్డి, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్, ఏలూరు -
కల్తీ కాలనాగులు
-ఆరోగ్యంతో వ్యాపారుల చెలగాటం - నెయ్యిలో వనస్పతి.. -టీ పొడిలో సింథటిక్ -చోద్యం చూస్తున్న అధికారులు - తనిఖీలకు మంగళం తణుకు : జిల్లాలో ఆహారపదార్థాల కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. కొందరు వ్యాపారులు లాభార్జన కోసం నిత్యావసరాల నాణ్యతకు మంగళం పాడుతున్నారు. ఇది ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమించింది. ప్రస్తుతం ఏ పదార్థాన్ని చూసినా అది అసలుదో.. కల్తీదో తెలుసుకోవడం కష్టమవుతోంది. నిత్యావసరాలైన నెయ్యి, వంట నూనె, టీపొడి, బియ్యం, పాలు ఇలా ఒకటేమిటి ప్రతిదీ కల్తీ అవుతోంది. జిల్లా కేంద్రంగా కల్తీ నెయ్యి, నూనెల తయారీ జరుగుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. గతంలో తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో నెయ్యి, నూనె తయారీ కేంద్రాలపై దాడి చేసిన విజిలెన్స్ అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు కళ్లముందు సాక్షాత్కరించాయి. వాటి నమూనాలను ప్రయోగశాలకు పంపిన అధికారులు అవన్నీ కల్తీవని తెలియడంతో నివ్వెరపోయారు. ముచ్చటైన ప్యాకింగ్‌తో మాయ పా్యకింగ్ ముచ్చటగా కనిపిస్తే చాలు ఎంత డబ్బు పోసైనా వస్తువులు కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనుకాడడం లేదు. ఈ బలహీనతనే అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కల్తీ చేసిన వస్తువులను అందంగా ప్యాకింగ్ చేసి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గతంలో తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై జరిగిన దాడుల్లో నెయ్యిలో ఎక్కువగా వనస్పతి కలుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. చాలా తక్కువ మోతాదులో నెయ్యిని తెచ్చి అధిక శాతం వనస్పతి కలిపి ముచ్చటగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నట్టు తేల్చారు. రంగు పౌడర్‌తో టీపొడి టీ పొడిలోనూ రంగు పౌడర్ కలిపి కల్తీ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రఖ్యాత బ్రాండ్ల టీపొడి ఖరీదు ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు విడి టీపొడి వాడకంపై దృష్టిపెట్టారు. దీంతో ఇటీవల కాలంలో మార్కెట్‌ను విడి టీపొడి ముంచెత్తుతోంది. అయితే దీనిని హోటళ్లలో వాడేసిన టీపొడిని సేకరించి అందులో రంపపు పొట్టు కలిపి తిరిగి ప్యాకింగ్చేస్తున్నట్టు తెలుస్తోంది. రంగు రావడంకోసం సింథటిక్ని వినియోగిస్తున్నట్టు సమాచారం. గతంలో ఏలూరులో ఆహార తనిఖీ అధికారులు, విజిలెన్స్ అధికారులు దాడి చేసిన సమయంలో ఇదే తరహాలో తయారు చేసిన టీపొడి నిల్వలను గుర్తించారు. సన్నబియ్యం పేరుతో.. కొందరు వ్యాపారులు బియ్యాన్నీ కల్తీ చేస్తున్నారు. సన్నబియ్యం పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నారు. కొన్ని ముతక రకాల బియ్యంలో కొంతమేర సన్నం బియ్యం కలిపి పాలిష్ పెట్టి అనధికార బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారు. ఎలాంటి లైసెన్సులూ, అనుమతులూ లేకుండా కనీసం సంచులపై చిరునామా ముద్రించకుండానే అమ్మేస్తున్నారు. చిల్లర వ్యాపారులకు మార్జిన్ ఎక్కువ ఇస్తుండటంతో వీటి అమ్మకాలకు వారూ మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ప్లాస్టిక్ బియ్యం పేరుతో పొరుగు రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తనిఖీలు ఎక్కడ ! కల్తీలను నిరోధించడానికి జిల్లాలో అడపాదడపా దాడులు నిర్వహిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కేంద్రాలపై జిల్లా ఆహార తనిఖీ అధికారులు, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయాల్సి ఉంది. అయితే మొక్కుబడిగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తరచూ దాడులు చేస్తున్నాం జిల్లాలో కల్తీలను నిరోధించడానికి తరచూ తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడైనా ఫిర్యాదులు వచ్చినా స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. గతంలో నిర్వహించిన దాడులకు సంబంధించి సేకరించిన నమూనాలను ప్రయోగశాలకు పంపించి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాం. – మాలకొండారెడ్డి, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్, ఏలూరు -
లోకేష్ ఆశీస్సులతో బుద్దాకు ఎమ్మెల్సీ పదవి
-
కాల్ యముళ్లు
♦ మహిళలపై ఆకర్షణ వల.. ఆపై రాసలీల ♦ నిరాకరిస్తే బెదిరింపులు అధికార పార్టీ అండతోనే అంతా ♦ చీకటి దందాకు టాస్క్ఫోర్స పోలీసుల చెక్ విజయవాడ సిటీ : ‘పుట్టిన రోజుల పేరిట పార్టీలు.. పెళ్లి రోజుల పేరిట కానుకలు.. మాటల గారడీతో లోబరుచుకోవడం.. ఆపై కోర్కెలు తీసుకోవడం.. మీకు తెలిసినవాళ్లను తీసుకురాకుంటే వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులు’ .... ఇవీ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ముఠా లీలలు. అధికారులు, పేరున్న రాజకీయ నేతల అండదండలతో ఐదేళ్లుగా సాగిస్తున్న వీరి దందాకు ఎట్టకేలకు నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ అడ్డుకట్ట వేశారు. కాల్‌మనీ మనీ పేరిట తెలుగు తమ్ముళ్లు నడిపిస్తున్న ఈ రాకెట్ వెనుక బడా వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం చూసి పోలీసు అధికారులు నివ్వెరపోయారు. అదుపులోకి తీసుకున్న వెంటనే అధికార పార్టీ నేతలు, ఉన్నత అధికారుల నుంచి పోలీసులపై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్టు తెలిసింది. వీరి అభ్యర్థనను సున్నితంగా తోసిపుచ్చిన పోలీసు అధికారులు కూకటివేళ్లతో సహా ముఠాలను పెకిలించేయాలని నిర్ణయించారు. ‘వీళ్ల రాక్షస క్రీడ చూస్తే రక్తం మరుగుతోంది. ప్రతి ఒక్కరికీ అమ్మ, అక్కచెల్లెళ్లు, కూతుళ్లు ఉంటారు. వీరు ఏ ఒక్కరినీ వదలకుండా అనుభవిస్తున్నారు’ అంటూ ఓ సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారంటే వీరి అకృత్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పెద్దోళ్లకు ఎర పై స్థాయిలో పలుకుబడి పెంచుకొని పైరవీలు చేసేందుకు మహిళలు, యువతులను సరఫరా చేస్తుంటారు. తాము లోబరుచుకున్న మహిళలను పెద్దోళ్లకు ఎరగా వేసేందుకు వీరు ప్రణాళికలు రూపొందిస్తారు. ఇందులో భాగంగా మహిళలను మత్తులో ముంచి నగ్న చిత్రాలు తీస్తారు. ఆపై తాము చెప్పిన వ్యక్తుల వద్దకు వెళ్లాలంటూ ఆదేశిస్తారు. వ్యతిరేకిస్తే వీడియోలు బయటపెడతామంటూ బెదిరింపులకు దిగుతారు. తద్వారా తమ మాట వినేలా చేసి హోటళ్లు, అతిథి గృహాలకు పంపి అవసరమైన వ్యక్తుల నుంచి కావాల్సిన పనులు చేయించుకుంటారు. బౌన్సర్ల రక్షణ చీకటి క్రీడలు నిర్వహించే వీరంతా బౌన్సర్లను రక్షణగా పెట్టుకున్నారు. ముఠాకు నేతృత్వం వహిస్తున్న యలమంచిలి రాముకు ఆరుగురు బౌన్సర్లు రక్షణగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. మాట వినని వారిని రూమ్‌లోకి తీసుకెళ్లి బౌన్సర్లతో బడితె పూజ చేయించి బెదిరిస్తారు. ఈ రాకెట్‌లోని వ్యక్తులందరూ సాయంత్రం అయ్యేసరికి ఖరీదైన కార్లలో పంటకాలువ రోడ్డులోని రాము కార్యాలయానికి చేరుకుంటారు తెల్లవార్లు వీరి కార్యకలాపాలు సాగిస్తారు. ఇలాంటివి నచ్చని ఇంటి యజమాని ఖాళీ చేయమన్నందుకే దాడి చేసి పోలీసుల సహకారంతో ఎదురు కేసు పెట్టారు. ఐదేళ్లుగా చీకటి దందా ఐదేళ్లుగా యలమంచిలి రాముతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, నగర ప్రముఖులు కలిసి చీకటి దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అవసరాల్లో ఉన్న వారికి వడ్డీకి డబ్బులిస్తూ లోబరుచుకుని చీకటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకర్షణీయమైన బహుమతులను ఎరగా వేసి లోబరుచుకుంటున్నారు. ఆ కుటుంబానికి చెందిన యుక్త వయస్సు మహిళలను తీసుకొచ్చి అప్పగించాలి. లేదంటే గదిలో పెట్టి కొడతారు. వారుంటున్న పరిసర ప్రాంతాల్లో అందమైన యువతులను తీసుకొచ్చి వీరి కోర్కెలు తీర్చాలి. లేదంటే కుటుంబం పరువు తీస్తామంటూ బెదిరిస్తారు. వారిపై మొహం మొత్తాక వేర్వేరు ప్రాంతాల్లోని తమ అనుచరుల వద్దకు వీరిని పంపుతారు. అక్కడ వారు లోబరుచుకున్న యువతులను ఇక్కడికి రప్పించుకుంటారు. ఐదేళ్లుగా వీరు ఇదే తరహా దందా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిర్భయంగా రండి మహిళలపై జరిగే లైంగిక వేధింపులను ముఖ్యమంత్రి అంగీకరించరు. ఇలాంటివారిని కఠినంగా దండించాలనేది ఆయన ఆలోచన. కాబట్టి బాధిత మహిళలు, యువతులు నిర్భయంగా ముందుకు రావాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. భయపడాల్సిన అవసరం లేదు. మహిళలకు మాదే భరోసా. - గౌతమ్ సవాంగ్, పోలీసు కమిషనర్, విజయవాడ -
కాల్ యముళ్లు
-
అక్రమార్కులకు వరంగా ఇ-రిజిస్ట్రేషన్
సులువుగా రిజిస్ట్రేషన్, సీ-ఫామ్, వేబిల్లు పొందే వీలు = వాణిజ్యపన్నుల శాఖకు రూ. కోట్లలో గండి సాక్షి, హైదరాబాద్: వ్యాపారులకు సరళీకృత విధానం ద్వారా సేవలందించే ఉద్దేశంతో వాణిజ్యపన్నుల శాఖ అమలు చేస్తున్న ఇ- రిజిస్ట్రేషన్ విధానం అక్రమార్కులకు వరంగా మారింది. వాణిజ్యపన్నుల శాఖలోని సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్(సీఆర్‌యు) ద్వారా ఆన్లైన్లోనే వ్యాట్ డీలర్‌గా, సీఎస్టీ డీలర్‌గా నమోదైన వ్యక్తులు అక్రమ పద్ధతుల్లో వ్యాపారాలు సాగిస్తూ పన్ను ఎగ్గొడుతున్నారు. ముఖ్యంగా 14.5 శాతం వ్యాట్ ఉన్న సరుకుల వ్యాపారం చేసే డీలర్లు అంత మొత్తంలో పన్ను చెల్లించకుండా 2 శాతం పన్నుతో బయటపడేందుకు ఇ- రిజిస్ట్రేషన్ విధానాన్ని వినియోగించుకుంటున్నారు. తద్వారా వాణిజ్యపన్నుల శాఖకు వచ్చే పన్నుకు రూ.కోట్లలో గండి పడుతోంది. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే ఆ నంబర్‌తో ఆన్లైన్లోనే సి-ఫారాలు, వేబిల్లులు జనరేట్ చేసుకునే అవకాశం ఉండటంతో అక్రమార్కులకు పన్ను ఎగవేసేందుకు అవకాశం లభిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని కంపెనీలు ఇక్కడి రిజిస్టర్డ్ డీలర్‌తో వ్యాపారం సాగిస్తే 2 శాతం పన్ను చెల్లించే వెసులుబాటు ఉండటంతో బోగస్ పేర్లతో డీలర్లను సృష్టించి దొంగ సీ- ఫారాలు, వేబిల్లులతో రూ. కోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ప్లైవుడ్ అక్రమ రవాణాకు ఇదే విధానాన్ని అవలంబించినట్లు తేలడంతో.. అధికార యంత్రాంగం 14.5 శాతం పన్ను చెల్లించే ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టింది. మార్బుల్, ఐరన్, స్టీల్, మసాలా దినుసులు, బాస్మతి బియ్యం, సెల్ఫోన్లు, ఎల క్ట్రానిక్ వస్తువులు వంటి వ్యాపారాలు సాగిస్తున్న వారి రిజిస్ట్రేషన్లను తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఇ- రిజిస్ట్రేషన్ల ద్వారా వ్యాట్, సీఎస్టీ డీలర్లుగా నమోదైన వారి వివరాలు సేకరిస్తోంది. గుర్తింపు కార్డు, చిరునామా ఉంటే చాలు ఇ-రిజిస్ట్రేషన్ విధానం లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలున్నాయి. ఈ మెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు ఉన్నవారెవరైనా వ్యాపారిగా, వ్యాట్, సీఎస్టీ డీలర్‌గా నమోదుృచేసుకోవచ్చు. మూడు నెలల లోపు సదరు వ్యక్తి ఇచ్చిన సమాచారంపై అనుమానం వస్తే వాణిజ్య శాఖ అధికారులు తనిఖీ చేస్తారు. అయితే సిబ్బంది కొరత కారణంగా ఇదీ నామమాత్రంగానే జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. దాంతో నకిలీ అడ్రస్, ధ్రువపత్రాలతో పలువురు డీలర్‌గా రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఢిల్లీ, ముంబై, కేరళ, గుజరాత్ నుంచి భారీగా దిగుమతి హైదరాబాద్‌కు దిగుమతి అవుతున్న సున్నితమైన వినిమయ వస్తువులు (సెన్సిటివ్ కమోడిటీస్) ప్రధానంగా ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో ఇ- రిజిస్ట్రేషన్ ద్వారా డీలర్లుగా నమోదై ఆయా రాష్ట్రాల నుంచి సరుకును దిగుమతి చేసుకున్న ఏజెన్సీలు, డీలర్లపై వాణిజ్యపన్నుల శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దృష్టి పెట్టింది. -
బిజినెస్మెన్ కావాలనుకున్నా..
కసితో రాజకీయూల్లోకి వచ్చా మా కుటుంబంలో వరుస విషాదాలు అన్నయ్య మరణం తర్వాత ఎదురైన ఘటన కలచివేసింది రాజకీయంగా నాపై కుట్రలు చేశారు రెండుసార్లు ఓడిపోరుునా నిరాశ చెందలేదు కేసీఆర్ నన్ను ఎంతో ఆదరించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ సాక్షిప్రతినిధి, వరంగల్: మాది హన్మకొండ వడ్డేపల్లి. మా ముత్తాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. నాన్న దాస్యం రంగయ్య విద్యుత్ శాఖలో ఉద్యోగి. అమ్మ శిలోత్రిదేవీ. నా భార్య రేవతి. నాకు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు, ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్లు. పెద్దన్నయ్య ఉదయభాస్కర్ ఇంజినీర్. రెండో అన్నయ్య ప్రణయ భాస్కర్, తమ్ముడు విజయభాస్కర్. నాన్న సిస్టమేటిక్. అన్ని పద్ధతిగా ఉండాలనే వారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉండే కాకతీయ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నా. హైదరాబాద్ సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశా. అనంతరం నృపతుంగా కాలేజీ లో డిగ్రీలో చేరాను. కానీ, పూర్తి చేయలేదు. అప్పు డు హైదరాబాద్‌లో వ్యాపారం మొదలుపెట్టి.. దానిపైనే శ్రద్ధ పెట్టిన. అదే సమయంలో నాన్నకు యాక్సిడెంట్ కావడంతో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వచ్చాం. మాకు వరంగల్‌లో ఫంక్షన్ హాల్ ఉండేది. జీవితంలో పెద్ద షాక్... అన్నయ్యకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. నిత్యం ప్రజలతో ఉండేవారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే వెళ్లేవారు. మొదటి నుంచీ టీడీపీలోనే ఉన్నారు. 1989లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1994 ఎన్నికల్లో గెలిచారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది. యువజన సర్వీసుల శాఖ మంత్రి అయ్యారు. టీడీపీలో జరిగిన పరిణామాలతో అన్నయ్య మంత్రి పదవికి దూరమయ్యారు. ఆ తర్వాత స్తబ్ధుగా ఉన్నారు. అన్నయ్య అప్పుడే అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడబోతుంటే అప్పటి స్పీకర్ సభలో తెలంగాణ పదం వాడవద్దని అన్నారు. ఇప్పటికీ ఈ విషయాన్ని మా పార్టీ అధినేత కేసీఆర్ చెబుతుంటారు. అన్నయ్య క్రియాశీలకంగా ఉన్నప్పుడు.. క్యాన్సర్ రూపంలో దురదృష్టం మా ఇంటికి వచ్చింది. అన్నయ్యను మాకు దూరం చేసింది. అది నా జీవితంలో పెద్ద షాక్. ఆ సంఘటన తలుచుకుంటేనే భయంగా ఉంటుంది. రాజకీయాల ఆలోచన ఉండేది కాదు.. రాజకీయాల్లోకి రావాలని నాకు ఎప్పుడు ఉండేది కాదు. ప్రత్యక్ష రాజకీయాల ఆలోచన అసలే లేదు. అప్పటికి అన్నయ్య ప్రణయభాస్కర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు ఆసరాగా ఉండేవాడిని. ఎప్పటికైనా వినూత్నంగా చిన్న పరిశ్రమ స్థాపించి మంచి బిజినెస్‌మెన్‌గా పేరు సంపాదించాలని కోరిక ఉండేది. స్కూల్ రోజుల నుంచీ ఇదే కోరిక. 1990లోనే మా స్నేహితుడు రవీందర్‌రెడ్డి నేను కలిసి ఆర్ఆర్ ప్రొడక్ట్స్ పేరుతో కొన్ని ఉత్పత్తులు మొదలుపెట్టాం. అప్పుడు క్యాప్టెన్కుక్ ఉప్పు వచ్చింది. దాన్ని చూసి అయోడిన్ ఉప్పును ప్యాకెట్లుగా చేసి అమ్మే వ్యాపారం చేశాం. అజయ్ బ్రెష్‌లను చూసి టూత్‌బ్రష్‌లను తయారు చేసి అమ్మాం. మరో మిత్రుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పేపర్ ప్లేట్ల్ తయారు చేశాం. ఏదైనా కొత్త పరిశ్రమల స్థాపించి మంచిగా ఎస్టాబ్లిష్ కావాలనే లక్ష్యం నెరవేరలేదు. ప్రజలకు ఉపయోగపడేలా మంచి థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఇప్పటికీ ఉంది. ఆ ప్రయత్నం చేస్తాను. క్వార్టర్ ఖాళీతో కసి... ఎమ్మెల్యేగా ఉన్నప్పడు అన్నయ్యకు క్వార్టర్ కేటాయించారు. అన్నయ్య మృతిచెంది కొద్ది రోజులే అయ్యాయి. ఒకసారి కుటుంబం మొత్తం వరంగల్‌కు వచ్చాం. ఆ సమయం చూసి క్వార్టర్ ఖాళీ చేయించారు. ఇది జరిగిన తీరు నన్ను తీవ్రంగా కలిచివేసింది. మేం లేని సమయం చూసి సమాన్లు మొత్తం బయట వేశారు. వెళ్లి చూసేసరికి క్వార్టరుకు తాళం వేశారు. జిల్లా రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి.. ఇలాగా చేసేది అనుకున్నా.. అప్పుడే కసి మొదలైంది. రాజకీయంగా నిలదొక్కుకోవాలనుకున్నా. ఎప్పటికైనా నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అన్నయ్యతో ఉన్న వాళ్లు చాలా మంది అప్పటికే ఒత్తిడి తెస్తున్నారు. వారి సహకారం ఉంటుందని చెప్పారు. ఎప్పుడైనా ఒకేలా... ప్రజల మధ్య ఉంటే ఆదరణ ఉంటుందనే విషయాన్ని బలంగా నమ్ముతాను. ఎన్నికల సమయంలో ఒకలా.. లేనప్పుడు మరోతీరుగా ఉండలేను. ఎన్నికల ఫలితాలు వచ్చి ఓటమి పాలైన వెంటనే నా వెంట ఉండే వాళ్లతో ‘చాయ్ తాగి వెళ్దాం’ అన్నాను. గెలిచినా అలాగే చెబుతాను. అన్నయ్యతో ఉన్న వాళ్లు చాల మంది ఇప్పుడు నాతో ఉన్నారు. మొదటి నుంచీ మమ్మల్ని నమ్ముకున్నారు. అందుకే నేను ఏ విషయంపై అయినా అందరితో చర్చిస్తా. యువకులు మొదటి నుంచీ వెంట ఉంటున్నారు. కార్మిక సంఘాలు అండగా నిలుస్తున్నారు. ఆటోలకు పన్ను మినహాయింపు విషయాన్ని నేను, గుడిమల్ల రవికుమార్ మా అధినేత కేసీఆర్ దృష్టికి ఒకసారి తీసుకెళ్లాము. ఆయన మరింత ముందుకువెళ్లి ట్రాక్టర్లకు సైతం వర్తింపజేశారు. ఇప్పడు మా నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నాపై ఉంది. ఓటమి.. గెలుపు పొత్తులో భాగంగా 1999 ఎన్నికల్లో హన్మకొండ స్థానాన్ని బీజేపీకి ఇచ్చారు. స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయా. 2004లోనూ ఇదే జరిగింది. ఇవన్నీ రాజకీయంగా అణగదొక్కాలనే కుట్రతోనే జరిగాయి. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు కాళోజీ నారాయణరావు, జయశంకర్ ఫొటోలతోనే ప్రచారం చేశాను. 1400 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఓటింగ్ యంత్రాలపై అవగాహన అంతగా లేకపోవడం వల్లే ఆ ఎన్నికల్లో ఓడిపోయానని నా అభిప్రాయం. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరాను. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నన్ను ఎంతో ఆదరించారు. 2006లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో 37వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాను. 2007లో హన్మకొండ నియోజకవర్గ ఇంచార్జీగా, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను. మా పార్టీ ముఖ్య నేతలు హరీశ్‌రావు, కేటీఆర్, వినోద్‌కుమార్‌లు నాకు రాజకీయంగా సహకరించారు. 2009లో టీఆర్ఎస్ టికెట్ వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచా. శాసనసభలో తెలంగాణ తల్లి సాక్షిగా ప్రమాణం చేశాను. అసెంబ్లీ నిబంధనల ప్రకారం లేదని చెప్పి మళ్లీ చేయించారు. 2010 ఉప ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఇటీవలి ఎన్నికల్లో ఇదే తీరుగా ఆశీర్వదించారు. తెలంగాణ సోయి... తెలంగాణ పెద్దలు కాళోజీ నారాయణరావు, కొత్తపల్లి జయశంకర్ సార్‌తో సన్నిహితంగా ఉండేవాడిని. అన్నయ్య మరణం తర్వాత ఆయన స్నేహితులు ప్రణయ్ మిత్ర మండలి ఏర్పాటు చేశారు. దీనికి కాలోజీ నారాయణరావు ప్రధాన సలహాదారుగా, జయశంకర్‌సార్ సలహాదారుగా ఉండేవారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ప్రణయ్ మిత్ర మండలిలో ఎక్కువగా చర్చలు జరుగుతుండేవి. ఒకసారి జయశంకర్‌సార్ ప్రోగ్రాం ఉంది. సాయంత్రం ఐదు గంటలకు అంటే సార్ ఐదు నిమిషాల ముందే వచ్చారు. అప్పటికి 10 మందే ఉన్నారు. అయినా సార్ మొదలుపెట్టారు. కార్యక్రమం ముగిసే సరికి 100 మందికిపైగా వచ్చారు. తెలంగాణ భావజాల వ్యాప్తి జరగాలని, పది మంది ఉన్నా, 10వేల మంది ఉన్నా చెబుతూనే ఉండాలని జయశంకర్ సారు అన్నారు. 1997 సమయంలో గాదె ఇన్నయ్య, వి.ప్రకాశ్, విజయ్‌కుమార్, లక్ష్మయ్య ఇతరులు తెలంగాణపై నిత్యం చర్చా కార్యక్రమాలు నిర్వహించేవారు. తెలంగాణ సమస్యలు తొలగిపోవాలనే ఆకాంక్ష అప్పుడే మొదలైంది. వరుస దెబ్బలు... 1997లో అన్నయ్య ప్రణయభాస్కర్ అకాల మరణం నాకు, మా కుటుంబానికి పెద్ద కుదుపు. దీన్ని నుంచి ఎలా తట్టుకోవాలా అనే సమయంలోనే వరుస విషాదాలు ఎదురయ్యూరుు. అన్నయ్య మృతి తట్టుకోలేక నాన్న అనారోగ్యంతో కోమాలోకి వెళ్లి ఆరు నెలలకు చనిపోయారు. నాన్న మరణంతో అమ్మ అనారోగ్యానికి గురై మృతిచెందారు. ఆమె తర్వాత నానమ్మ... ఇలా ప్రతి ఆరు నెలలు, ఏడాదికొకరు చొప్పున మాకు దూరమయ్యారు. ఆ సమయంలో మానసికంగా కుంగిపోయూను. ఇంట్లో పరిస్థితులు ఇలా ఉంటే బయట రాజకీయంగా కుట్రలు.. ఇవన్నీ తట్టుకునేందుకు దైవాన్ని ఆశ్రయించాను. ఏదైనా పని పూర్తి చేసే శక్తి, ఏకాగ్రత రావడానికి నాకు దైవ చింతన మార్గంగా ఉంటుంది. ఇప్పటికీ రోజు గం టపాటు పూజలు చేస్తా. మా ఇంటి దైవం భద్రకాళి అమ్మవారు. ప్రతి శుక్రవారం ఉదయమే అమ్మను దర్శించుకుంటా. ఆగస్టు 15న జాతీయ జెండా అక్కడే ఎగురవేశా. రోజూ ఉదయం 5.30 కు యోగా, మెడిటేషన్ చేస్తా. రాజకీయ సమస్యల నుంచి బయటపడేందుకు ఇవి దోహదపడుతాయి. రాజకీయంగా కుట్ర చేశారు రాజకీయూల్లోకి వచ్చి టీడీపీలోనే కొనసాగా. నా శైలిలో పని చేసుకుంటూ పోయా. అన్నయ్య చనిపోయాక వచ్చిన ఉప ఎన్నికల్లో వదినకు టిక్కెట్ వచ్చింది. అప్పుడు కుట్ర చేసి గెలవకుండా చేశారు. టీడీపీ వేదికలపై తెలంగాణ గురించి నేను ప్రస్తావించడం మా పార్టీలోనే కొందరికి నచ్చలేదు. నాకు రాజకీయంగా అవకాశాలు రాకుండా చేశారు. పార్టీ నుంచి బయటికి వచ్చాక భౌతికంగా ఇబ్బంది పెట్టాలని చూశారు. తెలంగాణ విషయం మాట్లాడుతున్నారనే కారణంతో తరాలపల్లి ఎన్కౌంటర్ సంఘటనను ఆసరా చేసుకుని నాపై కుట్ర చేశారు. మిషనరీ ఆస్పత్రి స్థలం విషయంలో న్యాయం కోసం నిలిచిన నాపై భౌతిక దాడులకు ప్రయత్నించారు. ఈ విషయంలో కేసు పెట్టించా రు. విచారణ తర్వాత పేరు తీసేశారు. -
బాసరలో ఎస్పీ ఆరా
ముథోల్/బాసర, న్యూస్‌లైన్ : బాసరలో ముగ్గురు హత్యకు గురైన సంఘటన స్థలాన్ని ఆదివారం ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. వ్యాపారి ఇంట్లో జరిగిన ఘాతుకం తెలుసుకునేందుకు భైంసా డీఎస్పీ దేవిదాస్ నాగులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వ్యాపారి అశోక్ దంపతుల హతమార్చిన స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ద్వారం వద్ద పొడవాటి కట్టెను స్వాధీనం చేసుకున్నారు. కట్టెతో తలపై మోది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కట్టెకు ఒక వైపున రక్తపు మరకలు ఉన్నాయి. అనంతరం ఒకటవ అంతస్తులోకి వెళ్లి ఎస్పీ అక్కడ పనిచేసే వారితో పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రక్షణ కల్పించండి.. శారదానగర్‌కు వచ్చిన ఎస్పీ త్రిపాఠిని రక్షణ కల్పించాలంటూ కాలనీవాసులు విన్నవించుకున్నారు. ఇలాంటి సంఘటనలతో తమకు ఏమి తోచడం లేదని వారంతా గోడు వెళ్లబోసుకున్నారు. కాలనీలో ఉండేవారంతా ఐక్యంగా ఉండాలని పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. కాలనీలో ఐక్యంగా ఉంటూ పోలీసులకు సహకరించాలన్నారు. అనంతరం బాసర పోలీసు స్టేషన్‌కు చేరుకుని పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రిపుల్ ఐటీ సందర్శన.. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి బాసర ట్రిపుల్ ఐటిని సందర్శించారు. కళాశాలలో ర్యాగింగ్‌లాంటివి జరగకుండా కళాజాత ప్రదర్శనలతో విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని డీఎస్పీ దేవిదాస్ నాగులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాసరలో చదివే విద్యార్థులు ట్రిపుల్‌ఐటిలో పోలీసు ఔట్ పోస్టింగ్ ఏర్పాటు చేయించాలని ఎస్పీని కోరారు. ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులకు పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఈ విషయం పై దృష్టిపెడతామన్నారు.