టాలీవుడ్‌ ముద్దుగుమ్మ పెళ్లి కబురు..! | Kajal Aggarwal Wedding rumor on social media | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ పెళ్లి కబురు..!

Published Fri, Mar 3 2017 3:32 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ పెళ్లి కబురు..! - Sakshi

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ పెళ్లి కబురు..!

టాలీవుడ్ లో  అగ్ర హీరోయిన్‌గా  చలామణి అవుతున్న కాజల్‌ అగర్వాల్‌  పెళ్లికి సంబంధించి  పలు రూమర్లు  సోషల్‌ మీడియాలో​  చక్కర్లు కొడుతున్నాయి.  చారడేసి కళ్లతో  చందమామ సినిమాతో స్టార్ గా మారిన కాజల్, తెలుగు, తమిళ సినిమాల్లో  ఓ వెలుగు వెలుగుతోంది.  ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందిట. ఇదే  ఇపుడు  సోషల్‌ మీడియా టాప్‌ టాక్‌.   ముంబైకి  చెందిన ఓ  బిజినెస్ మెన్ తో కాజల్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనీ, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.  అంతేకాదు ఇరు కుటుంబ పెద్దలు వీరి ప్రేమ పెళ్ళికి  గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చేసారనీ, దీంతో వీరు  ఏడు అడుగులు వేయనున్నారనీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  కాజల్ చేసుకోబోయే వ్యక్తికి దేశవ్యాప్తంగా హోటల్స్ చైన్ ఉందని అంటున్నారు.

కాగా టాలీవుడ్‌ మెగా‍స్టార్‌  చిరంజీవి  సెన్సేషనల్‌ మూవీ  ఖైదీ నెం 150లో అమ్మడూ.. లెస్ట్‌ డు కుమ్ముడుతో  అభిమానులను కుమ్మేసిన ఈ కలువ కళ్ళ సుందరి కాజల్ కి ఈ ఏడాది బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి.  ప్రస్తుతం వివేగం, నేనే రాజు నేనే మంత్రి తో పాటు డీకే దర్శకత్వంలో ఓ లేడి ఓరియెంటెడ్   చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే  పెళ్లి కబుర్లపై కాజల్‌ అధికారింగా స్పందించేంతవరకు ఈ సస్పెన్స్‌ తప్పదు. మరి.. ఈ శుభవార్త  అభిమానుల చెవిన ఎపుడు వేస్తోందో.. వేచి చూడాల్సిందే..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement