హడలెత్తుతున్న వ్యాపారులు
Published Mon, Sep 26 2016 11:36 PM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM
పాత గుంటూరు: ఆదాయపు పన్ను ఎగవేతదారులైన వ్యాపారవేత్తలపై ఐటీ శాఖ కొరడా ఝుళిపిస్తుంది. నెలరోజుల వ్యవధిలో నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలైన సబ్బుల వ్యాపారి, బంగారు వ్యాపారి, వస్త్ర దుకాణ దారుల దుకాణాలు, నివాసాలపై ఆకస్మికంగా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి పెద్ద మొత్తంలో నగదుతో పాటు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఆదాయ వెల్లడి పథకం 2016 అనే పథకాన్ని ప్రవేశపెట్టి పన్ను చెల్లింపు దారుల నుంచి అప్రకటిత ఆస్తులపై పన్ను రాబట్టేందుకు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 30తో ఈ పథకానికి కేటాయించిన గడువు ముగియనుండటంతో వ్యాపార వేత్తలు, ప్రముఖుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.. ఏకకాలంలో నిర్వహిస్తున్న దాడులకు ఆదాయపన్ను శాఖకు వ్యాపార వేత్తలు తమకు చెందిన అప్రకటిత ఆస్తులను వెల్లడించి ఐటీ శాఖకు సహకరించి పన్ను సక్రమంగా చెల్లించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఐటీ శాఖ నిర్వహిస్తున్న వరుస దాడులతో ఆదాయపు పన్ను ఎగవేతదారులకు ముచ్చెమటలు పడుతున్నాయి.
Advertisement
Advertisement