Uppal Lover Attacked And Attempted Murder On Girlfriend After She Refused To Marry Him - Sakshi
Sakshi News home page

ఉప్పల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం

Published Tue, Jul 25 2023 8:30 AM | Last Updated on Tue, Jul 25 2023 11:59 AM

Jilted lover attacks girl in hyderabad - Sakshi

హైదరాబాద్: ఉప్పల్‌ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి నిరాకరించిందని కక్ష పెట్టుకున్న అతను కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన యువతి తప్పించుకుని పారి పోయి కుటుంబ సభ్యుల సహకారంతో అసుపత్రిలో చేరింది. ఈ సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పోలీసులు తెలిపిన మేరకు..హబ్సిగూడ ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ(31) వివాహితుడు.

షార్ట్‌ ఫిలింలతో పాటు వీడియో ఎడిటింగ్‌ చేస్తుంటాడు. రామంతాపూర్‌లో నివాసముండే బందువుల అమ్మాయి(22)కి లక్ష్మీనారాయణ వరుసకు మేన బావ. లక్ష్మీనారాయణతో కలిసి యువతి సోషల్‌ మీడియాలో రీల్స్‌ కూడా చేసినట్లు సమాచారం. అదే చనువును ఆసరాగా చేసుకుని లక్ష్మీనారాయణ పెళ్లి ప్రపోజల్స్‌ తీసుకు వచ్చాడు. అతడికి పెళ్లి ఆయిన కారణంగా యువతి నిరాకరించింది.  ఈ  మధ్య కాలంలో యువతికి సినిమా ఫీల్డ్‌లో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి లక్ష్మీనారాయణను పెద్దగా  పట్టించుకోవడం లేదు.

దీంతో యువకుడు ఈ నెల 22న యువతిని తన కారులో ఎక్కించుకుని ఉప్పల్‌ భగాయత్‌కు తీసుకు వచ్చాడు. మళ్లీ పెళ్లి ప్రస్తావను తీసుకు వచ్చాడు. ఇద్దరి మద్య వాగ్వివాదం పెరిగింది.  ముందుగానే పథకం వేసుకున్న లక్ష్మీ నారాయణ తన వెంట తెచ్చుకున్న కత్తితో కారులోనే యువతి గొంతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలైన యువతి తప్పించుకుని బయటకు వచ్చి చున్నీని మెడకు చుట్టుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరి్పంచారు. కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement