సాక్షి, నర్సాపూర్, నిజామాబాద్ రూరల్: రైతుబంధు ఉండాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు పథకాన్ని కలలో కూడా ఎవరూ ఊహించలేదని తెలిపారు. మొట్టమొదటిసారి రైతుబంధును పుట్టించిందే బీఆర్‌ఎస్ అని, ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందుతుందన్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారం రోజుల్లోనే రూ. 5 లక్షల బీమా అందిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావద్దని.. పార్టీలు, నాయకుల గురించి చర్చ జరగాలని పేర్కొన్నారు.
ఒకప్పటి కాంగ్రెస్ పాలన, ప్రస్తుత బీఆర్‌ఎస్ పాలన ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. 24 గంటల కరెంట్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, మూడు గంటల కరెంట్‌తో పొలాలు పండుతాయా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అయితే.. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. తెలంగాణను ఏడిపించేదే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.
చదవండి: చిదంబరానికి మంత్రి హరీష్ రావు కౌంటర్
బెంగుళూరును దాటనున్నాం..
రాష్ట్రంలో ఇండస్ట్రీల కోసం బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చి పెట్టుబడులు సమకూర్చుతున్నామని కేసీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నామని, త్వరలోనే బెంగళూరును దాటే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి, ఆదాయం పెరిగిందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ వచ్చినప్పుడు భారత్‌లో రాష్ట్రంలో 19 వ స్థానంలో ఉంటే.. నేడు 3 లక్షల 18 వేలతో తసలరి ఆదాయంలో ఇండియాలో నంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు.
‘రైతుబంధు దుబారానో లాభమో రైతులు తేల్చాలి. మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 24 గంటల కరెంట్ ఉండాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలి. రైతులందరూ 10 హెచ్‌పీ మోటార్ పెట్టుకోవాలని రేవంత్ అంటున్నారు. 3, 5 హెచ్‌పీ మోటారు ఉంటది రైతుల వద్ద. ఇప్పుడు 10 హెచ్‌పీ మోటార్ ఎవడు కొనియ్యాలి? ఎన్ని అవస్థలు.. ఎన్ని లంచాలు గతంలో. ఇవాళ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలడం లేదు. ఏ బాధ లేదు. మంచిగా రైతు పండించుకున్నంత చేతికి డబ్బులు వస్తున్నాయి’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment