బైక్, లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి.
బైక్, లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం నర్సాపూర్-సంగారెడ్డి రహదారిలోని బివిఆర్‌ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన బి.పవన్ బైక్‌పై బివిఆర్‌ఐటి కాలేజీలో తన బందువును వదిలిపెట్టి తిరిగి దౌల్తాబాద్ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ నుజ్జునుజ్జు కాగా పవన్ తలకు, రెండు కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్సులో అతన్ని నర్సాపూర్‌కు తరలించగా స్థానిక వైద్యులు పరీక్షలు చేసి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డికి తరలించారు.