నర్సాపూర్ : మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఓ దళిత బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు మంగళవారం రాత్రి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని ఏఎస్‌ఐ సుభాష్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన బాలిక మంగళవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో బహిర్భూమికని ఇంటి బయటకు వెళ్లింది. అయితే ఈ విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన పీ కరుణాకర్ బాలిక వద్దకు వెళ్లి చేయి పట్టి లాగాడు.
అయితే బాలిక కేకలు వేయడంతో కరుణాకర్ అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కరుణాకర్‌పై నిర్భయతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సుభాష్‌రెడ్డి తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు.
బాలికపై అత్యాచారయత్నం
Published Thu, Sep 25 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement