ఖమ్మం జిల్లా కొత్తగూడెం క్రాస్ రోడ్డు వద్ద ఆగిఉన్న టిప్పర్ను కారు ఢీ కొట్టింది.
ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం క్రాస్ రోడ్డు వద్ద ఆగిఉన్న టిప్పర్ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సింగరేణికి చెందిన ఏజీఎంతో సహా ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.