శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా దళాలపై కశ్మీర్ లోని బడ్గమ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు. ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ తో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరళించారు. ఘటన అనంతరం ఆర్మీని అప్రమత్తం చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల సీఆర్ఫీఎఫ్ భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందగా మరో 22 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
భద్రతా దళాలపై 'ఉగ్ర' కాల్పులు
Published Fri, Jul 1 2016 7:08 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement