రాజమండ్రి రూరల్ (తూర్పుగోదావరి) : మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు అజాగ్రత్తగా కారు నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మండలం కోలమూరులో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురిక తీవ్ర గాయాలయ్యాయి.
మాజీ ఎంపీ తనయుడు సుందర్ శనివారం అర్థరాత్రి కారులో వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టటంతో మహేష్, చంటి, మనోజ్ అనే స్థానిక యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. హర్షకుమార్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
మాజీ ఎంపీ తనయుడి కారు ఢీకొని ముగ్గురికి గాయాలు
Published Sun, Jun 28 2015 10:17 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM
Advertisement
Advertisement